Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో యూనివర్సిటీలను పరిశీలిస్తే, అవి ఎంతటి విధ్వంసానికి గురవుతున్నాయో అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చిరాగానే యూనివర్సిటీ విద్యను తమ ఆధీనంలో ఉంచుకొనే ప్రయత్నాన్ని వేగవంతం చేశారు. దానిలో భాగంగానే మొదటగా వైస్ఛాన్స్ర్ లాంటి ముఖ్య పోస్టులలో అభ్యుదయ భావాజాలం కలిగిన ప్రొఫెసర్లను తొలగించి, తమ వారిని నియమించుకున్నారు. జేఎన్‌యూ లాంటి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన విశ్వ విద్యాలయం అస్తిత్వాన్నే దెబ్బతీసారు. యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణం లేకుండా చేసి విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించిన ఆనాటి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ లాంటి వాళ్ళను నేడు ఏకంగా యూజీసీ చైర్మన్‌గా నియమించుకున్నారు. ఏఐసిటిఈ, ఐసిఎస్ఎస్ఆర్, సిబిఎస్ఈ, చారిత్రక పరిశోధనా పీఠం లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన ఉన్నత విద్యా సంస్థలన్నిటినీ తమ వాళ్లతో (ఆర్ఎస్ఎస్) నింపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ మధ్యకాలంలో తమకు చెందిన ఫ్రొఫెసర్లు నలుగురికి వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇచ్చినారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కూడా అక్రమ మార్గాలలో తమ వారిని నింపుకుంటున్నారు. ఇప్పటికీ సెక్యులర్, సోషలిస్టు భావజాల సంఘర్షణ కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉన్నాయంటే దానికి ప్రోఫెసర్సే ప్రధాన కారణం. అందుకే అధికారంలోకి రాగనే విశ్వవిద్యాలయా లల్లో అక్రమ మార్గాల్లో తమ భాహజలం కలిగిన వ్యక్తులను రిక్రూట్ చేసుకున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్టంట్లో ఇంటర్వ్యూకు కూడా సెలెక్ట్ కానీ వ్యక్తికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కట్టబెట్టారు. ఇలా వాళ్లు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఈ విధంగానే నియమించుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని కల్బుర్గి సెంట్రల్ యూనివర్సిటీలో సరయిన అర్హతలులేని వ్యక్తికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇదేమిటి అని అడిగితే ఇరువై మంది విద్యార్థుల మీద కేసులు పెట్టించారు.
క్యాంపస్ డెమోక్రసీని దెబ్బతీస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. యూనివర్సిటీలలో ప్రభుత్వాలను ప్రశ్నించే విద్యార్థులను, శాస్త్రీయ భావాజాలం కోసం పోరాటం చేసే వామపక్ష దళిత విద్యార్థి సంఘాల నాయకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. సంఘ విద్రోహులుగా కేసులు పెడుతున్నారు. క్యాంపస్‌లలో నిత్యం ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న, ప్రజా వ్యతిరేక నిరంకుశ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్న జేఎన్‌యూ, జామియా మిలియా, ఢిల్లీ, అలిఘడ్ యూనివర్సిటీల విద్యార్థులపై భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. మద్రాస్ ఐఐటీలో అంబేద్కర్, ఫూలే పెరియార్ స్టడీ సర్కిల్‌ను బ్యాన్ చేయించారు. విద్యా కేంద్రాలలో మతపరమైన చిహ్నాలు ఉండవద్దని భారత రాజ్యాంగం చెపుతుంటే, దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా కర్నాటక బెంగళూర్ విశ్వవిద్యాలయంలో వినాయకుడి గుడి కట్టించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ప్రతి విశ్వవిద్యాలయంలో సరస్వతి గుడులు ఉండాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. బుద్ధుడు ఉండవలసిన స్ధలంలో సరస్వతీ గుళ్ళు నిర్మిస్తున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ప్రణాళికా బద్దంగా వినాయకుడి ఉత్సవాలు, శ్రీరామనవమి, ఆంజనేయుడి జన్మదినం, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి పండుగలను విశ్వవిద్యాలయా లలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు.
లౌకిక ప్రజాస్వామ్య వాతావరణం విలసిల్లవలసిన విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను చీల్చే ప్రయత్నం జరుగుతున్నది. మతవిద్వేషాలతో అభ్యుదయకరమైన, చారిత్రకమైన పాఠ్యాంశాలను తొలగిస్తూ వాటి స్థానంలో అశాస్త్రీయమైన కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వాస్తవ చరిత్రను వక్రీకరిస్తున్నారు. భగత్‌సింగ్, అంబేద్కర్, ఫూలే, పెరియార్, బసవన్నల చరిత్రను కనుమరుగు చేసి, బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయిన వీడి సావర్కర్ లాంటి ద్రోహులను హీరోలుగా చెపుతున్నారు. సమాజ అంతరాలకు, మనువాదపు కుట్రలకు, ఆర్థిక, సామాజిక వెనుకబాటుకు గల కారణాలపై పరిశోధనలకు పదునుపెడుతున్న రీసెర్చ్ స్కాలర్లకు ఫెలోషిప్‌లు లేకుండా చేస్తున్నారు. అందుకే జాతీయ ఫెలోషిఫ్లను 58శాతం తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే నిధులు వేగంగా తగ్గుతున్నాయి. యూజీసీ నుండి రావలసిన నిధులు రావటం లేదు. మొన్నటి వరకు సరియైన అడ్రసు కూడాలేని అంబానీ జియో యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వానికి, ప్రపంచానికే విజ్ఞానాపు బాటలు వేసిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు మాత్రం నిధుల కేటాయించ డానికి చేతులు రావటం లేదు.
నూతన జాతీయ విద్యా విధానం 2020 ముసుగులో మొత్తం విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి కుట్ర పన్నినారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా మహనీయులు భగత్ సింగ్, అంబేద్కర్, సావిత్రి బారు ఫూలే బాటలో పోరాటం చేయాలి.
- ఆర్.ఎల్.మూర్తి
సెల్:8247672658