Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెరువులో నీళ్లను వేళ్ళపై లెక్కిస్తూ
పేజీల్లా తిరగేస్తున్నా...
గుండెను ఊపినట్లు
సన్నని వేలికి మెత్తని పొర
సుతి మెత్తగా మెసులుతుంది..
వలను పొరగా మలచి
సంద్రపు అడుగును చీల్చుతూ
అడుగున మాటేసి కూసున్న..
ఆశ మనసు ఊరుకుంటేనా
పదే పదే పైకి లాగమంటది
తిమింగలాలు బక్క వలకు
సిక్కవని తెల్వక..
సిక్కుముళ్ళు ఏసుకొని
సంద్రంలో సంధించిన వలను
సూపులు సాగదీసి సంద్రంలోకి
తొంగి సూసిన
బుడ్డపరకలు, సందమామలు
సిక్కుల వడి సన్నగా మూల్గుతున్నై...
ఎంతపరిచిన
కొఱ్ఱమెన్లు, బురదమట్టలు
జనిగెలా జారుతున్నై
కోట్లను కొల్లగొట్టిన బడాబాబుల్లా....
ఎన్ని క్యూసెక్కుల కొత్త నీల్లొచ్చినా
వాటి న్యూ చెక్కుల ముందు
సక్కని వలలు సీకిపోతనే ఉన్నై...
నిజాయితీ వలను నిలువెల్లా సీల్చి
నీళ్లలో షికారు సేస్తున్నై..
వాటిని పట్టే వల
నా దేశంలో లేనట్లుంది...!!
- ముక్కాముల జానకీరామ్
సెల్: 6305393291