Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఫాసిస్టు భావజాలం ప్రజల్లో సుస్పష్ట ఐక్యత తెస్తుంది. హిందూసేన పునర్నిర్మాణానికి హిందూ భారత్‌కు అలాంటి సంస్థ కావాలి. హెగ్డేవార్ ఆధ్వర్యంలోని మన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు అలాంటిదే.'' 1931లో ఇటలీ ఫాసిస్టు నియంత ముసోలినిని కలిసిన తర్వాత హిందూ జాతీయవాద నాయకుడు బాలకృష్ణ శివరాం మూంజ్ వాక్కులివి. సంఫ్‌ుపరివార్ సంస్థలు నాజీ హిట్లర్, ఫాసిస్టు ముసోలినిలతో ప్రేరణ పొందాయి. హిందువు లకు ప్రత్యేక హక్కులు కావాలని వాదిస్తున్నాయి.
హిందూమతం-హిందూత్వం: ఇండో ఆర్యన్ల సంస్కృత పదం సింధు నుండి హిందు పుట్టింది. సంపద పోగేసుకోటం (అర్థ), కోరికలు తీర్చుకోటం (కామ), పునర్జన్మ నుండి ముక్తిపొందటం (మోక్ష) హిందూమత ధర్మాలు. ''హిందు, భారతీయం ఒకటే. భారతీయులంతా హిందువులే. భారత్ హిందూదేశం. భారత ఉపఖండ ప్రజలందరు హిందువులు. భారత్ వారి పితృభూమి, పుణ్యభూమి. ఆక్రమణ దారులు నాశనంచేసిన హిందూ సంస్కృతిని పునరుద్ధరించాలి.'' ఇది హిందూత్వవాదం. హిందూత్వం విద్యార్థులు సంస్కృతం, వైదిక జ్ఞానం నేర్చుకోవాలంటుంది. ఖిలాఫత్ ఉద్యమ ముస్లిం రాజకీయాలను ప్రతిచర్యగా అనుకరించింది. హిందూత్వ సూత్రకారుడు సావర్కర్, ఆర్.ఎస్.ఎస్ రెండవ ప్రధాన కార్యదర్శి గోల్వాల్కర్ల ప్రవచనాలు హిందూత్వ తాత్వికతకు ఆదర్శాలు.
బెంగాలీ చంద్రనాథ్ బసు 'హిందూత్వ' పుస్తకంలో హిందూత్వ పదం మొదటగా రాశారు. గుర్తింపు కోసం సావర్కర్ దీన్ని ప్రచారంచేశారు. మతం-సంస్కృతి, ఉమ్మడి దేశం, ఉమ్మడి జాతి, ఉమ్మడి సంస్కృతి సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. హిందూత్వంలో హిందు, జైన, బౌద్ధ, శిక్కు మతాలను చేర్చారు. సంఫ్‌ుపరివార్ సంస్థలు హిందూత్వను హైందవజాతి ఐక్యతా ఉద్యమంగా ప్రచారం చేశాయి. నాస్తిక సావర్కర్‌కు ముస్లింలు శత్రువులు, బ్రిటిష్ దోపిడీ కంటే ముస్లిం సంస్కృతి అపాయకరం. ''హిందూత్వం విశాల భావాల మానవ భాష. ప్రజల ఆధ్యాత్మిక చరిత్ర కాదు. సంపూర్ణ మానవ చరిత్ర'' అని సావర్కర్ అతిశయించారు. హిందూత్వం హిందూ విశ్వాసాల, ఉన్నత కుల పెత్తనాల రాజకీయ ఉద్యమం. రాజ్యాధికారం పొందటానికి మార్గాలు చూపిన పిడివాదం.
సావర్కర్ దేశాన్ని హిందూత్వ ప్రాతిపదికన పునర్నిర్మించాలన్న ఆశయంతో బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరి అండమాన్ జైలు నుండి వచ్చారు. సావర్కర్‌కు ముందు వివేకానంద, దయానంద సరస్వతి, తిలక్ వంటి వారు హిందూ పునరుద్ధరణ చేపట్టారు. సావర్కర్ హిందూ పునరుజ్జీవనాన్ని రాజకీయ కోణంలో నిర్వచించారు. హిందూ వేదకాలం నాటిది అన్నారు. ఆనాటి నుండే భారత్ హిందూదేశమన్నారు. ''ఈ దేశాన్ని పితృ భూమిగా, పుణ్యభూమిగా పరిగణించే వారంతా హిందువులే. ఈ ప్రాతి పదికన శిక్కులు, బౌద్ధులు, జైనులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు జాతీయవాదులైనా వారి పుణ్య భూములు అరేబియా, ఇజ్రాయిల్‌లలో ఉన్నాయి. వారు హిందువులు కారు'' అని వ్యాఖ్యానించారు.
