Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతోన్మాద శక్తులే
దేశాన్ని పాలిస్తున్నారు
నిరంకుశ మూకలే
జాతిని శాసిస్తున్నారు
అధికార పీఠమే ధ్యేయంగా...
విష రాజకీయం చేస్తున్నారు
గుత్తాధిపత్యం లక్ష్యంగా...
అణిచివేతకు తెగబడుతున్నారు
హిందుత్వం ఎజెండాగా...
లౌకికతను పాతరేస్తున్నారు
కాషాయీకరణ ఆశయంగా ..
విద్వేషాగ్నులు రాజేస్తున్నారు
జాతి భద్రత మాటున...
నల్ల చట్టాలు సంధిస్తున్నారు
దేశ నిర్మాణం పేరిట ...
బతుకులు కూలదోస్తున్నారు
సంక్షేమ గీతం పల్లవిస్తూనే
అరాచకాలకు తెగబడుతున్నారు
ప్రగతి మంత్రం జపిస్తూనే
దారిద్య్రంలోకి నెట్టేస్తున్నారు
కలాలకు సంకెళ్లు
గళాలకు ఉరితాళ్లు
హక్కులకు ఉక్కుపాదాలు
ఊపిరిలపై నిషేధాజ్ఞలు
పిడికిళ్లపై విద్రోహముద్రలు
ఇదే కదా నేటి పాలక తీరు
ఎగిరే ఎర్ర జెండా సాక్షిగా
ఇక సకల జనం సంఘటితమై
మతోన్మాద కోటలు కూల్చాల్సిందే
నియంత పాలకులను
కడ తేర్చాల్సిందే.
- కోడిగూటి తిరుపతి
సెల్:9573929493