Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ గవర్నర్ కార్యాలయం ఇటీవల చేసిన ట్వీట్ అన్ని తప్పుడు కారణాలతో దేశ వ్యాప్తంగా దష్టిని ఆకర్షించింది. ''గవర్నర్ కార్యాలయం గౌరవాన్ని తగ్గించిన కొంతమంది మంత్రుల ప్రకటనలు చర్యలు తీసుకోదగినవని'' ఆ ట్వీట్ సారాంశం.
రాజకీయ, రాజ్యాంగపరమైన కోణాలు
గతంలో ఎనాడూ లేని విధంగా, ఆసక్తిని రేకెత్తించే ఈ గవర్నర్‌కు సంబంధించిన భావనలకు రాజకీయపరంగా, రాజ్యాంగపరమైన కోణాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకపు ప్రక్రియలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపిస్తూ, వారందర్నీ తొలగిస్తూ తీసుకున్న మరొక గవర్నర్ చర్య, ఛాన్సలర్‌గా తనకున్న చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించు కున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. మంత్రు లకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రత్యేకమైన అధికారం ఆయనకు లేదు. కేవలం రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఆయన వ్యవహరించగలడు.
నియమించబడిన గవర్నర్ విధి ఎప్పటికీ కూడా ఎన్ను కోబడిన ప్రభుత్వానికి లోబడి మాత్రమే ఉంటుంది తప్ప, దానికి విరుద్ధంగా ఉండదు. ఇది భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యం యొక్క పునాది సిద్ధాంతం. రాజ్యాంగపరమైన నిబంధనలను విడిగా ప్రత్యేకంగా చదవలేం. మంత్రి మండలి సభ్యులు గవర్నర్‌కు తోడ్పాటును అందిస్తూ, సలహాలు ఇవ్వాలని ఆర్టికల్ 163(1) చెపుతుంది. అయితే కొన్ని విషయాలలో గవర్నర్, రాజ్యాంగం అనుమతించిన మేరకు, దానికి లోబడి తన విచక్షణను బట్టి వ్యవహరించాలని ఆర్టికల్ 163(2) తెలియజేస్తుంది. అంటే దీనర్థం గవర్నర్, తన విచక్షణను ఉపయోగించడానికి చట్టబద్దమైన హక్కును కలిగి ఉన్నప్పుడు తప్ప, సాధారణంగా మంత్రి వర్గం నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. ఉదాహర ణకు, ఒక క్యాబినేట్ మంత్రిని విచారణ చేయ డానికి అనుమతి మంజూరు నిర్ణయంలో లేదా భారత రాష్ట్రపతి ఆజ్ఞలను అనుసరించి కేంద్ర పాలిత ప్రాంత పాలకుడిగా నిర్ణయాలు చేయడం లాంటి సందర్భాల్లో. కేరళ గవర్నర్ చేసిన ట్వీట్, రాసిన లేఖల సందర్భానికి సంబంధించిన నిబంధనలు కలిగి ఉన్న ఆర్టికల్ 164, ఆర్టికల్ 163 నుంచి విడదీయలేనిది. కాబట్టి, మంత్రి మండలి లేదా ముఖ్యమంత్రి ఒక మంత్రిని బర్తరఫ్ చేయాలనే సలహా ఇవ్వకుండా, గవర్నర్ తన ''ఇష్టాన్ని విరమించుకోవడం'' ద్వారా ఆ మంత్రిని బర్తరఫ్ చేయలేడు.
''ఇష్టానికి''(ప్లెజర్) సంబంధించిన ఆర్టికల్ 164(1)ను పరిచయం చేసే ఆర్టికల్ 163 యొక్క స్ఫూర్తిని గురించి న్యాయశాస్త్ర కోవిదుడైన హెచ్.ఎమ్.సీర్వారు ఒక వివరణ ఇచ్చారు. ''ఆర్టికల్ 163(1) కింద ఉండే అన్ని విషయాల్లో గవర్నర్ ఒకవేళ విచక్షణ కలిగి ఉంటే, కొన్ని నిర్దిష్టమైన విషయాల్లో ఆర్టికల్ 163(2) ద్వారా వారి విచక్షణతో వ్యవహరిం చేటువంటి అధికారాలను గవర్నర్లకు ఇవ్వడం అనవసరమని'' ఆయన అన్నారు. షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి (1974) సంబంధించిన కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆర్టికల్ 164 ప్రజాస్వామిక పఠనాన్ని గమనించ వచ్చు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నవంబర్ 4,1948 నాడు రాజ్యాంగ పరిషత్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన పరిచయ ప్రకటనను ఉదాహరించింది. అది ఈ విధంగా ఉంది: ''అమెరికా అధ్యక్షుడు, తన కార్యదర్శులలో ఏ కార్యదర్శి ఇచ్చిన ఏ సలహానైనా అంగీకరించడానికి కట్టుబడి ఉండడు. భారత రాష్ట్రపతి సాధారణంగా మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. మంత్రుల సలహాలకు విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు, వారి సలహా లేకుండా కూడా రాష్ట్రపతి ఏమీ చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ఏ సమయంలోనైనా ఏ కార్యదర్శినైనా తొలగించవచ్చు. మంత్రులకు పార్లమెంట్లో మెజారిటీ ఉన్నంత కాలం,భారత రాష్ట్రపతికి మంత్రులను తొలగించే అధికారం లేదు''.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంత కాలం కేంద్ర మంత్రులు వారి బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి, ఇవే నిబంధనలు గవర్నర్లకు కూడా వర్తిస్తాయి. మంత్రి మండలి సలహా లేకుండా రాజ్‌భవన్ సూచించినట్టుగా ''తన ఇష్టాన్ని విరమించుకోవడం''(విత్ డ్రాయల్ ఆఫ్ ప్లెజర్) అనేది తప్పుడు భావన.
