Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత పిచ్చితో బీజేపీ దేశాన్ని విభజిస్తుంటే... దేశ సమైక్యత కోసం రాహుల్‌గాంధీ నడుంబిగించారని యావత్ కాంగ్రెస్ దండోరా వేస్తున్నది. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమయ్యే అద్బుత క్షణాల కోసం వేలాది మంది జనం కన్యాకుమారికి తరలి వచ్చారు. దేశ నలుమూల నుంచి అగ్రశ్రేణి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోపాటు గుంపులు, గుంపులుగా జనం అక్కడికి చేరుకున్నారు. జాతీయ పతాక రెపరెపలు. ఆకాశాన్నటిన అంబరాలు. పాదయాత్ర ఆ ఉద్విగ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్షణాల్లో ఒక సిల్లీ వార్త వాట్సాఫ్ ద్వారా కన్యాకుమారి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చెక్కర్లు కొట్టింది. దాన్ని చూసి ఎంతో మంది నవ్వుకున్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభ సమయంలో 'నా జేబు కొట్టేశారు. అందులో రూ.30 వేలున్నాయి. ప్రస్తుతానికి తన వద్ద ఖర్చులకు పైసల్ కూడా లేవు. ఏం చేయాలో తోచడం లేదంటూ కన్యాకుమారి నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరు స్క్రోలింగ్ పాయింట్స్ పంపించారు'. ఈ సందేశం వచ్చిన తర్వాత జోడో యాత్ర కంటే జేబుదొంగలకు బలైన సదరు నేత ఆవేదన విన్న తర్వాత జాలేసింది. అది చాలా మందిని ఆకర్షించింది. దీంతో చాలా మంది ట్రోల్ చేశారు. ఆ డబ్బులను సోనియాగాంధీ ఇవ్వాలా? లేక రాహుల్‌గాంధీ జేబులో నుంచి తీసి ఇవ్వాలా? లేక రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ఫోన్‌ఫే, గూగుల్ఫే చేయాలా? అది కాకుంటే పార్టీ నాయకులంతా చందాలు జమ చేసి పంపాలా? ఎందుకోసం ఆ విషయాన్ని మీడియాకు పంపించారో చెప్పాలంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
- గుడిగ రఘు