Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశం అనేక భాషలు, అనేక సంస్కృతీ సాంప్రదాయాలు ఉన్న దేశం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్టత. ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా ఉంటూ అందరూ కలసిమెలసి జీవిస్తుండడం ఎంతో గర్వకారణం కూడా. చిన్నతనం నుంచి దేశభక్తి, మాతృభక్తి, గురుభక్తి వంటివి ఒకరు చెప్పకుండానే ఉగ్గుపాలతో అలవడి పోమన దేశం అనేక భాషలు, అనేక సంస్కృతీ సాంప్రదాయాలు ఉన్న దేశం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్టత. ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా ఉంటూ అందరూ కలసిమెలసి జీవిస్తుండడం ఎంతో గర్వకారణం కూడా. చిన్నతనం నుంచి దేశభక్తి, మాతృభక్తి, గురుభక్తి వంటివి యే దేశం మనది. అమ్మ ఒడిలోనే అమ్మ భాషతోనే చిన్నారి ఎదుగుతుంది. జన్మభూమి పట్ల, మాతృభాష పట్ల ఎవరికైనా సరే చిన్నతనం నుంచి మమకారం ఏర్పడుతుంది. ఇది సహజం. అయితే, కేవలం మాతృ భాష పట్ల అనురక్తి ఉంటేనే జీవితం గడవదు కనుక, జీవన వికాసానికి దోహదం చేసేం దుకు అవసరమైన భాషలను పిల్లలకు బడుల్లో నేర్పుతున్నారు. ఇక పెరిగి పెద్దయ్యాక ఎవరి విచక్షణ వారిది.
మాతృభాష పట్ల మమకారంతో పాటు ఇతర భాషల పట్ల అభిమానం ఉండేవారికి, ఆయా భాషలను ఇష్టపడి నేర్చుకునే వారికి కూడా మన దేశంలో కొదవే లేదు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే హిందీ భాషను తప్పని సరిగా నేర్చుకోవాలంటూ తాజాగా కేంద్ర హౌంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు నేడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలతో సహా అన్ని టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థల్లో బోధనా మాధ్యమం తప్పనిసరిగా హిందీలో ఉండాలని, ఖచ్చితంగా అవసరమైన చోట మాత్రమే ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా ఉండాలని, క్రమంగా ఇంగ్లీష్‌ను హిందీతో భర్తీ చేయాలని, శిక్షణా సంస్థల్లో హిందీలోనే బోధన సాగాలని, హైకోర్టు ప్రొసీడింగ్‌లో ఇచ్చిన ఉత్తర్వులను హిందీలో అనువదించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఈ కమిటీ చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లల్లో హిందీలో పనిచేయడం తప్పనిసరని, ఉద్యోగుల ఎంపిక సమయంలో హిందీ పరిజ్ఞానం అవసరమని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించిన నివేదిక 11వ సంపుటిలో కమిటీ 112 సిఫార్సులు చేసింది.
ఈ నివేదిక రాగానే కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వెంటనే తమ వ్యతిరేకతను తెలియజేశాయి. విద్యా రంగంలో రాష్ట్రాల నిర్థిష్ట అంశాలను గుర్తించాలని, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మన సహకార సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హితవు పలికారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరిగా రుద్దడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హిందీని రుద్దడం భారత సమగ్రతకు, భిన్నత్వానికి వ్యతిరేకమని, గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నుండి బీజేపీ నేర్చుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హెచ్చరించారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే నినాదంతో సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని అమిత్ షా నేతృత్వంలోని కమిటీ భావిస్తోందని, ఈ కమిటీ చేసిన సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకుండా అన్ని రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు కలిసి కట్టుగా దీన్ని వ్యతిరేకించాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జె.డి.కుమారస్వామి పిలుపు నిచ్చారు. అయితే ఈ వివాదం ఈనాటిది కాదు. 1960వ దశకంలో తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం ఇప్పుడు తిరిగి ఆ రాష్ట్రంలోనే గాక తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఈశాన్య భారత రాష్ట్రాలకూ విస్తరిస్తోంది.
ఇన్ని సంవత్సరాలుగా స్తబ్ధుగా ఉన్న హిందీ వ్యతిరేకత మళ్లీ పుంజుకోవడానికి కారణమేంటి? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందీని రాజభాషగా రుద్దేందుకు ఎందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది? బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా దేశం మొత్తం అనుసంధాన భాషగా హిందీయే ఉండాలని కోరుకుంటున్నది. కనుక భిన్న భాషలు, మతాలకు అలవాలమైన మన దేశపు విశిష్టమైన గొప్ప భాషా వైవిద్యాన్ని ధ్వంసం చేసి... ''హిందీ, హిందూ, హిందుస్థాన్'' అనే ఆర్ఎస్ఎస్ బావాజాలాన్ని ఆచరణలో పెట్టాలన్నదే ఏలినవారి అభిమతం. హిందీ బెల్ట్‌లో ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించే లక్ష్యం కూడా ఇందులో ఉన్నది. ఎన్నికల్లో లబ్ధి పొందాక దానిని మరింత సుస్థిరం చేసుకోవడానికి పరిపాలన, ప్రభుత్వ కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తున్నారు. ప్రతీ యేటా సెప్టెంబరు 14న హిందీ దివస్‌ను అట్టహాసంగా నిర్వహిస్తూ హిందీ భాష అమలుకు హౌం శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో మాట్లాడే ఏ భాషకూ జాతీయ హౌదా లేదు. తమ అధికారిక భాషను నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. ఆ ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా హిందీకి తప్ప మరో భాషకు సహాయ పడకుండా దేశానికి తమ హిందీ భాషే జాతీయ భాష కావాలని నిరంతరం కోరుకుంటున్నది. ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిపై చెలాయించడానికే హిందీని రుద్దుతున్నారు. 2008లో హిందీ నేతలు రాజ్యాంగంలోని ఆర్టికిల్ 248ని సవరించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో హిందీలో తీర్పులు తేవాలని ప్రతిపాదించారు. దానికి లా కమిషన్ ''భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడద''ని తీర్పునిచ్చింది.
ప్రజలు ఏ దేశంలో నివసించినా వారి భాషలో, భాషతోనే బతుకుతారు. భాష పోతే ప్రాణం పోయి నట్లు ఉంటుంది. ఏ భాషా ప్రాంతం వారైనా మరో భాష పెత్తనాన్ని సహించలేరు. భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నం. ఆ అధికారం మరో భాషకు ఇవ్వరు. తమ భాషా సంస్కృతులను ఆ భాష నాశనం చేస్తుందని భయపడతారు. తమ భాష పైనా, మాండలికం పైనా, సంస్కృతి పైనా ప్రజలకుండే మక్కువ అలాంటిది. అది మరిచి హిందీని తప్పనిసరి చేస్తే ఇతర భాషల ప్రజలు నష్టపోతారు. హిందీ నేర్చుకుతీరాలని ఇతరులపై ఒత్తిడి తీసుకు రావడం, హిందీ వస్తేనే ఉద్యోగం, హిందీలో రాణిస్తేనే పదోన్నతి, అంటే ఇతర భాషల ప్రజల పరిస్థితేమిటి? అసలు హిందీ వాళ్ళు ఎప్పుడైనా మరో భారతీయ భాష నేర్చుకున్నారా? ఇతర భాషలను వాటి మానాన వాటిని ఎదగనిచ్చారా? ఉత్తరాది నాయకులకు హిందీని రాజ భాషగా చెప్పి మిగతా భాషా ప్రాంతాలనూ ఏలాలన్న దురాశ, ఆదుర్దా మాత్రమే ఉన్నాయి గానీ అసలు హిందీ జాతీయ భాష కాదు. 22 అధికార భాషల్లో అదొకటి మాత్రమే. దేశమంటే మట్టి కాదు. దేశమంటే అనేక భాషల, అనేక మతాల మనుషులు. వారి సంస్కృతులు వేరు. వారి సంప్రదాయాలు వేరు. కాబట్టి వారి మాటలను, పలుకుబడిని, భాషను, యాసను గౌరవించడం అవసరం. 1960 ప్రాంతాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళ భాషా ప్రాంతాల్లో హిందీ పట్ల వ్యతిరేకత వెల్లువెత్తింది. ఏ భాష అయినా ఇష్టపడి నేర్చుకోవాలే కానీ, బలవంతంగా రుద్దడం, తప్పనిసరి చేయడం తగదంటూ అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత కాలంలో రాజ్యాంగసభ నిర్ణయం మేరకు 1965 నుంచి హిందీ రాష్ట్ర భాషగా రావాల్సి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల మనోభావాల్ని గౌరవిస్తూ అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రజలు కోరినంతకాలం ఆంగ్ల భాషను వినియోగించు కోవడాన్ని కొనసాగి స్తామనడం, ఆ తర్వాత లాల్‌బహుదూర్ శాస్త్రి హిందీయేతర రాష్ట్రాల సమ్మతి లేకుండా ఆ ఏర్పాటులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేయడంతో అంతటితో ఆ వివాదం సద్దుమణిగింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏదో ఒక దొడ్డిదారిలో హిందీని ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో వందల భాషలు ఉన్న భారతదేశంలో ఒక్క హిందీకే ప్రాధాన్యత ఇవ్వాలను కోవడం సమం జసమేనా? దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడే భాషను దేశవ్యాప్తంగా రుద్దడం సహేతు కమేనా? 20శాతం ప్రాచుర్యంలో ఉన్న భాషను తీసుకొచ్చి దేశంలోని మిగతా 80శాతం మంది ప్రజలు మాట్లాడా ల్సిందేననడంలో అర్థం ఉందా? దేశంలోని 22 భాష లను జాతీయ భాషలుగా గుర్తించింది ఈ రాజ్యాంగం. అలాంటప్పుడు హిందీ మాత్రమే దేశ భాష ఎలా అవుతుంది. ఈ దేశంలో నివసించే ఎవరైనా సరే తాను వ్యక్తపరచాలనుకున్న విషయాన్ని ఏ భాషలోనైనా చెప్పేందుకు స్వేచ్ఛ ఉంది. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా! మరి ఎవరి భాష వారికి వారసత్వ సంపద కాదా?
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140