Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినరండయా బాబు వినరండయా
మునుగోడు బాగోతం కనరండయా
రాజకీయ వ్యభిచారం రంగు మార్చేటోళ్ళు
మళ్ళీ మళ్ళీ మోసాలతో వచ్చారయా
ఉప ఎన్నికల తంటానే తెచ్చారయా.. ||విన||
కాంట్రాక్టు కమిషన్లు దండేటివారు
జనం డబ్బు కోట్లు కోట్లు దోచేటివారు
ఓట్లాట నాటకం చూపేరయా... ||విన||
ప్రజల క్షేమం గాలికొదిలేసి
మందు బిర్యానీ కాకాలు పట్టి
పంగనామాలు భలెపెడతారయా ||విన||
మనిషిని మనిషిగ చూడలేనోళ్ళు
మతపిచ్చితో రాజ్యమేలేటోళ్ళు
సందు చూసుకుని గంతులేస్తారయా ||విన||
ప్రజల ఆస్తులను ప్రభుత్వ సంస్థలను
అప్పనంగ అదానీ అంబానీలకు
దోచిపెట్టే నేతలే బందిపోట్లయా ||విన||
వీర తెలంగాణ అమరవీరుల పోరు
ఊపిరున్నంత వరకు ఉగ్గబట్టి
రాజకీయ దొంగల్ని తరమాలయా ||విన||
- కె శాంతారావు
సెల్: 9959745723