Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమణన్నా నీ బాటలో అడుగేస్తాము
నీ ఆశయ సాధనకై పాటు పడుతము
త్యాగాల చరితన్నా నీ జీవితము
జీవితాంతము మేము నిన్ను మరువము
ఉన్నత చదువులు చదివి ఉన్నత కొలువులు పొంది
శ్రామిక జన మేలు కొరకు సర్వం త్యాగం చేస్తివి
సుందరయ్య వారసుడిని అందరివాడవు నీవు
సింగరేణి బిడ్డలకు ఆప్తుడవైనావయ్యా
ఏ ఊరున పుట్టావో ఏ తల్లీ నిను కన్నదో
మాలో ఒక్కడివయ్యీ మా కోసం బ్రతి కావు
అధ్యయనం ఉద్యమమూ రెండు కళ్ళు నీకన్నా
నింగిలొ చుక్కగ మారి వెలుగు చూపు రమణన్న
(నేడు కాగజ్‌నగర్‌లో రమణ సంస్మరణసభ సందర్భంగా)
- ఆర్. రాజేశమ్