Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ'కీయం' అంటేనే అదో చదరంగం లాంటిదని విశ్లేషకులు అంటుంటారు. బూర్జువా రాజకీయ పార్టీల్లో నేతలు కప్పలతక్కెడను తలపిస్తుంటరు. అందరికీ ఎరుకైన ముచ్చటేనాయే. గందులోనూ ఎన్నికల్లోనైతే మరీనూ. గొడ దుంకడం కోసం ఎదురుతెన్నులు చూస్తుంటారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆపార్టీకి వలసలు మామూలేనాయే. ఇప్పుడు గా సోదీ ఎందుకు, గది ఎప్పుడు ఉండేదే కదా! అని అనుకుంటున్నరు కాబోలు. గాడనే ఉంది అసలు మతులబు. గిప్పుడు మునుగోడులో జోరుగా కప్పలతక్కెడ్లు కనిపిస్తున్నయి. రాష్ట్రంలోని పార్టీ నుంచి కేంద్రంలోని పార్టీకి, కేంద్రంలోని పార్టీ నుంచి రాష్ట్రంలోని పార్టీకి రోజురోజుకు జంప్జిలానీలు పెరగబట్టిరి. గ్రామసర్పంచ్, ఎంపీటీసీ నుంచి షురూ చేస్తే, మాజీ ఎంపీ దాకా గాతక్కెడ్లో కప్పలే గాబట్టిరి. ఒక్కొక్కరు ఒక్కో సాకుతో జారిపోబట్టిరి. గీ తమాషా అంతా జనం గమనిస్తున్నారనుకోండ్రి. అయినా కిస్కో పర్వా నహీ. తమ కండువా కప్పుకున్న ఒక యువనాయకుడికి భవిష్యత్లో అవకాశాలు కల్పిస్తమని జెప్పి ట్విట్ చేసినట్టుగా ఓ మాట ఒదిలిండు ప్రగతిభవన్ మంత్రి. అధికార పార్టీ నుంచి ఎల్లిపోయిన గా మాజీ ఎంపీ ప్రజల బాధలు చెప్పడానికి వీల్లేకపోయిందంటూ కేంద్రం పార్టీలోకి పలాయనం చేసిండు. గిప్పుడేముంది జెర్ర రెండు రోజులు ఆగుండ్రి ఇంకా మజా బాగుంటది అంటున్నరా! అయితే ఒకే !!
- బి. బసవపున్నయ్య