Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ 3, 2022న, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రభుత్వరంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)చే దేశీయంగా రూపకల్పన చేయబడి, తయారు చేయబడిన ''లైట్ కంబాట్ హెలికాప్టర్'' (ఎల్‌సిహెచ్) ''ప్రచండ''ను, భారత వైమానిక దళం (ఐఎఎఫ్) లో చేరుస్తూ, కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజనాథ్సింగ్ ''దేశం, భారత వైమానిక దళాన్ని ఎంతగా విశ్వసిస్తుందో, వైమానిక దళంకూడా దేశీయ పరిజ్ఞానం, ఉపకరణాలను అంతే విశ్వసిస్తుందనడానికి, ఎల్సీహెచ్ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టడమే గొప్ప నిదర్శనమని'' సెలవిచ్చారు. ఈ ప్రకటన పర్యవసానంగా, ఒకవేళ ఈ ప్రభుత్వంగానీ, దేశంలోని ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థలు గాని, రక్షణ సామాగ్రిని ఉత్పత్తి చేసే పరిశ్రమల (పిఎస్‌యుఎస్)పై క్రమేపి విశ్వాసాన్ని పెంచు కుంటున్నాయా అన్న ప్రశ్న, మన ముందు ఉత్పన్నమవుతుంది. ఈ ప్రభుత్వం, ప్రభుత్వ రంగంపై చూపుతున్న వివక్ష, చిన్న చూపు, ఒకప్రక్క పెద్ద ఎత్తున ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తూ, మరోప్రక్క అడ్డూ అదుపులేని విధంగా పిడిఐలను ఆహ్వానిస్తున్న వైనం, అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో, ఈ ప్రశ్న మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
ఈ ఎల్సీహెచ్ (ప్రచండ), హెచ్ఎఎల్ యొక్క హెలికాప్టర్ విభాగం, ఫ్రాన్స్‌కు చెందిన ూaటతీaఅ కలసి సంయుక్తంగా అభివృద్ధి పరిచిన రెండు శక్తివంతమైన ఇంజన్లతో సమకూర్చబడిన తక్కువ బరువుగల, చురుకైన యంత్రం. 6000 నుండి 6500 మీటర్ల అసాధారణమైన టశ్రీఱస్త్రష్ట్ర్ షవఱశ్రీఱఅస్త్ర తో అత్యంత క్లిష్టమైన ఎత్తులలో కూడా పనిచేయగల శక్తి, సామర్ధ్యాలను కలిగి ఉండడం, ప్రపంచంలోని మిగతా యుద్ధ హెలికాఫ్టర్ల కంటే దీని ప్రత్యేకత. 2004 తరువాత, హెచ్ఎఎల్, సైన్యం, దేశీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలన్న నిర్ణయం తీసుకున్ననాటి నుండే ఎల్‌సిహెచ్ యొక్క అభివృద్ధి ప్రారంభమైంది. దేశీయంగా హెలికాప్టర్ రూప కల్పనలో చెప్పుకోదగ్గ సామ ర్థ్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం, హెచ్‌సిఎల్ యొక్క ఎల్‌సిహెచ్ అసెంబ్లీ యూనిట్, సంవత్సరానికి 30 హెలీకాఫ్టర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అంచనా.
ప్రభుత్వం, ఈ మధ్యకాలంలో, హెచ్ఎఎల్ తయారు చేసిన ఎల్‌సిహెచ్, విక్రాంత్ యుద్ధనౌకల విషయాలలో 'ఆత్మనిర్భరత' గురించి గొప్పలు చెప్పుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టులు ప్రస్తుత ప్రభుత్వం అధికారానికి రాక ముందు నుండే తగినంత అభివృద్ధిని సాధించి ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మరో ప్రక్క, ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ రక్షణ రంగంలోని పిఎస్‌యుల పట్ల ఏహ్యత, తక్కువ అభిప్రాయమే కలిగి ఉంది. సిద్ధాంతపరంగానే వాటిని వ్యతిరేకిస్తూ, బాహాటంగా ప్రయివేటు రంగరక్షణ పరిశ్రమవైపే మొగ్గు చూపిస్తూ రావడం అందరికీ తెలుసు. రఫేల్ యుద్ధ విమానాల తాజా కొనుగోలు ఒప్పంద సమయంలో, హెచ్ఎఎల్ను అపఖ్యాతిపాలు చేసే విధంగా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు అందరికి గుర్తుండేవుంటాయి. ఇంకా, ఇదే ప్రభుత్వం అన్ని అభ్యంతరాలనూ తోసి బుచ్చుతూ రఫెల్ లాంటి హైటెక్ ప్రాజెక్ట్ విషయంలో హెచ్ఎఎల్పై ఆధారపడలేమని అంది. మరి ఇప్పుడు అదే హెచ్ఎఎల్ దేశీయంగా ఎల్సిహెచ్ను రూపొందించింది, Aూన, ూజన, ువjaర ూజA మొదలగు వాటన్నింటికి పెద్ద పెద్ద ఆర్దర్లు స్వీకరిస్తున్నది?
