Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చచ్చిన కణానికి చికిత్స చేసి చరచరమని కదిలించే చలనం అతడు.
కాల్పనిక కట్టుకథలకు కారడ్డం తిరిగి కదనుడైన కథానాయకుడు అతడు.
కదలని కాలానికి వేగం అద్దిన కధనశీలుడు అతను.
నిశీధిలో నిబ్బరాన్ని చీల్చిన నిప్పురవ్వ గుణం అతడు.
మ్రాన్పడిపోయిన నాగేటి సాలల్లో మొలకెత్తిన విత్తనం అతడు.
మాడిపోయిన చెట్టు ఇగురుకు మారాకు తొడుగు అతడు.
మానని మాయ గాయాలకు మందుపూత పసరు అతడు.
మట్టిమనుషుల మట్టిని లాక్కునే మాయగాళ్లపై మరిగిన మనిషి అతడు.
మందిని ముంచే మాయగాళ్లకు మండే అగ్నికణం అతడు.
మతం మత్తును, కులం కుళ్లుపై ఎగిసిపడ్డ ఎరుపు రవ్వ అతడు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే వణుకు పుట్టించిన రూపం అతడు.
నా దేశం గుండెలమీద చెక్కిన నెత్తుటి సంతకం అతడు.
నాలో నీలో నరనరాన అణువణువునా నిండిన నిషాణి అతడు.
అతడే అతడే అతడే...
నవ నవలాడే నవ యవ్వన ప్రవాహాఝరీ 'భగత్ సింగ్'.
- ఎ. విజయ్ కుమార్,
సెల్:9573715656