Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా నేలను
మళ్ళీ అలలు తాకాలని
ఊవ్విళ్ళూరుతున్నాయి
వలసవాదుల పాతవాసనను
మరువకముందే
మత వర్గ విభేదాల పేరిట మత్తుజల్లి
సుడిగుండమోలె చుట్టాలని చూస్తున్నాయి
తెలవితోని ఉండకపోతె
కాళరాతిరి సునామై
కబలించాలని చూస్తున్నాయి
వాతావరణ హెచ్చరికలు గమనించి
అప్రమత్తమై ఎక్కడి వారక్కడ
జాగురూకులైతె
తుఫాన్ తోకముడుచుకుంటుంది
రోగం ముదురకముందే
పత్యం చేయాలి
చెరువు నిండకముందే
గండిని పూడ్చాలి
సందు దొరికిందో పోలాలను
మేటతో కప్పేస్తుంది
గోటితో పోయ్యేది
గొడ్డలిదాకా వస్తుంది
సోయి తప్పినవో మత్తుల మునిగినవో
మళ్ళీ పోరాటం...
- అన్నల్ దాస్ రాములు,
సెల్:9949553655