Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబియాకు నూతన అధ్యక్షుడైన గుస్తావో పెట్రో ఎన్నిక గురించి అతిగా అంచనా వేయలేము. ఆ ప్రాంతం రెండువందల సంవత్సరాల చరిత్రలో జనాభా రీత్యా 3వ అతిపెద్ద దేశమైన కొలంబియాలో వామపక్షం అధ్యక్ష భవనంలో కాలుపెట్టడం ఇదే మొదటిసారి. దేశ చరిత్రలో మొట్ట మొదటిసారి 58శాతం ఓటర్లు పాల్గొని కోటి పదిలక్షల ఓట్లు వేసిన అధ్యక్షుడు 'పెట్రో'నే. దేశం యావత్లో అత్యధిక మంది ఈయనవైపే మొగ్గటం కీలకాంశం. మొట్టమొదటిసారి ఒక ఆఫ్రో - కొలంబియన్ మహిళ ఫ్రాన్సి యామార్క్వెజ్ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆమె ప్రముఖ పర్యావరణ కార్యకర్త కూడా. ఆ దేశంలోని అత్యంత పేదలుండే ప్రాంతానికి చెందిన మహిళ ఆమె.
కొలంబియా గొప్ప చరిత్ర, అక్కడి వాస్తవికతలు లాటిన్ అమెరికాలో అతిగొప్ప నవలాకారుడు గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్‌కు నోబెల్ బహుమతి వచ్చేలా చేసాయి. లాటిన్ అమెరికా రంగుల లోకాన్ని మార్క్వెజ్ తన కాన్వాస్‌పై చూపారు. అలానే దేశాధ్యక్షుడుగా ఎన్నికైన పెట్రో గాథ కూడా. ఆయన పట్టణ ప్రాంత మాజీగెరిల్లా యోధుడు. 1960 నుండి 2016 వరకు ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలం సాయుధ పోరాటం జరిగింది కొలంబియాలోనే. పెట్రో ముందున్న సవాళ్లు ఆ ప్రాంతంలోని మిగిలిన దేశాల్లో ఎన్నికైన పాలకులు ఎదుర్కొనే సమస్యలవంటివే! ఆగస్టు 7న ఆయన పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన్ని ముసురుకునేవే!
కరోనా దుష్ఫలితాలే!
చిలీలో గాబ్రియల్ బోరిక్, హూండూ రాస్‌లో జియోమాం కాస్ట్రో, బోలీవియాలో లూయిస్ అర్సె, పెరులో పెడ్రో కాస్టిల్లోల విజయాల నేపథ్యంలోంచే కొలంబియాలో పెట్రో విజయాన్ని చూడాలి. దానికంటే ముందు మెక్సికోలో లోపేజ్ ఓబ్రడార్, అర్జెంటీనాలో అల్బర్టో ఫెర్నాండెజ్‌ల విజయాలు లాటిన్ అమెరికాలో పునరుద్థానం పొందుతున్న వామపక్షాల బలానికి నిదర్శనాలు. అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో బ్రెజిల్లో లూలా గెలుస్తాడని ప్రస్తుతం సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ అల పరిపూర్ణమవుతుంది. వీరందరి విజయాలు కరోనా దెబ్బకి ఆ ప్రాంతం విలవిల్లాడిన ఫలితంగా సాధ్యమైంది. ప్రపంచంలోని మొత్తం మరణాల్లో 30శాతం ఈదేశాల్లోనే జరిగాయి. ఇది ప్రపంచ జనాభాలో 8శాతం. కొన్ని దేశాల్లోని మితవాద ప్రభుత్వాలు మీడియా వచ్చేది తప్పు అని ఖండించడం తప్ప వారి ప్రజలకి మెరుగైన సేవలందించింది లేదు. దీనికి పెద్ద ఉదాహరణ బ్రెజిల్. బొల్సొనారో హయాంలో సుమారు 7లక్షల మరణాలతో మితవాద విధానాల అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపింది.
