Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎరువులపై ప్రభుత్వ రాయితీ ఖర్చు భారీగా పెరుగుతున్నందున దీని ఖర్చును తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాజమాన్యంలో ప్రత్యా మ్నాయ పోషకాల వినియోగ పథకం ''పియం ప్రణామ్'' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు పేపర్ వార్తలు తెలుపు తున్నాయి. అలాగే ఆహార వ్యవసాయో త్పత్తుల సేకరణ ఖర్చుల కోసం ఇప్పుడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న మొత్తాన్ని ఇక ముందు 2శాతంకు పరిమితం చేయా లనే వార్త కూడ (బిజినెస్‌లైన్ తేదీ :21.09.2022) దాదాపు ఇదే సమయంలో వచ్చింది. ఈ రెండు పథకాల ప్రభావాలను కలిపి అంచన వేస్తే, దీర్ఘకాల రైతుల ఆందోళన ఫలితంగా రద్దుచేసిన నష్టదాయక మూడు సాగు చట్టాల లక్షాలను సాధించ డానికే అన్న అనుమానాలను రేకెత్తి స్తాయి. రైతుల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్లో ఈ నష్టదాయక రైతు చట్టాలను ఏ చర్చ లేకుండా రద్దు చేసిన తరువాత, కొన్ని రోజులకే ఈ రద్దు చేసిన సాగు చట్టాల లక్ష్యాలను సాధించడానికి మరో రూపంలో విధానపర మార్పులు చేస్తామని బాధ్యతగల స్థానంలో గల పాలక పార్టీ వారే చెప్పారు. అందువల్ల, ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ పథకాలు రద్దుచేసిన నష్టాదాయక సాగు చట్టాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న విధాన పర మార్పులుగా భావించడంలో తప్పే మిలేదు. అయితే కొన్ని నెలల్లోనే గుజరాత్ లాంటి కీలక రాష్ట్రాలల్లో జరు గుతున్న ఎన్నికల దృష్ట్యా 2023-24 బడ్జెట్ ద్వారా ఈ పథకాలు అమలవు తాయని భావించవచ్చు.
ధరలపై బారీగా ఆధారపడే ఎరువుల వినియోగం
మన దేశంలో ఎరువుల వినియోగ పరిమాణం వాటి ధరలపై ఆధారపడి ఉంటుందని గత అనుభవాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ముఖ్యం గా ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ఒకేసారి యూరి యాపై రాయితీని మరో 10శాతం తగ్గించి భాస్వరం పొటాష్ ఎరువులపై రాయితీని తగ్గించి భారీగా వీటి ధరలను పెంచారు. అప్పటికే భాస్వరం, పొటాష్ పోషకాలతో పోల్చినప్పుడు నత్రజని పోషక విని యోగం చాలా అధికంగా ఉండేది. వీటి నిష్పత్తి 6 నుండి 7:2.5 లేక 3 నుండి 1గా ఉండేది. యూరియా ధర తగ్గించి భాస్వరం, పొటాషియం పోషకాల ధరలు పెంచిన తరువాత నత్రజని, భాస్వరం, పొటాష్ల పోషకాల వినియోగ నిష్పత్తి స్థాయి 12-13:4 లేక 5:1కి దిగజారింది. ముఖ్యంగా మెట్ట సాగులో, చిన్నకమతం రైతుల సాగులో ఈ పోషకాల వినియోగ స్థితి మరింత దిగజారింది. అదే సమయంలో రైతులు సేంద్రియ ఎరువులను కూడా ఎక్కువగా వాడలేదు. ఈ స్థాయిలో రసాయన రూపంలో పోషక ఎరువులను దీర్ఘకాలం వినియోగిస్తే భూసారం, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలంలోనే ఈ క్షీణత తీవ్ర స్థాయికి చేరుతుందని శాస్త్రజ్ఞులు ఎంతో ఆందోళన వెలిబుచ్చారు. ఆ సమయంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలూ ఇటువంటి ఎరువుల వినియోగం సుస్థిర వ్యవసాయోత్పత్తికి తోడ్పడదని, పోషకాల ధరల మధ్య ఉన్న ఇంత పెద్ద వ్యత్యాసాన్ని తగ్గించాలని సలహాలు ఇచ్చాయి. అప్పుడే కొత్తగా అధికారం చేబట్టిన కేంద్ర ప్రభు త్వం యూరియా ధరను పెంచ కుండా, భాస్వరం, పొటాష్ పోషకాల ధరలను భారీగా తగ్గించింది. దీనితో వ్యవసా యోత్పత్తిలో వివిధ పోషకాల మధ్య వినియోగ తుల్యత మెరుగు పడింది.
ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ''పియం ప్రణామ్'' పథకంలో ప్రధాన మంత్రి ప్రణామ్ అంటే ''ప్రధాన మంత్రి (గారు మీకు మా) వందనం.'' ఈ పదాలు అత్యంత గౌరవమైనవి. ప్రీతిపాత్రమైనవి. ఆకర్షణీయమైనవి. ఇటువంటి పేరుతో ఈ పథకం అమలు వల్ల రాబోయే దుష్పరిణామాల నుండి ప్రజల దృష్టిని మరల్చవచ్చని బహుశ విధాన రూపకర్తలు భావిస్తున్నారని అనుకోవాలి. కానీ, రైతులు వాస్తవ ఆర్థిక వ్యవస్థలో సాగు చేస్తూ జీవిస్తున్నారు. వారు మభ్యపెట్టే (వర్చువల్) ఆర్థిక వ్యవస్థలో జీవించడం లేదు. అందువల్ల పియం ప్రణామ్ పథకం పేరు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, దృష్ఫ్రభావాల్ని వెంటనే గుర్తించగలరు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక 'ఎర'
ఈ పథకం కింద మిగిలే రాయితీ మొత్తంలో 50శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. దీనిలో 70శాతం ఆస్తుల సృష్టికి (ఉదా : మౌలిక సౌకర్యాల అభివృద్ధికి) రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు. మిగతా 30శాతం నిధిని రైతులకు ప్రోత్సాహకా లను అందించడానికి, పంచాయతీలకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు, స్వయం సహాయ గ్రూపులకు ఇతర ఎన్జీవోలకు ఇచ్చుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక దుస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పైకి చూడడానికి ఉదారంగ కన్పిస్తున్న ఆర్థిక పొందు బాటు కు ఆకర్షితులై కేంద్ర పథకానికి అంగీకరిం చవచ్చు. కానీ, తమ వ్యవసా యాన్ని, తమ ప్రజల ఆహార పోషక భద్రతలకు ప్రాధా న్యత ఇచ్చే ఏ బాధ్యత గల ప్రభుత్వమూ ఈ కేంద్ర పథకానికి ఒప్పుకోదు.
ఈ సందర్భంలో ప్రత్యామ్నాయ పోషకాల వినియోగం అంటే జీవన ఎరువులతో సహా ఇతర సేంద్రియపు ఎరువులుగా భావించాలి. వీటి వాడకంలో రైతులు ఎన్నో పరిమితులను ఎదుర్కొం టున్నారు. ఇప్పటికే వీలున్నమేర వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. వీటి వాడకాన్ని పెంచాలంటే వీటి ఉత్పత్తిని పెంచాలి. ముఖ్యంగా దున్నేవాడికి (కౌలు రైతు), భూమి యాజమానికి గల సంబంధం చాలా ముఖ్యం. సాగు రైతులకు భూమిపై దీర్ఘకాల సంబంధం లేనిదే ఖర్చుతో కూడిన సేంద్రీయపు ఎరువుల వినియో గానికి రైతు ప్రాధాన్యత ఇవ్వడు. తక్షణం ప్రయోజనం అందించగల రసాయనిక ఎరువుల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక రెండో అంశం ఎరువులపై ఖర్చును బాగా తగ్గించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి సేంద్రియపు ఎరువుల వాడకానికి మారా లంటే వెంటనే వచ్చే దిగుబడులు ఆకర్షణీ యంగా ఉండవని శ్రీలంక అనుభవం తెలుపుతుంది. అంతిమంగా, ఎరువు ధరల స్థాయి, రైతులకు వాస్తవంగా గిట్టే వ్యవసాయోత్పత్తుల ధరలు, రైతులు వాడే రసాయనిక, సేంద్రియ ఎరువుల లభ్యత, వాడకాన్ని ప్రభావితం చేస్తాయి. సేంద్రీయపు ఎరువుల వాడకం ఖరీదైనదే. ముఖ్యంగా పచ్చిరొట్టే ఎరువుల పెంపకం, వాటి వినియోగం కోసం వెసే పంట(ల)ను తగ్గించకుండా పంటల విధానంలోనే ముఖ్యమైన మార్పులు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్పును, లాబదాయకతను భిన్న వ్యవసాయ, భూమి, పర్యావరణ పరిస్థితుల్లో రైతులకు చూపించి, ఒప్పించాల్సి ఉంది. అన్ని సందర్భాల్లో ఇది అంత తేలిక కాదు. ఈ విధానం ఫలితంగా ఉత్పాదకత తగ్గితే మన ప్రజల ఆహార పోషక భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శ్రీలంక అనుభవాలు తెలుపుతున్నాయి.
ఆహార వ్యవసాయోత్పత్తుల ప్రయివేట్ సేకరణ
దీన్ని పరోక్షంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాల సేకరణనను నిరుత్సాహ పరిచే విధంగా సేకరణ ఖర్చులను 2శాతంకు పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయి స్తున్నట్లు వార్తలు తెలుపు తున్నాయి. ప్రయివేట్ కార్పొరేట్ సంస్థల ఆహారో త్పత్తుల సేకరణ అంటే వాటి నిల్వలు, నిర్వాహణ కూడ వాటి చేతిలోనే ఉంటాయి. ఇవి తాము అనుకున్న లాభం వచ్చినప్పుడే అమ్ముతాయి. ఇవి స్పెక్యూ లేటివ్ రూపం కూడ తీసుకునే ప్రమాదం ఉంది. దేశ ప్రజల ఆదాయం కంపెనీలు అనుకున్న రేటుకు కొని తినే అవకాశం పేదలకు కల్పిస్తుందా ? విశ్వసించలేం. ఈ నేపథ్యంలో రాబోయే ఈ రెండు పథకాలు రద్దు చేసిన నష్టాదాయక సాగు చట్టాల లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడ తాయన నిర్ద్వందంగా చెప్ప వచ్చు. నిజ ఆర్థిక వ్యవస్థలో జీవి స్తున్న ప్రజలు దీనికి అంగీకరిస్తారా?
- ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు