Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇప్పుడు మేము యువతను తుపాకులు, బాంబులు తీసుకోమని పిలుపివ్వలేము. కానీ, విద్యార్థులు అంతకు మించిన పెద్ద బాధ్యత తీసుకోవాల్సి ఉంది. త్వరలో జరగనున్న లాహౌరు కాంగ్రెసు మహాసభ స్వాతంత్య్రం కోసం భీషణ పోరాటానికి పిలుపివ్వనున్నది. దేశ చరిత్రలో క్లిష్టతరమైన ఈ సమయంలో యువత భుజాలపై చరిత్ర ఒక మహత్తర బాధ్యతను తెచ్చిపెట్టింది. విద్యార్థులు ఈ స్వాతంత్య్ర పోరాటంలో ముందుభాగాన నిలబడి, మత్యువును ఎదుర్కొన్న మాట యథార్థం. నిర్ణయాత్మకమైన ఈ తరుణం లోనూ అదేరీతిలో విద్యార్థులు, యువజనులు విప్లవ సందేశాన్ని దేశం నలుమూలలకీ చేర్చాలి. పారిశ్రామిక ప్రాంతాల్లోని మురికివాడలోన్లూ, పల్లెసీమల్లో శిథిలావస్థలోని పూరిపాకల్లోనూ బతుకులీడ్చే కోటానుకోట్ల ప్రజా బాహుళ్యంలో విప్లవ చైతన్యం తీసుకురావాలి. ఆ విధంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. అప్పుడు ఒక మనిషిని మనిషి దోచుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. దేశం పట్ల అపారమైన అంకితభావం తోనూ అమరవీరుడు జతిన్దాసు ప్రేరణతోనూ యువజనులు ఈ స్వాతంత్య్ర పోరాటంలో చెక్కుచెదరకుండా నిలిచి పోరాడగలమని రుజువు చేసుకోవాలి!''
(1929 అక్టోబరు 19న సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన పంజాబ్ విద్యార్థి సంఘం ద్వితీయ మహాసభలకు భగత్‌సింగ్ పంపిన సందేశం.)