Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న పిల్లలు చిచ్చోర పనులు చేస్తుంటే, ఒరేరు బడుద్దాయిల్లారా? ఏం చేస్తున్నార్రా? అని గదమాయిస్తారు మన పెద్దలు విసుగ్గా. వయస్సు పెరుగుతుంటే ఆ చిచ్చోర పనుల నుంచి బయటపడ్తారు. కొంత మంది మాత్రం పెద్దవారైనా ఆ చిచ్చోర పనులు మానుకోరు. తల్లిదండ్రులకు, భార్యకు, అన్నదమ్ములకు, అక్కాచెళ్లలకు, బంధువు లకు, స్నేహితులకు సైతం చికాకు తెప్పిస్తుంటారు. అటువంటి చిచ్చోరగాడే... మహాత్మగాంధీని కాదని మరొకరిని జాతిపితగా మార్చే ప్రయత్నం చేశాడు. తమిళనాడులోని ఓ పాఠశాలలో మన జాతిపిత వినాయక దామోదర (వీడీ) సావర్కర్ అనే అంశంపై వ్యాసరచన పోటీ పెట్టాడో బడుద్దాయి. ఎవరీ వీడీ సారస్కర్. ముంబాయిలో పుట్టాడు. లండన్లో ఉన్నత విద్య నభ్యసించాడు. జాతీయోధ్యమంలో అరెస్టు అయి జీవిత ఖైదు నుంచి తప్పించుకునేందుకు బ్రిటిష్ పాలకులు చెప్పినట్టు వింటానంటూ క్షమాపణ కోరి బయటపడ్డాడు. బ్రిటిష్ పాలకులకు నమ్మినబంటుగా కొనసాగాడు. పోరాటంలోంచి వైదొలిగి ప్రాణబిక్ష ప్రసాదించమని కాల్లావేల్లా పడ్డవాడు జాతిపిత ఎలా అవుతాడ్రా బడుద్దాయిల్లారా?
- గుడిగ రఘు