Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ ప్రస్థుతం అధికారంలో ఉన్న పార్టీ, 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన (బీజేపీ) ఎన్నికలప్రచార వ్యూహాన్ని మార్చింది. ప్రతి పార్టీకి తన ప్రచార వ్యూహాల్ని మార్చుకునే హక్కు ఉంది, ఇందులో తప్పేమిటి అని అనవొచ్చు. ఇక్కడ విషయం కేవలం ప్రచారం కాదు. ఆ ప్రచారం మీరు, నేను మనలాంటి ఎందరో జనాభా రక రకాలుగా కట్టిన టాక్సులతో చేసుకుంటుంది. అంటే బీజేపీ ప్రజల డబ్బుతో తన పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఎలా..?
ప్రభుత్వం వ్యవసాయ దారులకు ఎరువులు సబ్సిడీపై ఇస్తుంది. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. భారత ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది. ఈ విషయం ఎక్కడా న్యూస్ ఛానెల్స్‌లో కానీ వార్తా పత్రికల్లో గాని వెలువడ లేదు. ఆ జీఓ ప్రకారం సబ్సిడీలో ఎరువులు ఇచ్చే కంపెనీలు ఆ ఎరువుల బ్యాగులపై ఈ కింది విధమైన ప్రింటింగ్ ఉండాలని అనివార్యం చేసింది.
''భారతీయ
జన్ ఉర్వరక్
పరియోజన'' ఇప్పుడు చూడండిపై పదాల మొదటి అక్ష్రరాలను పైనుండి కిందకి చదివితే ఏమి వొస్తుంది? భాజప అని. అలాగే ప్రభుత్వ దవాఖానాల్లో, పబ్లిక్ హెల్త్ సెంటర్లలో ఉచితంగా ఇచ్చే మందుల ప్యాకెట్లపై కూడా
''భారతీయ -
జన ఔషధి -
పరియోజన'' అని ఉండేలా ప్రింట్ చేయాలనీ ప్రభుత్వ ఆదేశాలు. అంతే కాదు, ఈ పదాలను అందంగా ఆకర్షణీయంగా ఉండాలని రంగుల్లో ముద్రిస్తున్నారు అనిపిస్తుంది కాని, పైపదాల్లోని మొదటి మూడు అక్షరాలను భాజప జెండా వర్ణమైన కాషాయ వర్ణంలో ముద్రించి మిగిలిన అక్షరాలను ఇతర రంగుల్లో ఉండేలా చూస్తున్నారు. అంటే ప్రభుత్వ సొమ్ముతో ఇక్కడ అంతర్లీనంగా బీజేపీ ప్రచారం జరుగుతున్నది. మరో విషయమేమిటంటే సహజంగా ఎరువుల ఫ్యాక్టరీలు బస్తాలపై తమ కంపెనీ పేరుని ముద్రిస్తాయి. కాని ఇప్పుడు ఇచ్చిన జీఓ ప్రకారం బస్తా క్షేత్రంలో ఏరియా 2/3 క్షేత్రం (ఏరియా)లో భారతీయ జన ఉర్వరక్ పరియోజన అనే పదాలు ఉండాలని, మిగిలిన 1/3 వంతు భాగంలోనే కంపెనీ తమ పేరు ముద్రించుకోవాలనీ ఏలినవారి ఆదేశం!
ఉరవర్క్ అన్నా జన ఉరవర్క్ అన్నా అర్థం ఒకటే. ఇంతకు ముందు 'భారతీయ ఉరవర్క్ యోజన' అని ఉండేది. ఉరవర్క్ని జన ఉరవర్క్గాను యోజనని పరియోజనగాను మార్చి మొదటి మూడు అక్షరాలు పైనింది కిందికి చదివితే బీజేపీ అని వచ్చేలా ఈ మార్పు చేసారు. ఇది పేరుకి ప్రభుత్వ ప్రచారం కానీ జరుగుతున్నది పార్టీ ప్రచారం. యోజన అంటే స్కీం. అదే పరియోజన అంటే ప్రాజెక్ట్. అర్థంలో మార్పేమీ లేదు, కానీ పరమార్ధం వేరుగా ఉంది!
సొమ్ము ప్రజలది, స్కీం ప్రభత్వానిది కానీ సోకు (ప్రచారం) మాత్రం అధికార పార్టీది. చూడండి ప్రజల డబ్బుని ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి ఎలా ఉపయోగింస్తుందో..!
- పలకంశెట్టి జయప్రకాష్, సెల్: 374851426