Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేమున్నాం’ అని చెప్పాల్సిన రోజు ఇది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ‘మీకు మీమున్నాం’ అని భరోసా ఇవాల్సిన రోజు. కుటుంబసభ్యుల బలమే ఆత్మహత్యకు ప్రధాన విరుగుడు. ఆ సంగతిని గ్రహించాల్సిన రోజు కూడా ఇది.
‘నాకెవరున్నారు’ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారికి వచ్చే మొదటి ఆలోచన అది. ‘నాకెవరూ లేరు’ అనిపించడం ‘ఈ సమస్య నుంచి నన్నెవరూ బయటపడేయలేరు’ అనిపించడం ‘ఈ సమస్య వల్ల నాతో ఉన్నవాళ్లంతా నాకు లేకుండా పోతారు’ అనిపించడం ‘నాకు ఎవరైనా తోడుంటే ఈ బాధ నుంచి బయటపడగలను’ అనిపించడం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అనిపిస్తే నష్టం లేదు.
ఇంట్లో వ్యక్తులు ఎవరైనా తలనొప్పి నీరసం అన్నా పట్టించుకోరు. ‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అనే ఆలోచనతో చావే శరణ్యం అనుకుంటారు కొందరు. ప్రేమ విఫలమై, చదువులో ఫెయిల్ అయిన కారణంగా జీవితాన్ని చాలించాలనుకున్నాడనే విషయాన్ని విద్యార్థులను పసిగట్టలేకపోతున్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులే ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజాన్ని నివ్వెరపాటుకు గురి చేస్తోంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మంది వైద్యుల్లో పది మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇండియాలో ప్రతి లక్షమంది వైద్యుల్లో 16 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరోగ్య, సామాజికపరమైన సమస్యలతో పాటు వృత్తిపరమైన ఇబ్బందులూ ఉక్కిరిబిక్కిరి చేయడమే ఇందుకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. వైద్య వృత్తిలో తలెత్తే మానసిక సంఘర్షణలు దుర్బల మనస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వైద్య విద్యలో పరీక్షల ఒత్తిడి, కుంగుబాటు, నిద్రలేమి, సహాధ్యాయుల మధ్య పోటీతత్వం వంటి కారణాలతో మొగ్గదశలోనే కొందరు రాలిపోతున్నారు.
‘పన్నెండేళ్ల పిల్లల స్థాయి నుంచి వృద్ధుల వరకు ఆత్మహత్యల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉందంటుంది ‘‘కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడం, బాధపడటం చూసినప్పుడు అసలు పట్టించుకోరు. వారి భావాలను చాలా చిన్నగా చేసి చూస్తారు.
► మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం నెగిటివ్ గా ఆలోచిస్తారు. ‘నాకంటూ ఏవీ లేవు, ఎవరూ లేరు, ఏం చేసినా మంచి జరగదు..’ అంటూ ప్రతికూల వాతావరణాన్ని వెదుక్కుంటూ ఉంటారు.
► ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు పదే పదే ‘చచ్చిపోతాను’ అని చెబుతున్నా ‘వీళ్లేదో బెదిరించడానికి ఇలాగే చెబుతారులే. వీళ్లకంత ధైర్యం ఎక్కడిది?’ అనుకుంటారు ఇతరులు. దాంతో వీరు తమ మాటకు విలువ లేదని అహం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు.
► ఇంకో రకం వారు ఎదుటివారిలో మార్పు కోసం ఆత్మహత్యను వాడతారు. నేను చచ్చిపోతాను అనే ఆలోచన ఎదుటివారికి తెలిస్తే వారిలో మార్పు వస్తుందనుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించకపోతే అంతకు తెగిస్తారు.
మాటల కరువు
‘‘అసలు కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయి. ఫోన్లోనే జీవిస్తున్నారు’’ ‘సమయానికి తినడం, నిద్రపోవడం ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. ఉల్లాసపు మాటలు, ఉత్సాహపు కబుర్లే మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి.
నెగిటివ్ ఆలోచనలు చేసేవారిలోనే ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఉంటుందని అంతా అనుకుంటాం. కానీ, అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్ఫధంతో ఉన్నవారు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితి ఎదురైతే ‘ఇక అయిపోయింది నా జీవితం. ఎప్పటికీ తేరుకోలేను’ అనే ఆలోచన వచ్చి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. ‘పాజిటివ్‌గా ఉండే నేను నెగిటివ్ జీవితాన్ని భరించలేను’ అనే ఆలోచన చేస్తారు. ఇలాంటి వారిలో కొన్ని సిగ్నల్స్‌ని కనిపిస్తాయి.
కీలకమైన సిగ్నల్స్.. గుర్తించండి
సాదా సీదాగా కాకుండా వారి మనసు లోతుల్లోనుంచి వచ్చే భావనలా గుర్తించాలి. ‘నేను ఏదైనా చేయగలను’ అనే మనిషి ‘ఏమీ చేయలేను, నేను వేస్ట్’ అన్నప్పుడు వెంటనే అలెర్ట్ అవ్వాలి. అవి ఎలాంటివంటే..
- చేసే పని మీద దృష్టి పెట్టకపోవడం
- తిండి మీద ఉండదు.
- హుషారు ఉండదు.
- ఈసురోమంటూ, ఏవిటీ జీవితం అన్నట్టుగా ఉంటారు.
- నిరాశగా, నిస్పృహగా ఓ సరదా ఉండదు; ఓ టీవీ చూద్దామని ఉండదు. నలుగురితో కలిసి కబుర్లు చెపుదామని ఉండదు.
