Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా?'' అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. అది తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సరిగ్గా వర్తిస్తుంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలువగానే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కేసులు, జైళ్లకు భయపడి, తనను తాను రక్షించుకునేందుకు చెవిలో కమలం పువ్వులు పెట్టుకున్నారు. సరే... కానీ చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే సువేంద్ అధికారితో తనను పోల్చుకుంటున్నారు. ఆయన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించారు. సీఎం అభ్యర్థిని ఓడించడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అదే తెలంగాణాలోనూ రిపీట్ అవుతుందని ఈటల రాజేందర్ భావిస్తున్నారట! అందుకే హుజూరాబాద్‌లో భార్యను పోటీ చేయించి, తాను సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. నందిగ్రామ్‌కు గజ్వేల్‌కు పోలికే లేదు. అక్కడ సువేందు సొంత నియోజకవర్గం.. ఆయన బంధువులు కూడా ఎక్కువగా ఉన్నారు. మమతా బెనర్జీపై తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. సువేందు కూడా స్వల్ప మోజార్టీతో గెలిచారు. ఇక్కడి పరిస్థితి వేరుగా ఉందన్న విషయాన్ని ఈటల మర్చిపోతున్నారు. గజ్వేల్‌లో ఇప్పటికీ పరిస్థితి సీఎంకు అనుకూలంగా ఉన్నది. పైగా బీజేపీకి అక్కడ సున్న. లేని బీజేపీని ఉన్నట్టు ఊహించుకుని ఈటల కేసీఆర్ మీద పోటీ చేస్తానంటూ ప్రకటించారు. పోటీ చేయడమేంటోగానీ ఆయనకు బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆగడం లేదు. ముందుగా అందులో విజయం సాధించకపోతే ఆయన ఉనికికే ప్రమాదమని గుర్తెరుగరేం?
- అచ్చిన ప్రశాంత్