Authorization
Wed April 16, 2025 10:03:47 am
విప్లవమే తన ఇజం
ఉద్యమమే తన పథం
ధిక్కారమే తన అస్త్రం
ప్రతిఘటనే తన మంత్రం
స్వతంత్రమే తన స్వప్నం
జనోద్దరణే తన సర్వస్వం
అతడే గిరిజన రణ వీర్
కామ్రేడ్ ..కొమురం భీమ్
నిజాం అరాచక పాలనపై
విప్లవ జెండా ఎత్తినవాడు
ఆదివాసీ హక్కుల కోసం
సాయుధ పోరెత్తి సాగినవాడు
జల్ జమీన్ జంగిల్ అంటూ...
జంగ్ సైరనై మోగినవాడు
దున్నేవాడిదే భూమి అంటూ
దిగంతాలు నినదించినవాడు
సేచ్చ కోసం ...
ఆత్మగౌరవం కోసం..
స్వయం పాలన కోసం
తుది శ్వాస వరకు పోరాడి
అమరత్వం హత్తుకున్నాడు
పోరాటాల వీరుడికి
గోండు గూడాల సలామ్
విప్లవాల సూర్యునికి
తెలంగాణ జన సెల్యూట్
(అక్టోబర్ 22 కొమురం భీమ్ జయంతి)
- కోడిగూటి తిరుపతి :9573929493