Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతను ఒక ఉద్యమకర్త, సేవాశీలి, కమ్యునిష్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయులు, నవలలకు ప్రాణం పోసిన మేధావి, ధిక్కార స్వరం, వైతాళికుడు, అభ్యుదయ రచయిత. వట్టికోట ఆళ్వారుస్వామి. 'ప్రజలమనిషి' నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. గ్రంధాలయోద్య మకారుడిగా, ప్రచురణ కర్తగా విశిష్ట మైన పాత్ర పోషించారు.'' ఒక సందర్భంలో అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారు స్వామి'' అని మహాకవి దాశరథి కీర్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజారచయిత, నిస్వార్థ సేవా పరాయణుడు వట్టికోట ఆళ్వారుస్వామి. నల్లగొండజిల్లాలోని శాలిగౌరారం మండలం (నకిరేకల్ సమీపంలోని) మాధవరం గ్రామంలో 1915 నవంబర్ ఒకటిన, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో వట్టికోట ఆళ్వారుస్వామి జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పరాయి ఇండ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి బతికాడు. అందువల్ల ప్రాథమిక దశలో కూడా విద్యాభాసానికి ఆయన నోచుకోలేదు. పదమూడు, పద్నాలుగేండ్ల వయసులో సూర్యాపేట గ్రంథాలయంలోనే అనేక పుస్తకాలు చదువుకున్నారు. సొంతంగా తెలుగు మాత్రమే గాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నకిరేకల్, సూర్యాపేట, ప్రాంతాల్లోని ఇండ్లలో వంటపనులు, విజయవాడలో హౌటల్ సర్వర్ వృత్తి, హైదరాబాద్ లో రీడర్ పని వంటి అనేక జీవన ప్రయాణాలు చేశాడు. చివరికి, 1936-37 ప్రాంతంలో హైదరాబాద్చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి 1961 ఫిబ్రవరిలో మరణించేవరకూ ఆయన జీవితమంతా సాహిత్య, సామాజిక కార్యక్రమాలకే అంకిత మయ్యాయి. కమ్యూనిస్టు కావడం వల్లనే ఆయన జైలుకు వెళ్లాల్సివచ్చినా వెరవలేదు. బయటికొచ్చాక కూడా అనేక ఉద్యమాల్లో పనిచేశారు.స్టేట్ కాంగ్రెస్, ఆర్యస మాజం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక, రాజకీయ, సాహిత్య సంస్థలన్నింటిలో చురుకయిన కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు ముందుండి నాయకత్వం వహిస్తూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూర మైనా, 1959లో కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆళ్వారుస్వామి, 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటంతో 'ప్రజల మనిషి' నవల రూపొందించారు. ప్రజా నాయ కుడు ప్రజలలోంచే పుడు తాడని చెప్పినాడు. గ్రామాల్లోని దొరల జీవితాలు, వాళ్ల దోపిడీ విధానాలు, ప్రజల అమాయకత్వం, బానిస బతుకు, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించడం, ప్రజల్లో క్రమంగా పుట్టిన చైతన్యం... వీటన్నింటిని ఆళ్వారుస్వామి 'ప్రజలమ నిషి' 'గంగు' నవలల్లో సహజంగా చిత్రించారు. అది పూర్తికాకముందే ఆయన మరణించారు. నవల అలాగే అసంపూర్తిగా ప్రచురితమైంది. 'గిర్దావరు' నవలికలో భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం, బలవంతపు విలీనం తర్వాత గంగు పోరాట ఫలితాలు ప్రజలకు ఎలా చేరకుండా పోయాయో వివరించారు. దేశ స్వాతంత్య్రానంతరం సమాజం, పెరుగుతున్న స్వార్థం, పతనమవుతున్న విలువలను సూటిగా, నిక్కచిగా విమర్శించడం ఈ వ్యాసాలలో ప్రతిబింబి స్తుంది. ఆళ్వారుస్వామి విలీనానంతర హైదరాబాద్‌లో చోటుచే సుకున్న హదయ విదారక పరిస్థితులను, నవహైదరాబాద్ రాష్ట్ర నిర్మాణానికి దోహదం చేసే తీరును వివరిస్తూ పదికి పైగా నాటకాలు రాశారు.
ఆళ్వారుస్వామి రాసిన 'జైలు లోపల' కథా సంపుటి 1952లో వెలువడింది. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆరేండ్లు జైల్లో గడిపిన ఆయన ఖైదీల జీవితాలను వారి మనస్తత్వాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 'నిజానికి ఇక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 95మంది నేరవృత్తి గలవారు కాదు. మిగతావారు సైతం స్వభావంగా నేరగాళ్లు కాదు. పరిస్థితులే వారినావిధంగా చేశాయి. ఆయన జైలులో ఉన్నకాలంలో తన అనుభవాలను ఆధారంగా ఈ 'జైలు లోపల' కథల సంపుటిని రచించారు. అక్కడి ఖైదీలతో కలిసిపోయి వారి గాథలను తెలుసు కుని వాటిని కథలుగా వెలువరించడం తెలుగులో ప్రథమం. 'జైలు నాలుగు గోడల మధ్య తోయబడిన జీవుల చరిత్ర, వారి మానసిక ప్రవృత్తి తీవ్రత, పశ్చాత్తాపాలను ఈ కథలు చిత్రించాయి. 'జైలులో పల' కథా సంపుటి కాకుండా, వివిధ పత్రికలలో ఆళ్వారుస్వామి రాసిన కథలు 27 వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్నా 'జైలు లోపల' కథలు భాష, శైలి, కథనం, కథన శిల్పంలో ముఖ్యమైనవి. ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించాయి. తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ మాండలికం లో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథనరూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోట కథలు నిలిచిపోతాయి. కథకునిగా, నవలా కారునిగా, ప్రజా ఉద్యమ నాయకునిగా ఆళ్వారుస్వామి జీవితకాలమంతా చేసిన కృషి ఈనాటి రచయితలకీ, కవులకీ ఆదర్శప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆరేండ్ల పాటు జైలుజీవితం అనుభవించిన రచయిత ఆళ్వారుస్వామి. .అందువల్లనే ఈనాటి సాహిత్య కారులకు ఆయన జీవితంస్ఫూర్తి దాయకం. వారు 1961 ఫిబ్రవరి 5న మరణించారు. ఆయన కథలు అంతా ఏకమైతే, భధనిక, పరిసరాలు, పరిగె, కాఫిర్లు, గాలి పటం, ఆలు కూలి వారిని ప్రతి కవి, రచయిత స్పూర్తిగా తీసుకొని సమాజ వికాసానికి కృషి చేయాలి. వారు జన్మించిన నల్లగొండ జిల్లాకి వట్టికోట జిల్లాగా నామకరణం చేయాలి. వారి కాంస్య విగ్రహంని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి. వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలి. (నవంబర్ 1న జయంతి సందర్భంగా)
- కమిడి సతీష్‌రెడ్డి
సెల్:9848445134