దీన్నే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా Ê కరీబియన్ (లిక్‌లాక్) 120సంవత్సరాలలో ఈ ప్రాంతం చవిచూసిన అతిదారుణ సంక్షోభం అన్నది. 2020లో ఈ ప్రాంత దేశాల ఆర్థిక వ్యవస్థ 7శాతం కుచించుకుపోయింది. ఇది ప్రపంచ జీడీపీ కంటే రెండురెట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన చిలీ 2022లో 1.4శాతం, 2023లో 0.1శాతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇది సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. ఏమైనా ప్రస్తుత పరిణామాలు లాటిన్ అమెరికాలో మరో ''పింక్ అల''కు దారితీస్తాయనిపిస్తోంది. ఇది ఈ శతాబ్దపు మొదటి దశకంలో జరిగిన పరిణామాలు రెండవ దశకంలో వెనక్కి తగ్గినా మళ్లీ పునరుద్ధాన మొందేటట్లున్నాయి. 2003-13 మధ్య కొన్ని ప్రధాన సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచంలోనే అంతరాలు విపరీతంగా ఉండే లాటిన్ అమెరికా ప్రాంతంలో సంపద పెరిగింది. పేద, ధనిక అంతరాలు కొంత తగ్గాయి. పేదరికం తగ్గింది. బ్రెజిల్, బొలీవియా, చిలీ, ఉరూగ్వే వంటి దేశాల్లో ప్రజల్ని పేదరికంలోంచి బయటపడేస్తూనే విత్తసంబంధమైన విధానాన్ని సరిగానే నిర్వహించవచ్చని రుజువు చేశారు ఆ దేశాల పాలకులు ఇది దక్షిణ అమెరికా దేశాల కూటమి ఏర్పాటు, కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ Ê కరీబియన్ స్టేట్స్(సెలాక్), పసిఫిక్ అలియన్స్ వంటి వాటి ఏర్పాటుకు దారితీసింది. దీనికి ఇరుసుగా ఉన్న త్రిమూర్తులు క్యూబా, వెనెజులా, చిలీల విదేశాంగ మంత్రులు 2012లో ప్రస్తుతం ఊహించలేని ప్రయత్నం చేశారు. ఇటు భారతదేశంతో, అటు చైనాతో చర్చలు జరిపారు.
బొగోటా ఎజెండా
రాబోయే సంవత్సరాలలో ఇటువంటి దానినే చూడబోతున్నమా? ఇంకో విధంగా చెప్పాలంటే, వామపక్షం రాకతో మనం మరో ''రాజకీయ శకం''లోకి అడుగు పెట్టనున్నామా? ఔను, వామపక్షం మళ్ళీ వచ్చింది. అయితే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అది ఏ విధమైన వామపక్షం?ఎంతకాలం మనగలుగుతుంది? అనేది. ఇది అనేక విధాలా భిన్నమైన వామపక్షం. బగోటా మాజీ మేయరు, ఆర్ధికవేత్త అయిన 62ఏండ్ల పెట్రో పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవాలనే దానిలో మునిగివున్నాడు. పెట్రోలియం, బొగ్గు లాంటి భూమి నుంచి లభించే శిలాజ ఇంధనాలపై కొలంబియా ఆధారపడకూడదని, సహజవాయువు, పెట్రోలియం వెలికితీతకు ఉపయోగించే ఫ్రాకింగ్ టెక్నిక్ వాడకూడదని, ఇంధన వాడకంలో మార్పులు జరగాలని ఆయన ఎజెండాలో ఉన్నది. అయితే ఆ దేశం ఆర్థిక ఆదాయంలో 40శాతం పెట్రోల్ ఎగుమతుల నుంచే వస్తుంది.
మరో లాటిన్ అమెరికా దేశమైన చీలి నాయకుడు బోరిక్ లైంగిక సమానత్వం మీద (ఇతని కాబినెట్లో మగవారికన్నా మహిళా మంత్రులు ఎక్కువగా ఉన్నారు), అలాగే స్థానిక ప్రజల హక్కులు సాధించటం మీద దృష్టి కలిగి ఉన్నాడు. కేవలం 10శాతం ప్రజలు దేశ ఆదాయంలో 60శాతం ఆదాయం పొందుతూ ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఉన్న చిలీని యూరప్ దేశాలతో సమానమైన సంక్షేమ రాజ్యంగా తయారుచేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గట్టిగా అభిప్రాయం పడుతున్నాడు. చిలీ కూడా కొలంబియా లాగ ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగాకలిగి ఉన్న దేశం.
హౌండురస్ (నశీఅసబతీaర) సమస్యలు మరో రకమైనవి. హౌండురస్ మాజీ అధ్యక్షుడు జుయాన్ ఓర్లండో హెర్మాండేజ్ తన పాలనలో దేశాన్ని అమెరికా క్రిందవుండే మొట్టమొదటి మాదక ద్రవ్యాల దేశంగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ హెర్మాండేజ్ అమెరికాలో అరెస్టయి ఉన్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన అవినీతి రాజ్య యంత్రాగాన్ని ధ్వంసంచేయటంలో, మత్తుపదార్థాల రవాణాతో కఠినంగా వ్యవహరించటంలో, ప్రపంచంలోనే ''హత్యల రాజధాని'' పేరు తెచ్చుకున్న హౌండురస్లోని శాన్ పెడ్రో సులా పట్టణంలో హింసా దౌర్జన్యాలను నియంత్రించటంలో కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన జియోమరా కాస్ట్రో (శఱశీఎaతీa జaర్తీశీ) బిజీ అయి పోయినాడు.
