Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధరిత్రిని మించిన క్షమాగుణం
ప్రకృతి ఎరుగని దయాదాక్షిణ్యమ్
నాగరిక చరిత్రలోనే నిలిచే వైనం
గుజరాత్ ప్రభుత చూపిన పుణ్యం
అజరామరమైన కీర్తికి మార్గం.
క్రూర నేరము చేసిన వారకు
కారాగారమా! తప్పు తప్పు!
జీవితకాలపు వారి జైలు జీవితం
సమాజానికే ముప్పు ముప్పు!
శిక్ష సడలించి, స్వేచ్ఛ నొసగితే
దేశ ప్రతిష్టకు గొప్ప మెప్పు
రండి! పూల దండలు పట్టుకు రండి!
బాధితుల కన్నీటి గుండెల్ని తొక్కి రండి!
విదురులూ, నాగరిక యోధులూ,
న్యాయ కోవిదులూ..
బధిరులై మిగిలే వేళ
జైలు బయట వేచియుందాం!
స్వేచ్ఛా రాబందులకు స్వాగతమిద్దాం
జేకొట్టి హారతులిద్దాం.
- డా|| డి.వి.జి.శంకరరావు,
సెల్:9440836931.