Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందేండ్ల కార్మిక చరిత్ర కలిగిన భారతదేశంలో నేడు 50.1కోట్ల మంది కార్మికు లున్నారు. ఇందులో 41.19శాతం (21కోట్ల మంది) వ్యవసాయరంగంలో, 26.18 శాతం (13కోట్లమంది) పారిశ్రామిక రంగంలో, 32.33 శాతం (16 కోట్ల మంది) సేవా రంగంలో పని చేస్తున్నారు. వీరుగాక మరో 50కోట్ల మంది అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి రక్షణ కోసం, భద్రత కోసం, పని గ్యాంరెటీ కోసం అనేక కార్మిక చట్టాలు చేయబడ్డాయి. ఈ చట్టాలన్ని పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చినవే.
కానీ, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నారు. ఉదాహరణకు 7 మంది కార్మికులుగా ఉంటే యూనియన్ ఏర్పర్చు కోవడానికి అవకాశం ఉంది. యూనియన్ అనుమతి లేకుండా యాజమాన్యం లాకౌట్, లేఆఫ్, రిట్రేంచ్ చేయవీలులేదు. 300మంది కార్మికు లకు పైగా ఉంటే తప్ప యజమాని తన ఇష్టం వచ్చిన్నట్లు లేఆఫ్‌లు, లాకౌట్లు, తొలగింపులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నిరుద్యోగులకు, ఉద్యోగ కల్పనకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే 15-65ఏండ్ల మధ్య గల ఉద్యోగిత శాతం అన్ని దేశాల్లో 70-80శాతం ఉండగా భారతదేశంలో 46.3 శాతం మాత్రమే ఉంది. నిరుద్యోగం 8.75శాతంగా ఉంది. యువకులలో 22.9శాతం ఉంది. కనీస వేతనం రోజుకు రూ.178 నుండి తగ్గిపోతున్నది. ఈ నిరుద్యోగ సమస్య పేరుతో ఉద్యోగంలో ఉన్నవారిలో అభద్రత సృష్టించి ప్రతి ఏటా నిజ వేతనాలను తగ్గిస్తున్నారు. ఇందుకు వీలు కల్పించే 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడంపై కార్మికవర్గం పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగి స్తున్నది. 1. కాంట్రాక్ట్ లేబర్ చట్టాలు 2. ట్రేడ్ యూనియన్ గుర్తింపు విధానం 3. ప్రస్తుత చట్టాలను సింప్లిపై చేయడం. 4. శాసనచట్టాలను రూపొందించడం ద్వారా ట్రేడ్ యూనియన్ చట్టాలను మార్చా లన్న ప్రయత్నం జరుగుతున్నది.
ప్రణాళిక సంఘాన్ని సైతం రద్దుచేసి దాని స్థానంలో నిటి అయోగ్‌ను ఏర్పర్చడం జరిగింది. సహకార వ్యవస్థను దాదాపు కేంద్రమంత్రి ఆమిత్‌షా నాయ కత్వం కిందకు తెచ్చి బ్యాంకింగ్ వ్యవస్థను, సహకారా ఫ్యాక్టరీలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నది. 2001 గణాంకాల ప్రకారం దేశంలో 5-14 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన 1.26కోట్ల మంది బాల కార్మికుల సంఖ్య నేడు రెట్టింపు అయ్యింది. మహిళా కార్మికులపై ఆసభ్య ప్రవర్తనలకు శిక్షలు విధించడానికి 2013లో వచ్చిన చట్టం నిరుపయోగంగా ఉంది. ఆఫీసులలోగానీ, కర్మాగారాలలోగానీ మహిళ లపై ఆఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఎనిమిది గంటల పనిదినాన్ని మోడీ ప్రభుత్వం 12గంటలకు పెంచడం అత్యంత దుర్మార్గం. ఉపాధి గ్యారెంటీ కల్పించాలి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని కార్మిక నిబంధనలలో స్పష్టంగా ఉంది. కానీ, ఇంత వరకు దేశంలో ఎక్కడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.