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందూ ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థంచెప్పారు. 11.9.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందూ ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. సంఫ్‌ు ఆరాధ్యుడు ఉమాకాంత్ ఆప్టే, ఆర్.ఎస్.ఎస్.కు వివేకానంద భగవద్గీత అన్నారు. కానీ, వివేకానంద మతసామరస్యత, మానవవాదాలు బోధించారు. కులవ్యవస్థను తిరస్కరించారు. ''ముస్లిం సహకారం లేకపోతే మానవజాతికి విలువలేదు. మతగ్రంథాల అవసరంలేని స్థితికి మానవజాతిని చేర్చాలి. ప్రజలు ఆకలితో మాడుతుంటే మనకు నిద్రెలా వస్తుంది? కులకొట్లాటలతో ప్రయోజనంలేదు. తక్కువ కులస్తులను కించపరచటంతో వారు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు. మానవ జీవితం గోజీవితం కంటే విలువైనది'' ఇవీ వివేకానందుని ప్రవచనాలు.
గాంధీ వర్ణాశ్రమ ధర్మాలను నమ్మిన హిందూ భక్తుడు. లౌకికత్వం, ఆధ్యాత్మికతలను అనుసంధానించారు. సామాజిక, రాజకీయ తాత్వికతలో రామరాజ్య భావాల ప్రచారం చేశారు. ''స్వాతంత్య్రమంటే బ్రిటిష్ దిగువసభ, ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజీయిజం కాదు. నైతికాధికారాల ప్రజల సర్వసత్తాక రామరాజ్యం. అట్టడుగు పౌరునికీ న్యాయం అందించగల ప్రజాస్వామ్యం. అన్ని మతాలనూ గౌరవించ గలది'' అని గాంధీ వక్కాణించారు. మత నైతికతను రాజకీయాల్లోకి తెచ్చారు. సావర్కర్లాగా రాజకీయ తీవ్రవాదాన్ని మత మూకలోకి చొప్పించలేదు. భారతీయులంతా హిందువులుగా ఉండాలన్న సావర్కర్ సంకుచిత హిందూత్వం, మతాలన్నీ కలిసి బతకాలన్న గాంధీ హిందూమతానికి వ్యతిరేకం. సావర్కర్తో, హిందూత్వంతో సమీప సంబంధంగల హిందూమతోన్మాది గోడ్సే గాంధీని చంపారు. గాంధీ హిందూమతాన్ని ప్రేమించినా ఏ మతాన్నీ అగౌరవించలేదు. గాంధీ మతం మానవత్వం, మానవసేవ, సర్వోదయం.
హిందుత్వ విజృంభణ: నెహ్రూ లౌకికవిధానం ఆచరించారు. 1960లో కాంగ్రెస్ హిందూత్వ రాజీ ధోరణి మొదలైంది. 1964లో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించింది. గోవధనిషేధ ఉద్యమం మొదలుపెట్టారు. 1967లో కాంగ్రెస్ ప్రభావం తగ్గింది. మిశ్రమ ప్రభుత్వాల్లో జన సంఫ్‌ు అధికారం పంచుకుంది. గోవధనిషేధ ఉద్యమం సాగిన ఉత్తరప్రదేశ్‌లో గెలిచింది. ఇందిర ఎమర్జెన్సీలో ఆర్.ఎస్.ఎస్, జనసంఫ్ుల అంటరానితనం పోయి బలపడ్డాయి. కాంగ్రెస్, వామపక్షాలు బలహీనపడ్డాయి. సంఘీయులు హిందూకు బదులు భారతీయ వాడారు. భారతీయ జనసంఫ్‌ు, భారతీయ జనతా పార్టీ, ఇతర అనుబంధ సంస్థలకూ భారతీయ జోడించారు. అయోధ్య మందిర్ ఉద్యమం మొదలుపెట్టారు. అద్వాణీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో హిందూత్వం వేళ్లూనుకుంది. వాజ్‌పేయి పాలనలో చాపకింద నీరులా పారింది. కాంగ్రెస్, ఇతర పాలక పక్షాలు హిందూత్వ మెతక ధోరణి పాటించాయి. 2004 నుండి పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డ అఘాతంలో, అభివృద్ధి నాయకునిగా డబ్బా కొట్టుకున్న మోడీ దిగబడ్డారు. రెచ్చేగొట్టే అబద్ధాల ఉపన్యాసాల, ప్రచార పటాటోపాల, ఉద్వేగ మతోన్మాదాలతో కుర్చీలో స్థిరపడ్డారు. బ్రాహ్మణేతర హిందువులూ బ్రాహ్మణత్వాన్ని పూసుకున్నారు. హిందూ జాతీయవాదం ముస్లిం వ్యతిరేక రూపం దాల్చింది. మోడీ-షా-యోగి కాషాయ త్రయంలో హిందూత్వ ఆగడాలు పెరిగాయి. హిందూత్వం విజృంభింది.
చివరి మాట: మత పెద్దలు ప్రేక్షకపాత్ర వదలాలి. మతోన్మాదంతో తామూ నష్టపోతా మని గుర్తించాలి. హిందూత్వవాదాన్ని ఎదిరించ వలసిన ప్రత్యేక బాధ్యత హిందువులుగా పుట్టిన ప్రగతిశీలురది. విద్యార్థులకు, ప్రజలకు మానవీ యశాస్త్రాలు, సామాజిక, సాంస్కృతిక అంశాలు నేర్పాలి. శాస్త్రీయ దృక్పథం అలవర్చాలి. జీవపరిణామక్రమం తెలపాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545