Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ద్రవ్యోల్బణం పైపైకే చూస్తోంది. చిల్లర ధరల సూచీ ప్రకారం గణించే ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 7 శాతంగా ఉంది. నిత్యావసరాల ధరలను బట్టి గణించే ఈ సూచీ ద్వారా తిండి గింజల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు రెండు శాతం నుండి ఐదు శాతంగా ఉండడం ఆరోగ్యకరం. అది ఆరు శాతంగా ఉండటం భరించగల స్థాయి. అది అంతకు మించితే ప్రజలు ధరలతో తీవ్రంగా అల్లల్లాడుతున్నట్లు. ద్రవ్యోల్బణం అరికట్టడానికి అన్ని చర్యలూ చేపట్టినట్టు, అది మోస్తరుగా పెరగడం తప్పించి, పెద్దగా పెరిగే అవకాశం లేదంటూ ఆ మధ్య ఆర్థిక మంత్రి ఆశాభావం వెలిబుచ్చారు. రిజర్వు బ్యాంకు కూడా ఒకేసారి వడ్డీల్ని పెంచింది. అయినా సరే ఇప్పుడు ద్రవ్యోల్బణం 7శాతంగా నమోదు కావడం ఆందోళనకరం. అంటే కట్టడి చర్యలు సమర్థవంతంగా పని చేయడం లేదు. ఫలితంగా ప్రజలు, ముఖ్యంగా సామాన్యుల బాధలు వర్ణనాతీతం. మళ్ళీ కట్టడి చర్యల్లో భాగంగా రిజర్వు బ్యాంకు మరింతగా వడ్డీల్ని పెంచితే అది ప్రజానీకంపై మరింత భారాన్నే మోపుతుంది. అన్నిరకాల లోన్లు, రుణ వాయిదాల చెల్లింపులు అదనపు భారంగా తయారవుతాయి. కాబట్టి ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా వడ్డీలు పెంచే చికిత్సకే మొగ్గు చూపించకుండా, అదే ఏకైక మార్గంగా చూడకుండా మిగతా ప్రయత్నాలు చేయాలి.
- డాక్టర్ డి.వి.జి.శంకరరావు