ప్రభుత్వరంగ సంస్థలు దేశానికి పట్టుకొమ్మలు. ఈ ప్రభుత్వం, ప్రభుత్వరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికీ, టోకుగా అమ్మేయడానికీ కంకణం కట్టుకుంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రయివేటు పెట్టుబడులకు పెద్దపీట వేస్తోంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుండి గట్టెక్కడానికి మూలకారణమైన, దేశ ఆర్థిక స్వావలంబనకు పునాదిగా నిలచిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వ్యవస్థలను సైతం విదేశీ, స్వదేశీ పెట్టుబడులకు, బడా కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో నిర్వీర్యం చేయబూనుతోంది.
చాలాకాలంగా, ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు, ప్రయివేట్ రంగ బ్యాంకు లను ప్రోత్సహించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అసమర్థంగా ఉన్నాయని, నష్టాలను చవిచూస్తు న్నాయని ప్రచారం ముమ్మరంగా చేయబడు తోంది. అయితే ప్రయివేటీకరణ, సైద్ధాంతిక దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు గడిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ లాభం ఏటా పెరుగుతోంది.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి) తమ నికర లాభాన్ని నాలుగు రెట్లు ఎక్కువ చేశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, 12 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. ఇది అంతకు ముందు సంవత్సరంలోని రూ.31,816 కోట్లతో పోలిస్తే 110శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చెల్లించే మొత్తం డివిడెండ్ రూ.8,000 కోట్లు దాటింది. ఇది ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చిన అంశం. మరి, ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ లాభాలను ఆర్జిస్తున్నా కూడా, ప్రభుత్వం బ్యాంకులను ఎందుకు ప్రయివేటీ కరించాలను కుంటోంది?
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి ఆఫ్ ఇండియా) దేశ ఆర్థికవ్యవస్థకే వెన్నెముకగా నిలిచింది. 1956 జాతీయీకరణ సమయంలో, ప్రభుత్వం పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడితో, ఈ రోజు రూ.42.6 లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చింది. 42కోట్ల పాలసీదారుల అచంచల విశ్వాసాన్ని చూరగొంది. 31.3.2022 నాటికి, ప్రభుత్వం పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడిపై, రూ.32000 కోట్లను డివిడెండ్ రూపంలో తిరిగి ప్రభుత్వానికి చెల్లించింది. క్లైముల చెల్లింపు అంశంలో 99.8శాతం ఫలితాలతో ప్రపంచం లోనే అగ్రగామిగా నిలిచింది. ఇటువంటి బంగారుబాతు వంటి ఎల్ఐసిని, వాటాల ఉపసంహరణ ద్వారా నిర్వీర్యం చేయడానికి తెరతీసింది ప్రభుత్వం. ఈ చర్యపై సర్వత్రా వెల్లువెత్తిన నిరసనలు, ప్రతిఘటన లను ఖాతరు చేయకుండా మొండి దృక్పథంతో, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా 3.5శాతం వాటాల అమ్మకాన్ని పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగిందని, ఇది చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణాలలో ఒకటిగా నిలిచిపోతుందని నిపుణులు వాపోయారు.
రూ.42.6 లక్షల కోట్ల ఆస్తులు కలిగియున్న ఎల్ఐసి విలువ, కేవలం రూ. 5.39 లక్షల కోట్లుగా నిర్ధారణ చేయబడింది. పైపెచ్చు, వీaతీసవ్ జaజూఱ్aశ్రీఱఝ్‌ఱశీఅ విలువను అత్యంత తక్కువగా, కేవలం రూ.6 లక్షల కోట్లకు, పరిమితం చేసి 3.5శాతం వాటాల అమ్మకం ద్వారా కనీసం రూ.66028 కోట్ల నుండి రూ.75460 కోట్లు సమకూరవలసిన పరిస్థితు లలో, కేవలం రూ.20560 కోట్లు మాత్రమే సమకూరింది. ఇది ప్రజాసంపద పై జరిగిన తీవ్రమైన దాడి.
తాముగా ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా స్థాపించిన చరిత్ర లేని ప్రభుత్వానికి, దశాబ్దాల తరబడి దేశాభివృద్ధికి తార్కాణాలుగా నిలిచిన ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసే అధికారాన్ని ఎవరిచ్చారు? ప్రభుత్వరంగాన్ని నిర్వహించడం నా పని కాదు, అందరికీ విద్యా, వైద్యాలను అందించడం నా పని కాదు, రక్షణ రంగాన్ని, ఆర్థికరంగాన్ని నిర్వహించడం నాపని కాదు, సామాజిక బాధ్యత నిర్వర్తించడం నాపని కాదు, లౌకికవాదాన్ని పరిరక్షించడం నాపని కాదు అని చెపుతూ పబ్బం గడుపుతున్న ప్రభు త్వానికి అసలు అధికారంలో ఉండవలసిన పని ఉందా? నిజమైన 'ఆత్మనిర్భరత' అంటే ఏమిటో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆత్మ నిర్భరత అంటే మన కాళ్ళ మీద మనం నిలబడే సామర్థ్యం కలిగి ఉండడం. ఎవ్వరికీ తలొంచ కుండా స్వయం ప్రతిపత్తితో, ఆర్థిక స్వావలంబ నను కలిగి ఉండడం. అంతేగాని, వీటికి తర్పణా లొదిలి, ఆత్మను చంపుకొని, మన సంపదను అన్యాక్రాంతం చేస్తూ ప్రయివేటు పెట్టుబడులకు దాసోహం చేయడం కాదు.
- టివిఎన్ఎస్ రవీంద్రనాథ్,
సెల్:9493210827