Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వైపు పోలీస్ ఉద్యోగాల పరీక్ష, మరోవైపు సెంట్రల్ ఆర్మ్ పోర్స్ ఉద్యోగాల పరీక్ష. ఆగస్టు 7న ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాయాలి? ఉద్యోగ నియామక సంస్థల మధ్య అవగాహన సహకారం లేకపోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కేంద్ర ఉద్యోగ నియామక సంస్థలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక సంస్థలు ఉద్యోగ రాత పరీక్ష తేదీలను పరస్పరం తెలుసుకుని సమీక్షించుకోవలసి ఉంటుంది. కానీ ఆ రెండు సంస్థలూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో స్క్రీనింగ్ పరీక్ష ఆగస్టు ఏడో తేదీన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. కానీ అదే రోజు మరొక రాతపరీక్ష కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని సుమారు లక్షమంది నిరుద్యోగులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నరు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ ఉద్యోగాల పరీక్ష కూడా ఆగస్టు 7వ తేదీన నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఈ ఆందోళనకు కారణం. అందువల్ల ఏదైనా ఒక పరీక్ష తేదీని మార్చాలని తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- రావుల రాజేశం, కరీంనగర్.