Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊబిలోకి దిగుతూ కూడా తానున్నది నేల అని వాదించడాన్నే వితండవాదం అంటాం. డాలర్‌తో పోల్చి నప్పుడు రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్న ప్పటికీ... ''రూపాయి విలువ పడిపోవడం లేదు డాలర్ విలువ పెరుగుతుంది'' అంటూ ప్రమాద కరంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ రోగాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూపాయి పడిపోవడంతో అంత ర్జాతీయ అప్పు పదిశాతం దానంతట దే పెరిగింది. విద్యా వ్యాపారాల వ్యవహా రాల్లో నెలనెలా డాలరు రూపంలో పంపవలసిన మొత్తాలు పెరిగిపోయాయి. అమెరికా డాలర్ ద్వారా ఇండియాకు రావలసిన మొత్తాలు ఫెడరల్ రిజర్వు రేట్లు పెరగడంతో అక్కడే పెట్టుబడులుగా మారనున్నాయి. ఇంతటి ప్రమాదాలున్న రూపాయి విలువ హెచ్చు తగ్గుల విషయంలో కేంద్రం హాస్యాస్పదంగా వ్యవహరించడం గర్హనీయం. ద్రవ్యోల్బ ణాన్ని నాలుగు శాతం దగ్గరే కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిర్దేశించబడింది. మరో రెండు శాతం వరకు పెరిగినా తగ్గినా సమర్థించుకునే వెసులు బాటును ఆర్బీఐకి కేంద్రం కల్పించింది. కానీ గత 11 నెలలుగా ఈ ద్రవ్యోల్బణం ఏడు శాతం పైనే నమోదవు తున్నది. ఇలాంటి అదుపులేని ద్రవ్యోల్బ ణానికి గల కారణాలను రేపో మాపో ఆర్బీఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ రాత పూర్వకంగా సమర్పించ వలసి ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ ఇలా సమర్పించాల్సి రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అయితే ఆర్బీఐ కూడా స్వతంత్రతను కోల్పోయిందని, ప్రభుత్వ జోక్యం ఎక్కువైందంటూ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తరచూ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని తోసిపుచ్చలేం.
నిర్మల సీతారామన్ ప్రధాన వాదన ఏమంటే... ''రూపాయి మాత్రమే కాదు ఇతర దేశాల కరెన్సీలు కూడా పడిపోతున్నవి. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే వాటికన్నా రూపాయి మెరుగ్గా ఉన్నది'' అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి ఈ ఒక్క ఏడాది 9.72శాతం పడిపోయింది. సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ మెక్సికో ఇండోనేషియా వంటి అనేక దేశాల కరెన్సీలు రూపాయితో పోల్చినప్పుడు బలపడి ముందుకు సాగుతున్నాయి. తక్కువ జనాభా కలిగి, తక్కువ స్థూల జాతీయోత్పత్తి కలిగిన దేశాల కరెన్సీలు రూపాయితో పడిపోయినా పెరిగినా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ అంతర్జా తీయ కరెన్సీగా చలామణి అవుతున్న డాలర్‌తో అన్ని లావాదేవీలు జరుగు తున్నప్పుడు డాలర్‌తో పోల్చు కోవడమే సరి ప్రమాణమవు తుందిగా!
అమెరికా డాలర్ బలపడటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏ దేశాల కరెన్సీలకైనా డిమాండు ఎందుకు ఏర్పడుతుంది అంటే... మిగులు ధనం కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఆయా దేశాల్లోని కంపెనీలలో పెట్టుబడులు పెట్టినప్పుడు కరెన్సీలకు అంతర్జాతీయ పోలికలతో చూసి విలువ లెక్క కడతారు. ఇప్పుడు ఏర్పడిన ప్రపంచవ్యాప్త పరిణామాలలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితి వల్ల, దీని పర్యవసానంగా ప్రపంచ చమురు సరఫరా ఒడిదుడుకులవల్ల, పెట్టుబడిదారులంతా అమెరికా డాలర్ అత్యంత సురక్షితమని భావిస్తూ ఇతర మార్కెట్లనుండి అమెరికా మార్కెట్‌కు తమ పెట్టుబడులను తరలించడమే ప్రధాన కారణం. గ్లోబ లైజేషన్ విధానాన్ని కావలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో నెత్తిన ఎత్తుకున్న వారందరికీ ఇది తప్పదు. అయితే ఈ పరిణామాల వల్ల నష్టపోయేది అత్యంత కిందిస్థాయి జనమే. అమెరికా డాలరు అప్రకటితంగానే అంతర్జాతీయ కరెన్సీ అనే స్టేటస్‌ను కలిగి ఉండడం వల్ల ఇష్టం లేకున్నా డాలర్ మారకంగా అన్ని వ్యవహారాలు జరుగుతుండడం రెండవ కారణం. అమెరికాలో వృద్ధి మందగించి నప్పటికీ ఒడిదుడుకులు తక్కువగా చవిచూస్తూ ఆర్థిక వ్యవస్థ సాగుతున్నది. ఇది మూడవ కారణం. ఇక నాలుగవ కారణంగా చూసినప్పుడు అమెరికన్ ఫెడరల్ రిజర్వు (కేంద్ర బ్యాంకు) అక్కడి ద్రవ్యోల్బణాన్ని 3.71 దగ్గర చాలా కాలం నుంచి కట్టడి చేయగలిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుండటంతో మన దేశం డాలర్లకై వెంపర్లాడవలసి వస్తోంది. దీని వలననే ఈ ఒక్క ఏడాది 100 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వులు భారతదేశానికి తగ్గిపోయాయి. దిగుమతులు 61.8 బిలియన్ డాలర్లుగా ఉంటే ఎగుమతులు 35.1 బిలియన్ నమోదయినవి. అనగా లోటు 25 మిలియన్ డాలర్లు అన్నమాట. సాధార ణంగా రూపాయి విలువ పడిపోయి నప్పుడు ఎగుమతులకు డిమాండ్ పెరగాలి. కానీ సెప్టెంబర్ నెలలో 3.8శాతం ఎగుమతులు తగ్గిపోయాయి.
