Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతం మేఘాలయలోని చిరపుంజి అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కేరళలో జనం ఎప్పుడూ గొడుగులు పట్టుకుని తిరుగుతుంటారు. దానికి కారణమేమంటే... అక్కడి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియని పరిస్థితి. అందువల్ల అక్కడి జనాల చేతిలో ఎప్పుడూ గొడుగులుండటం పరిపాటి. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఆ రెండింటికీ ఏమీ తీసిపోవటం లేదు. ఇక్కడ కూడా ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియక జనాలు అయోమయంలో పడుతున్నారు. అయితే ఎండకాయటాన్ని చూసి వాన రాదనుకుని... బయటికెళితే ముద్దముద్దయి పోవాల్సి వస్తున్నది. అదే వర్షం పడుతుందేమోననే అంచనాలో రెయిన్ కోట్లు, గొడుగులు పట్టుకుని వెళితే... ఆ రోజు ఒక్క చుక్కా పడటం లేదు. ఈ విచిత్రమైన పరిస్థితిని చూసిన ఓ పాత్రికేయుడు ఇటీవల మన హైదరాబాద్కు కేరళ, చిరపుంజీల పేర్లను కలిపి కేరళపుంజి అనే పేరు పెడితే పోలా... అంటూ చమక్కులు విసిరారు.
- కేఎన్ హరి