- ఏదో పోగొట్టుకున్నట్టుగా, దిగులు పడుతున్నట్టుగా ఉంటారు.
- సామాన్యంగా నిద్ర పట్టదు. ఇట్టిట్టే మెలకువ వచ్చేస్తుంది. తెల్లవారడానికి బాగా ముందు మెలుకువ వచ్చేస్తుంది.
లేచి పని చేసుకుందామంటే, పని చేసుకోబుద్ధి పుట్టదు. అలాగే నిద్ర కంటిన్యూ చేద్దామంటే, నిద్ర పట్టదు.
- సామాన్యంగా ఉదయం పూట ఎక్కువ డల్లుగా ఉంటుంది. సాయంత్రంపూట కొద్దిగా తెరిపిన ఉంటుంది. ఈ పరిస్థితిలో కొంతమంది పగలంతా డల్ గా అలా పడుకుంటారు. ఇంకా చెప్పాలంటే పడుటుంటారు.
- కొంతమంది డిప్రెషనులో రెస్ట్‌లెస్ గా కుదురు లేకుండా తిరుగుతున్నట్లుగా ఉంటారు.
- ప్రతి నిమిషం కూడా గడవడానికి చాలా భారంగా ఉన్నట్టుంది.
- నాకెవరూ లేరు, నేను ఎందుకూ పనికిరాని వాడిని, భవిష్యత్తు కూడా అగమ్యగోచరం అనిపిస్తుంటుంది.
- కొంతమందికి చావువైపుకి మనసు లాగేస్తుంటుంది.
► అభిరుచులను, ఆసక్తులు వదిలేయడం
► ఇష్టమైన పనులు చేయకపోవడం
► ఇష్టమైన మాటలు మాట్లాడకపోవడం
► ఒంటరిగా ఉండాలనుకోవడం
► బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం
► ఆనందంగా ఉండే పరిస్థితుల్లోనూ బాధగా ఉండటం.
బాధాకరమైన మాస్క్ వేసుకుంటారు
డిప్రెషన్లో ఉన్నవారి కళ్లు నిస్తేజంగా, మెరుపు కోల్పోయి కనపడతాయి. ముఖంలో నవ్వు ఉండదు. బ్లాంక్ ఫేస్‌తో ఉంటారు. భావోద్వేగాలను ముఖంలో పలికించలేరు. మాట్లాడటానికే ఇష్టపడరు. కాళ్లూ చేతుల కదలికలను కూడా ఇష్టపడరు. రోజువారీ పనులనూ నిర్లక్ష్యం చేస్తారు. కాలు విరిగినా, చెయ్యి విరిగినా బాగయ్యేంతవరకు ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసు కూడా సేదతీరేంత వరకు అవకాశాన్ని ఇవ్వాలి. సహనంతో కుటుంబ సభ్యులు ఇందుకు పూనుకోవాలి.
పలకరించాలి. మాట్లాడుకోవాలి. గతంలో సాధించిన గెలుపు ఓటములను ప్రస్తావించాలి. పరిస్థితులు మారుతాయి అని చెప్పాలి. ఎక్కడన్నా బాధాకరమైన కథనాలు ఉంటే వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారో కూడా చెప్పాలి. సానుభూతి వాతావరణం మంచిది కాదు. పరిసరాలను మార్చాలి. నలుగురిలో సులువుగా కలిసిపోయేలా ఉంచాలి.
ఫోన్ కుటుంబాల్లోకి వచ్చి తిష్టవేసాకా ఒకరి బాగోగులు ఒకరు పట్టించుకోవడం అనేదే పోయింది. ఎక్కడో ఉన్నవారిని ‘అయ్యో’ అని మెసేజుల్లో పరామర్శిస్తారు. కానీ, ఇంటి వ్యక్తిని మాత్రం విస్మరిస్తారు. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కుంటే తమ పెన్నిధిని కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. పెద్దవాళ్లు ఫోన్ మాత్రమే తమ సర్వస్వం అన్నట్టుగా ఉంటున్నారు. వీటితోపాటు యువత ప్రేమ విఫలమైన కారణం, చదువులో వెనకబడటం వంటి వాటితో కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబమంతా కలిసి రోజూ పది నిమిషాలు మాట్లాడుకుంటే చాలు ఆత్మహత్య అనే పదమే దరిచేరదు.
సాధారణంగా అత్యాచారానికి గురైతే తనకిక పెళ్లి కాదేమో అని యువతులు, భర్త సరిగ్గా ఏలుకొడేమో అని వివాహితలు ఆత్మహత్య దిశగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి, ఉన్నత శిఖరలకు చేరుకోవాల్సిన వారు కూడా కుమిలిపోతూ కెరీర్ కు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి వారిని మా వద్దకు తీసుకొస్తే తగిన విధంగా కౌన్సెలింగ్ చేసి మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించేలా ప్రయత్నిస్తూ ఉంటాము.
కౌన్సెలింగ్ గురించి తెలియని వారు ఆ కుటుంబ సభ్యులైనా సరే బాధితురాలితో సరిగ్గా వ్యవహరించకపోతే ఆమె కుంగుబాటు నుంచి మామూలు మనిషి అవ్వడానికి చాలా కాలం పడుతుంది. ఒక్కోసారి పిచ్చివాళ్లు గా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే సున్నితమైన ఆమె మనసు గ్రహించి ప్రతి ఒక్కరూ ఆమెకు మరింత సున్నితంగా ఓదార్పునివ్వాలి. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ద్వారా వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత కౌన్సెలింగ్ ఇస్తున్నాం అని తెలిపారు.
- డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్,హిప్నో థెరపిస్టు
9390044031