Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏది అభివృద్ధి?
ఆకలి చావులు అభివృద్ధా?
అప్పుల బాధలు అభివృద్ధా?
పేదరికం పెనుసవాలుగా మారడం అభివృద్ధా?
మహిళలపై అత్యాచారాలు జరగడం అభివృద్ధా?
న్యాయాన్ని నడివీధిలో నరకడం అభివృద్ధా?
చట్టాన్ని చుట్టబండలు చేయడం అభివృద్ధా?
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ఖరీదు కావడం అభివృద్ధా?
ప్రజల సొమ్ము దోచుకొని దాచుకోవడం అభివృద్ధా?
మహిళా బిల్లును మంటగల్పడం అభివృద్ధా?
పసిమొగ్గలను చిదిమేయడం అభివృద్ధా?
కాల్ల కింద నేలను గుంజుకోవడం అభివృద్ధా?
పాలకులు ప్రజాకంఠకులుగా మారడం అభివృద్ధా?
పాలకులు దళారులుగా మారడం అభివృద్ధా?
ప్రసార మాధ్యమాలు ఉదరగొట్టడం అభివృద్ధా?
కులమతాల సుడిగుండాలను సృష్టించడం అభివృద్ధా?
మద్యం డబ్బుతో ఖజానా నింపుకోవడం అభివృద్ధా?
లెక్కకు మించి అప్పులు చెయ్యడం అభివృద్ధా?
నేతల అవినీతి దందాలు అభివృద్ధా?
ప్రాజాస్వామిక హక్కుల నిర్బంధం అభివృద్ధా?
రాజ్యంగా సంస్థల విధ్వంసం అభివృద్ధా?
కోట్లు కొల్లగొట్టి నొనికి మాఫీలు చెయ్యడం అభివృద్ధా?
కూటికి లేనోని కడుపుగొట్టడం అభివృద్ధా?
రాజ ప్రసాదాల నుండి జనాన్ని ఏమార్చడం అభివృద్ధా?
సత్య దూరంగా సమాజాన్ని నిర్మించడం అభివృద్ధా?
ఏది అభివృద్ధి? ఏది నిజం? ఏది అబద్ధం?
- విశ్వ జంపాల, 7793968907