Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు వెయ్యాలె ఓటు అడగండమ్మా
బీజేపోళ్లు ఓట్లు అడగగ వస్తే
ఏమి చేసిండ్రని కడగండమ్మ
మోడీ పేరు చెప్పి మోసగించగ వస్తే
సిలిండర్ ధరలను పెంచినందుకా
వంటగదిలోన మంట ఆర్పి నందుకా
కట్టెల పోయ్యి మల్ల తెచ్చినందుకా
ఆడవాళ్ళ కంటిలో పొగ పెట్టినందుకా
దిన సరుకుల ధరలను పెంచినందుకా
ప్రజల జోబులకు సిల్లు పెట్టినందుకా
జీఎస్టీ తెచ్చి అగ్గి పెట్టినందుకా
కత్తిలేకుండా గుండు గీసినందుకా...
ఎరువుల ధరలను బాగా పెంచినందుకా
రైతున్నల గోసి ఊడ కొట్టినందుకా
మోటార్లకు మీటర్ తెస్తున్నందుకా
రైతుల నెత్తురు తాగా చూసినందుకా
మద్దతు ధర ఇవ్వమంటే ఇవ్వనందుకా
అప్పులల్లో రైతులను ముంచినందుకా
ఒక్కొక్కటి వరసబెట్టి అడగండమ్మ
కర్రు కాల్చి వీపు వాత పెట్టండమ్మ
రైల్వే, విమానాలు అమ్మినందుకా
బ్యాంకులు, పైవేటు ఫరం చేసినందుకా
కార్పొరేట్లకు సంపద పంచినందుకా
ఆదాని అంబానీలను పెంచినందుకా
అప్పుల ఎగవేతదారుల మేపినందుకా
మోడీలతో బ్యాంకుల బోడి చేసినందుకా
ఈ దేశాన్నే అంగట్లో పెట్టినందుకా
మన మునుగోడును
కూడా అమ్ముడు పెట్టేటందుకా...
- కాకం అంజన్న