ఇవన్నీ ఇట్లా ఉండగా లాటిన్ అమెరికాకు అదనంగా కలిసి వచ్చిన అంశం గతంలో వామపక్ష వైపు మొగ్గు చూపిన ప్రభుత్వాల పాలన ఉండటం. 13 ఏండ్లు వర్కర్స్ పార్టీ బ్రెజిల్లో అధికారంలో ఉంది. అలాగే చీలి వామపక్ష పార్టీ కాన్సర్టెసియన్ (జశీఅషవత్ీaషఱóఅ) వరుసగా 20ఏండ్లు అధికారంలో ఉంది. ఆ తరువాత సోషలిస్టు పార్టీ నాయకత్వాన రెండవసారి అధికారంలోకి వచ్చిన మిషాల్ బాచిలెట్ (వీఱషష్ట్రవశ్రీశ్రీవ దీaషష్ట్రవశ్రీవ్)తో కలిసి మరో నాలుగేండ్లు (2014-2018) అధికారంలో ఉంది. అర్జెంటీనాను వామపక్ష కిర్చినర్స్ (ఖఱతీషష్ట్రఅవతీర) 12ఏండ్లు పాలించారు. బోలివియాలో ఈవో మోరల్స్ 13ఏండ్లు అధికారంలో ఉన్నాడు. ఈక్వెడార్‌లో రాఫెల్ కొర్రియా 10ఏండ్లు, యురుగ్వేలో ఫ్రెంటె అంపిలొ 2005-2020 వరకు అధికారంలో ఉన్నారు.
అయితే, ఇప్పుడున్నది ప్రత్యేక రాజకీయ వాతావరణం. ప్రభుత్వ వ్యతిరేకత అనే భావన రాజ్యమేలుతున్నది. కేవలం ఒక టర్మ్ అధికారంలో ఉండగానే ఆ ప్రభుత్వాల నిర్వకాలవల్ల ''రాస్కెల్స్ను బయటికి నెట్టండి'' అనే ఆలోచన ప్రజలకు కలుగుతుంది.
చట్టసభలలో (చాలా సందర్భాలలో) మెజార్టీలేక, తీవ్రమైన ఆర్ధిక పరిమితులలో, అల్లకల్లోలంగా ఉన్న అంతర్జాతీయ వాతావరణంలో, ప్రజలకు ఉపయోగకరమైన సంస్కరణల కార్యక్రమాన్ని చేపట్టటానికి అధికారంలోకి రానున్న ప్రభుత్వాలలో రాజకీయ పార్టీల కలయిక అంత తేలికగా సాధ్యమయేది కాదు.కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు త్వరితగతిని అభివృద్ధి సాధించటానికిగాను బ్రెజిల్‌కు చెందిన లూలా తోనూ, చీలికి చెందిన బోరిక్ తోనూ కలిసి పని చేయాలనే కోరికను పెట్రో వ్యక్తం చేసాడు. దక్షిణ అమెరికాలో ఒక రాజకీయ సమన్వయం ఏర్పాటుకు ఇది మొదటి అడుగు. అయితే, గతంలో ఏర్పడి విఫలమైన యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (ఖచీAూఖ=) నుంచి గుణపాఠాలు తీసుకోవటానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి.
అలీన విదేశాంగ విధానం పట్ల మొగ్గు
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తన వికృత రూపం ప్రదర్శిస్తున్న సమయంలో, 1950లలో జవహర్ లాల్ నెహ్రు ఆలోచనతో చురుకైన అలీన విదేశాంగ విధానాన్ని భారతదేశం అనుసరించింది. ఇప్పుడు 21వ శతాబ్దపు వాస్తవ పరిస్థితులకు ఆ విధానం అనుగుణంగా వుండటంతో ప్రభుత్వ విధా నాలు నిర్ణయించే బృందాలలో అది విస్తృత ఆసక్తిని కలిగిస్తున్నది. అంతర్జాతీయ వ్యవస్థలు మార్పులకు లోనవుతున్న తరుణంలో, ప్రపంచ వ్యవహారాలలో ఈ ప్రాంతం తన ఉనికిని తక్షణమే పునఃస్థాపించు కోవలసిన సందర్భంలో లాటిన్ అమెరికా దేశాలు తమ విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటంలో ఇది ఉపయోగకరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
- హిందూ సౌజన్యంతో
జోర్జ్ హీనీ