భారతదేశం అనుసరిస్తున్న సప్లై సైడ్ పాలసీ, అనగా ఉత్పత్తిదారులు, పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉండే పన్నుల విధానాల వల్ల క్షేత్ర స్థాయి ముడి సరుకు సరఫరా దారులైన రైతులు, సేకరణ దారులకు నష్టాలే కలుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రూపాయి విలువ పడిపోకుండా ఉండాలి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆహ్వానించాలి, తద్వార డాలర్లు వెల్లువలా వస్తాయి అని వాదించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లోకి ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్లలో ఆహ్వానించారు. అయినప్పటికీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగు తున్నది రూపాయి విలువ పడిపో తున్నది. ఈ ఒక్క ఏడాదిలోనే ఫారిన్ పోర్టోలియో ఇన్వెస్టర్లు 30 బిలియన్ డాలర్ల మేర అమెరికాకు తరలించారు. బారతదేశం దీర్ఘకాలికం గా అనుభ విస్తున్న ద్రవ్య పరపతి విధానంలో ఇండిపెంట్‌గా వ్యవహరించి ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేయాల్సింది. కానీ అలా కాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వు రెపోరేటును పెంచుతూ పోతే తదను గుణంగా భారత్ కూడా రేపో రేటును పెంచినప్పటికీ డాలర్లు అమెరికాకు తరలి పోతుండడాన్ని ఏ రకమైన అర్థశాస్త్రం అంటాం. ఇక రూపాయి విలువ గురించి మంత్రులను అధికారులను ప్రశ్నిస్తే విచిత్రమైన సమాధానాలు వస్తున్నాయి. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో పదేండ్ల కాలానికి 37శాతం రూపాయి విలువ పడిపోతే, మోడీ 8ఏండ్ల కాలంలో 32శాతమే పడిపోయింది! ఆ రకంగా మోడీయే గొప్ప... అని వింత వాదనకు దిగుతున్నారు. అదనంగా, 1947 నుండి కూడా ఎప్పుడూ రూపాయి విలువ డాలర్ కన్నా పెరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా పెరగాలని ఆశించడం తప్పు అంటూ మరో వాదన చేస్తున్నారు. అయితే సంస్థాగత మధుపుదార్లు కూడా ఎక్కువగా భారత మార్కెట్ నుండి తరలి పోవడంలో రాజకీయ కారణాలను కూడా కొట్టి పారే యలేం. ఎందుకంటే, అంబానీ, అదానీ, టాటా వంటి ప్రధాన కంపనీలకున్నంత ప్రోత్సాహం వేరే వ్యాపారాలకు లేకపోవడం వల్ల భారత స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నది. దిగుమతులను తగ్గించుకుని ఎగుమతు లను పెంచే స్థాయికి భారత్ చేరు కోనంతవరకు రూపాయి పతనమవు తూనే ఉంటుంది. అలా చేయాలంటే లేబర్ మార్కెట్‌ను ఉత్పాద శక్తులతో అనుసంధాన పరిచే సమగ్ర ప్రణాళిక అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా లయాలు లేకపోవ డంతో టాలెంట్‌తో పాటు ద్రవ్యమూ తరలిపో తున్నది. అంత ర్జాతీయ ప్రమాణాలతో కంపెనీలను, సంస్థలను దేశంలోని వివిధ ప్రదేశాల్లో నెలకొల్పే వినూత్న యత్నాలూ జరగటం లేదు. ఇలాంటి ప్రయత్నాలు పక్కనబెట్టి వ్యంగ్యాస్త్రాలతో రూపాయి పడిపోవటం లేదు, డాలరే అనవసరంగా పెరు గుందని వాధించడం అవాంఛనీయం.
- జి. తిరుపతయ్య
సెల్:9951300016