Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోటీలు తీసే సాధనంగా 'కెమెరా' మనందరికీ అనాదిగా పరిచయమే. మన ఇండ్లల్లో గోడలకు వేళాడే ఫొటోలు తమ గత జీవితపు ముఖ్య సన్నివేశాలు, వేడుకలను నిత్యం గుర్తు చేస్తుంటాయి. ఫొటోగ్రఫీ అనగా 'వెలుతురుతో వ్రాయడం' అని, 'కెమెరా అబ్క్సూరా' అనగా 'చీకటి గది' అని అర్థం. 2017 వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.2 ట్రిలియన్ డిజిటల్ ఫొటోలు అందుబాటులో ఉన్నాయని అంచనా. జీవితంలో ఓ భాగమైన కెమెరా ప్రాధాన్యాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం ప్రతి ఏటా 29 జూన్ రోజున ''ప్రపంచ కెమెరా దినం'' పాటించుట ఆనవాయితీగా మారింది.
కెమెరా, ఫొటోగ్రఫీ చరిత్ర:
కెమెరా, ఫొటోగ్రఫీ చరిత్ర 1825లో హెలియోగ్రాఫ్ రూపంలో 'జోసెఫ్ నైసీ' చొరవతో ప్రారంభమైంది. 1839లో 'లూయిస్ జాఖీస్ డగ్యూరె' కషితో ప్రథమ వెలసిపోని ఫొటోను తీయడంతో వారిని 'ఫొటోగ్రఫీ పితామహుడు'గా పిలుస్తున్నారు. ఫొటోగ్రఫీ రంగంలో స్థిరమైన ఫొటోఫిలిమ్ రూపకర్తగా 'జార్జ్ ఈస్ట్మన్' పరిశోధనలో 1888లో తొలి 'కొడాక్' కెమెరా ఆవిర్భవించింది. 1936లో జపాన్ దేశంలో 'కానన్' కెమెరా తయారుచేయబడి అమ్మకానికి వచ్చింది. 1989లో తొలి 'డిజిటల్ కెమెరా'ను జపాన్లోని 'ఫ్యూజీ' కంపెనీ వాణిజ్యపరంగా విడుదల చేసింది. 2010 వరకు మార్కెట్లో 'డిజిటల్ వీడియో కెమెరా' అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోటోల ప్రాధాన్యతను గుర్తించిన అంతర్జాతీయ సమాజం ప్రతి ఏట 29 జూన్ రోజున 'ప్రపంచ కెమెరా దినం' జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అత్యంత మేలైన డిజిటల్ కెమేరాలను నిర్మించిన కంపెనీగా 'కొడాక్'కు గుర్తింపు ఉన్నది.
జీవితంలో భాగమైన స్మార్ట్ఫోన్ కెమెరా:
వేడుకల్లోని సంతోష క్షణాలను బంధించడం, ప్రకతి అందాలను బంధించడం, నేర ఘటనలకు సాక్ష్యంగా నిలవడం, ముఖ్య సన్నివేశాలను భావితరాలకు అందించడం, సమాజహిత కార్యాలు, చారిత్రాత్మక ఘటనలు, సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు లాంటి పలు సందర్భాలలో కెమెరాలు తీసే ఫొటోలు మనందరికీ తెలుసు. 2000 నాటికి స్మార్ట్ ఫోన్లో కెమెరా ఇమిడి ఉండడంతో సాంప్రదాయ కెమెరాలకు ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. కెమెరా లేకుండా నిన్నటి గుర్తులు సజీవంగా కనిపించవు. 'ఒక ఛాయాచిత్రం వేల మాటలకు సమాన అర్థాన్ని ఇస్తుంది' అనేది అతిశయోక్తి కాదు. గత స్మతులకు నిలువెత్తు సాక్ష్యాలు ఛాయాచిత్రాలు. నేడు మన చేతిలో ఇమిడి ఉన్న స్మార్ట్ ఫోన్ల మాద్యమంగా 'సెల్ఫీ ఫొటోలు' తీసుకునే ఆధునిక సాంకేతిక ఉపకరనాలు మనకు చేరువైనాయి. కెమెరాతో ఫొటోలు తీయగలగడం అనేది ఓ అద్భుత కళ. ఒక చక్కటి ఛాయాచిత్రం ఓ అద్భుత మనోఉల్లాసానికి కారణం అవుతుంది. ఓ ఫొటో వేల ఏండ్లు చరిత్రకు సాక్షిగా నిలుస్తుంది. నేటి స్మార్ట్ ఫోన్లో ఇమిడి ఉన్న అత్యాధునిక కెమెరాను ఉపయోగించి నిత్యం ఎన్నో అద్భుత సన్నివేశా లను బంధిస్తున్నాం. నేటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కెమేరాతో క్షణాల్లో ఫొటో తీయడం, వేల ఫొటోలను సేవ్ చేసుకోగలగడం, ఫొటోలను తిరిగి మెరుగు పరుచు కోగలగడం లాంటి వసతులు అందు బాటులోకి వచ్చాయి. సన్నివేశాలను బంధించే సదవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనందరం ప్రయత్నిద్దాం.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్:9949700037