Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా... మరి ఆ ప్రాణం ఖరీదులో తేడాలు అవసరమా? అంటే అవును అనే చెబుతున్నాయి. మన చట్టాలు. పేద ధనికులను బట్టి, వారి స్తోమతను బట్టి వారికి ఖరీదు కడుతున్నాయి మన ఇన్సూరెన్స్ కంపెనీలు. అంటే పోయేటప్పుడు అందరు ప్రాణం ఖరీదు ఒకటి కాదన్నమాట. ఒకే రకమైన మానవ తప్పిదం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో కూడా ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఇచ్చే ప్రమాద బీమాలో డబ్బు ఉన్నవారికి, ఉన్నతంగా స్థిరపడినవారి ప్రాణానికి ఎక్కువ ఖరీదు, కడు హీనపరిస్థితుల్లో ఉన్న పేదవాడి కుటుంబానికి తక్కువ ఖరీదు కట్టమని మన మోటార్ వెహికల్స్ ఆక్ట్ పేర్కొంటుంది. ఇది న్యాయమా? ప్రపంచంలోనే ఆదర్శమని చెప్పుకునే మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులలో చెప్పుకునే సమానత్వం, పౌరుల మరణంలో లేదా? అయినా ప్రాణానికి ఖరీదు కట్టడమే ఒక అనాచారం అయితే అందులోనూ ఆర్థిక స్థితిని బట్టి తేడాలా? ఇది ఏమైనా న్యాయమా? న్యాయ కోవిదులే ఆలోచించాలి. మోటార్ వెహికల్ యాక్సిడెంట్‌కు సంబంధించి మరణం సంభవించినా, లేక డిసేబులిటీ లెక్కించిన వికలాంగుల కైనా వారి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా వారికి ఇచ్చే నష్టపరిహారం సమానంగా ఉండాలి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అని చెప్పినట్టుగానే బాధితుల కుటుంబాలకు కూడా ఆర్థిక స్తోమతలను బట్టి కాకుండా వారి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా స్లాబ్ రేటు నిర్ణయించేలా మోటార్ వెహికల్ యాక్టును సవరించాలి. ఇదే కదా న్యాయం. న్యాయ కోవిదులు, ముఖ్యంగా అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తులు ఆలోచిస్తారని నా ఆవేదన.
- టి కిషోర్, 9440725437