కర్మాగారాలలో ప్రమాదల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. 2014-16 మధ్య 3,562 ప్రమాదాలు జరుగగా, 51,124 మంది మరణించారు. 1982లో బోపాల్ గ్యాస్ ప్రమాదంలోని వేల మంది నేటికీ జీవచ్ఛావాలుగా ఉన్నారు. 2020-21 సంవత్సరంలో 95,000 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కార్మిక ప్రమాణాలు పాటించకపోవడం, పని జరిగే చోట భద్రత చర్యలు చేపట్టకపోవడం వలన అనేక మంది మరణిస్తున్నారు. వారి కుటుంబాలకు పరిహారం కూడ ఇవ్వడంలేదు. ఆ కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఆదా యం లేకపోవడంతో పిల్లలకు చదువు, వైద్యం లేక రోడ్లపై తిరుగుతున్నారు. చిన్నతనం లోనే ప్రమాదకర వృత్తుల్లో చేరి జీవనం సాగిస్తున్నారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంస్థ చెప్పిన భద్రతా ప్రమాణాలు భారతదేశంలో పాటించబడడం లేదని, ప్రమాణాలలో 131వ స్థానంలోకి దేశం దిగజారిపోయిందని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ తగు చర్యలు తీసుకోవడం లేదు. మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రయివేటీకరించే దిశగా కొనసాగుతున్నది. ఇప్పటికే 25 భారీ పరిశ్రమ లను పూర్తిగా అమ్మివేయడం జరిగింది. 5లక్షల కోట్ల వాటాలను ప్రభుత్వరంగ సంస్థలలో ఉపసం హరించుకున్నారు. జీవిత బీమా, విమానయాన రంగం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ లాంటి లాభాల్లో ఉన్న సంస్థలను కూడా తక్కువ రేట్లకు కార్పొరేట్లకు ఆంటకట్టే ప్రయత్నం జరుగుతున్నది. 27 బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించిన కేంద్రం, కార్పొరేట్లకు రుణ సౌకర్యం కల్పించడానికి నిధుల లభ్యతను అందుబాటులో పెట్టింది. 1968లో బ్యాంకుల జాతీయీకరణతో అనేక మందికి ఉద్యోగాలు లభించడమేగాక, అన్ని రంగాల ప్రజలందరికీ రుణాలు లభించాయి. నేడు బ్యాంకులు ప్రయివేటీకరించబడడంతో ఉద్యోగాలు కోల్పోవ డమేగాక రుణ లభ్యత కూడా లేకుండాపోయింది. అదే సందర్భంలో రుణాల ఎగవేత ద్వారా లక్షలాది కోట్ల లూటీతో ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నది. ఉద్దేశ పూర్వకంగా బాకాయిలు పెట్టిన వేల కోట్ల రుణ గ్రస్తులకు మోడీ ప్రభుత్వం రుణాల రద్దు, రైటాఫ్ ప్రకటించింది. ఈ విధంగా పారిశ్రామిక రంగాన్ని, దానికి పెట్టుబడులు పెడుతున్న బ్యాంకింగ్ రంగాన్ని దీవాళా అంచుకు తెచ్చారు. ఈ రెండు రంగాలతోపాటు సేవా రంగంలోని సంస్థలపై కూడా ఆర్థిక ప్రభావం పడి అవి కూడా మూతపడుతున్నాయి. హోటళ్ళు, సినీ పరిశ్రమ, పాఠశాలలు, చిన్నసైజు దుకాణాలు, చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడి కోట్లమంది నిరుద్యోగులైనారు. దీనికి తోడు భవన నిర్మాణ కార్మికులు, ఇతర మున్సిపల్ కార్మికులూ నిరుద్యోగులైనారు. గత సంవత్సరం 19కోట్ల మంది వలస కార్మికులు పట్టణాల నుండి పనులులేక గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అక్కడ వ్యవసాయేతర కార్మికులుగా జీవనం గడుపుతున్నారు. కనీసం గ్రామీణ ఉపాధిహామీ పథకంలోనైనా లబ్ధిపొందుదామంటే గతంలో 1.30లక్షల కోట్లు కేటాయించగా 2022-23 సంవత్సరానికి 75వేల కోట్లు మాత్రమే కేటాయించి ఆ పని కూడా లభ్యం కాకుండా చేశారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
మోడీ కేంద్రంలో రెండవసారి గద్దెనెక్కిన తరువాత విదేశీ కార్పొరేట్లకు, స్వదేశీ గుత్తా సంస్థలకు అప్పనంగా వేలకోట్లు దోచిపెడు తున్నారు. వారు చెల్లించాల్సిన సంపద పన్నును తగ్గించడమేగాక పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. బొగ్గు, ఇనుము, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఖనిజ సంపద ద్వారా వేలకోట్లు సంపాదించుకునే విధంగా విధానాలు రూపొం దించారు. నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికుల సంఖ్యను తగ్గించి మరిన్ని లాభాలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా దాదాపుగా దేశంలో 70 కోట్ల మంది పారిశ్రామిక కార్మికులకు ఆభద్రత ఏర్పడింది.
- వంగూరు రాములు
9490098247