Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇజ్జత్ తీస్తిరి. గద్దెమీద కూసోబెడితే గబ్బులేపితిరి. జనానికి ఏమీ కావాలో అది చేయకపోతిరి. సర్కారు సొమ్మును ఉన్నోళ్లకే దోచిపెడితిరి. తూ మీ బతుకు చెడ. మీరు చెప్పిన నీతులింటిమి. ఓటేస్తేమి. మన మతమే గొప్పదంటిరి. నమ్మితిమి. కానీ మీరేం చేశారు. మతాన్ని ప్రచారం చేసుకోకుండా మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడితిరి. అన్నీ ఉన్నోళ్లకే ఇస్తుంటిరి. ఇవాళ ఏమైంది ప్రపంచ కుబేరుల్లో ఒకడేమో నాలుగోస్థానం, మరొకడు పదోవ స్థానానికి ఎగబాకిరి. మాలాంటి జనాలేమో రోజుకింత దివాళా తీయబట్టిరి. ఇదీ దేశం కోసం, ధర్మం కోసం, విశ్వగురు సాధించిన ఘనత అంటూ జోకులు వేసుకుంటున్నారయ్యా సామీ. మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా?'' అని అడుగుతున్నారు జనం. ఇటీవల వీరు సాధిదంచిన మరో ఘనత పాలు, నూనె ప్యాకెట్లపై కూడా జీఎస్టీ. అందుకే వీరి వాట్సాఫ్ యూనివర్సిటీకి దిమ్మదిరిగే కౌంటర్లు వస్తున్నాయి. గ్యాస్ ధర పెంచడాన్ని కమలనాథులు ఎంత సమర్థించుకున్నా... ఉత్తరాధికి చెందిన ఒక యువతి ఇచ్చిన కౌంటర్ బీజేపీకి మైండ్బ్లాకే. ''గ్యాస్ ధర రూ.1150 అయింది. కట్టెల పొయ్యిమీద వండుకోవాల్సి వస్తున్నది. మోడీసాబ్ మేము ముందుకెళ్లాల్సిన టైమ్లో మమ్ముల్ని వెనక్కి తీసుకు పోతున్నారంటూ'' వాట్సాఫ్ యూనిర్సిటీ తలుపులు బద్దలు కొట్టింది. నూనె ప్యాకెట్లపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ ఇద్దరూ భార్యాభర్తలు నూనె బాటిల్తో హాస్యం పండించారు. ఇది హాస్యంగా చూపిస్తున్నా సలసలకాగిన నూనె మోడీ నెత్తిన పోసినట్టే. ఇలా చెబుకుంటూ పోతే సోషల్ మీడియాలో విశ్వ గురువు కాదు... మాకు ఇదేం కర్మరా బాబూ అనుకుంటున్నారు. నెటిజన్లు.
- గుడిగ రఘు