Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటు అమ్ముకోవడానికి
నీ స్వంత ఆస్తి కాదు,
అది ఈ దేశమిచ్చిన అస్థిత్వం.
ఓటంటే నీ వేలికంటిన సిరా చుక్క కాదు,
కడిగేస్తే పోవడానికి.
అది పార్లమెంటులో నీ గొంతుక కావాలి.
ఎప్పటికీ చెరిగిపోని శాసనమవ్వాలి.
భారతీయ సమాజం
ప్రపంచంలోనే అత్యధికంగా ఓటర్లున్న
అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.
ఇక్కడ నాయకులను ఎన్నుకోవాలంటే
ఓటే ప్రధాన ఆయుధం.
ఓటు హక్కుతో పీఠాలు నిలబడటమే కాదు,
కూలిపోతాయి కూడా.
అంత శక్తివంతమైన ఓటు
ఇప్పుడు అంగట్లో
తూకానికి అమ్ముడవుతోంది.
-అవనిశ్రీ. 9985419424