Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి భారతం ఓవైపు... అమృతోత్సవాలొకవైపు...
పేదవాని స్వాతంత్య్రం ఓ మేడిపండు
మన రాజకీయం ఓ రాచపుండు
వజ్రోత్సవ ఫలాలన్నీ అంబానీ - అదానీలకే!
సామాన్యుల జీవన గమ్యం - నిత్య దుఃఖనదే!
స్వాతంత్య్ర సమరంలో ఏ రోజూ నాడు పాల్గొననివారే
నేటి పాలకులైన చోట... నోటు-ఓట్ల స్వైరవిహారాన...
హంతుకుల్ని -దోపిడీదొంగల్ని -
రాజుల్ని కీర్తించే కొత్త సంస్కృతిని
డబ్భై ఐదేండ్ల స్వరాజ్యం చూస్తోంది! విస్తుపోతోంది..?!
భూమ్యాకాశాల్లా - రైలు పట్టాల్లా - ఎప్పటికీ కలవని...
సామాన్యులూ... శ్రీమంతులూ ఉన్న - రాజ్యా(ల)న్ని...
మార్చేది మార్పించేది - సామ్యవాదమే!
అది..సిద్ధించే దాకా...
ఎత్తిన కలాలు దించదు అక్షరలోకం!!
అలుపెరుగని వర్గపోరు దేశం అంతా నిర్మిద్దాం!
కదులుదాం... రండి!
అమృతోత్సవాల సాక్షిగా ఇదే మన(శ)పథం...
- తంగిరాల చక్రవర్తి,
సెల్: 9393804472