Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూత్వం... కాషాయం... యోగులు... బుషి ధర్మం... ప్రభుత్వ పాలనలో మతాన్ని చొప్పించడంతో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవి. బీజేపీని ఏదైనా విషయంలో విమర్శిం చాలి అంటే...దేశం కోసం-ధర్మం కోసం అంటూ ఆపార్టీ వాట్సప్ యూనివర్సిటీ ఎదురుదాడి చేస్తుం టుంది. రాజకీయ పార్టీని విమర్శిస్తే హిందుత్వానికి వచ్చిన ముప్పేంటో అర్థంకాక, ప్రతిపక్షనేతలు తలపట్టుకు కూర్చుంటున్నారు. ఇప్పుడు దీనికి సోషల్ మీడియా రూపకర్తలు సరికొత్త ట్రెండ్‌తో ప్రతివ్యూహాన్ని రూపొందిం చారు. బీజేపీని ఏదైనా రాజకీయంగా తిట్టాలంటే కాషాయాన్ని మించిన వ(అ)స్త్రం లేదని నిర్థారణకు వచ్చే శారు. ఇటీవల బీజేపీని బాహటంగా విమర్శించేవాళ్లంతా కాషాయ వస్త్రాలు కట్టుకునో, తమ వెనుక అయోధ్య రాముడి చిత్రపటాలు పెట్టుకునో బీజేపీని చెడుగుడు ఆడుతున్నారు. తాము కూడా హిందువులమేననీ, కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్నది ఏంటంటూ ప్రశ్నలు వర్షం కురిపి స్తున్నారు. ఇదేదో బాగుందనీ, ప్రతిపక్షాలు ఆ పోస్టుల్ని తమ కార్యకర్తల గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేస్తున్నాయి. అలా అవి జనబాహళ్యం లోకి చొచ్చుకెళ్తున్నాయి. జనమూ ఆలోచనలో పడు తున్నారు. ఈ దెబ్బకు బీజేపీ బత్తాయిలు విలవిల్లాడు తున్నారు. కాషాయ కషాయం మింగుడు పడక గొంతులోనే ఇరికి అవస్థలు పడుతున్నారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటే ఇదేనా..!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి