Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్థిక వ్యవస్థకు కొలమానం డబ్బు... నోట్లు కావచ్చు, కాయిన్స్ కావచ్చు. ప్రజల్లో అవి మారకం జరగడం తోనే అమ్మకం, కొనుగోళ్లు జరుగు తాయి. తద్వారా దేశం ఆర్థికంగా పరిపుష్టంగా తయారవుతుంది. వాటికి మారకం విలువ తగ్గిపోవడంతో కొన్ని కాయిన్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. ఐదుపైసలు, పది పైసలు, చారాణా, ఆటాణా అనేవి మ్యూజియానికి పరిమితమై చాలా కాలం అయింది. కాకపోతే కొంత మంది కలెక్షన్ చేసి దాచిపెట్టుకుం టున్నారు. తాజాగా పది రూపాయాల కాయిన్ అదేకోవలోకి పోతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. పది రూపాయల నోటు చెల్లుబాటు అవుతున్నది. కానీ పది కాయిన్ చెల్లుబాటు కావడం లేదు. పేద, మధ్యతరగతి, చిరు వ్యాపారులు అత్యధికంగా ఉపయోగించే ఈ కాయిన్ ఎందుకు మారడం లేదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కండక్టర్, జనరల్‌స్టోర్, జిరాక్స్, చారు కొట్టు...ఇలా ఏదైనా కావచ్చు... ఒకే మాటగా చెబుతున్నారు. అది మారడం లేదు సార్ అని. మన దేశంలో తయారైన కాయిన్, మనదేశంలోనే మారకం జరగడం లేదంటే, దేశభక్తికి వకాల్తా పుచ్చుకున్న కేంద్ర బీజేపీ సర్కారు...కండ్లుండి చూడలేని కబోదిలా తయారైంది. రోజుకో ప్రకటన చేస్తూ... వృద్ధి రేటు గురించి చెప్పే ఆర్బీఐ కూడా ఈ టెన్ కాయిన్ విషయమై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కేంద్రానికి చిన్న సమస్యలా కనిపిస్తున్నా? ఇది ప్రజలకు పెద్ద సవాల్‌గా మారింది...
- గుడిగ రఘు