నామమాత్రపు పెద్ద
ఆర్టికల్ 164(1) ని రాజ్యాంగపరమైన అర్థంలో అవగాహన చేసుకోవాలంటే నిబంధన యొక్క చారిత్రాత్మక మైన పఠనం అవసరం ఉంటుంది.1947లో రాజ్యాంగ పరమైన సలహాదారు తయారు చేసిన చిత్తుప్రతి రాజ్యాంగం ఆర్టికల్ 121ను కలిగి ఉంది. దాని ప్రకారం ''గవర్నర్ మంత్రులను ఎంపిక చేస్తారు, గవర్నరే వారిని రమ్మని ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఇష్టం ఉన్నంత కాలం వారు బాధ్యతలను నిర్వహిస్తారు''. అంతకు ముందు ఆర్టికల్ 144 లో భాగంగా ఉన్న ఈ ఆర్టికల్ 121పై రాజ్యాంగ పరిషత్‌లో చాలా సుదీర్ఘంగా చర్చించారు. గవర్నర్‌కు ఉన్న సాధారణ విచక్షణను తొలగించి, మంత్రివర్గానికి పాలించే అధికారాన్ని ఇచ్చారు. చిత్తుప్రతి రూపంలో ఉన్న ఆర్టికల్ 144కు సవరణను డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఫలితంగానే ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 164,165 రూపొందించబడ్డాయి.
సుభాష్ సీ కాష్యప్ అనే న్యాయ నిపుణుడు అంబేద్కర్ ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఇలా అన్నారు: ''మంత్రివర్గం విశ్వాసం కోల్పోయినప్పుడు, 'ఆ ఇష్టం' కొనసాగకూడదనేది, 'ఇష్టం ఉన్నంత కాలం' అనే పదాల అర్థం అనే అవగాహన ఎల్లప్పుడూ ఉండేది. మంత్రి వర్గం విశ్వాసం కోల్పోయిన మరుక్షణమే గవర్నర్ ఆ సమయంలో ఆ మంత్రివర్గాన్ని తొలగించడానికి 'తన ఇష్టాన్ని' ఉపయోగించాలి.'' అందువల్ల, గవర్నర్ రాష్ట్రానికి కేవలం ఒక నామమాత్రపు పెద్ద అనీ, ఒకవేళ మంత్రి వర్గానికి సభలో మెజారిటీ ఉంటే, ఆ మంత్రి వర్గానికి వ్యతిరేకంగా గవర్నర్ ఏమీ చేయలేడని ఆ ఆర్టికల్ సూచిస్తుంది. గవర్నర్ కార్యాలయం వలసవాద మూలాన్ని కలిగిఉంది.'భారత ప్రభుత్వ చట్టం,1858' గవర్నర్ జనరల్ పర్యవేక్షణ కింద గవర్నర్ పదవిని సష్టించింది. ఆ తరువాత కాలంలో తీసుకొని రాబడిన ''భారత ప్రభుత్వ చట్టం,1935'' ఏప్రిల్ 1,1937 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కూడా గవర్నర్లు ప్రొవిన్షియల్ (ప్రాంతీయ) ప్రభుత్వ సలహాపై ఆధారపడి మాత్రమే తమ విధులను నిర్వర్తించాలి. వలసవాద సంస్థను కొనసాగించడం ద్వారా సంభవించే ప్రమాదం, రాజ్యాంగ రూపకర్తలను ఆందోళన పరిచిన అంశం. గవర్నర్ అధికార దుర్విని యోగానికి వ్యతిరేకంగా ఏదైనా హామీ ఉందా అని హెచ్.వీ. కామత్ చర్చల సందర్భంగా ప్రశ్నించారు. మరొక ముఖ్య సభ్యుడైన పీ.ఎస్.దేశ్‌ముఖ్ తక్షణ ప్రతిస్పందన ఇలా ఉంది:
''హామీ అనేది, గవర్నర్ విజ్ఞత మరియు గవర్నర్ ను నియమించే అధికార యంత్రాంగం విజ్ఞత''. కానీ రాజ్యాంగం యొక్క కాల్పనిక వాదం (రొమాంటిసిజం), న్యాయపరమైన యదార్థవాదం (రియలిజం), వ్యవహారిక వాదం (ప్రాగ్మాటిజం) స్థాయికి మార్చాల్సి వచ్చింది. షంషేర్ సింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇదేపని చేసింది. జస్టిస్ వీ.ఆర్. కష్ణయ్యర్, ఆ తీర్పులో తనదైన శైలిలో రాజ్భవన్ల రాజ్యాంగేతర భ్రమల పై చక్కగా ఈ విధంగా ప్రతిస్పందించారు.
''రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ల అనంత శక్తికి సంబంధించి, స్పష్టమైన ఉద్దేశ్యాలతో వారి అధికారాలు, విధులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రూపంలో పేర్కొనబడ్డాయి. అయినప్పటికీ, అలాంటి వ్యవహారాన్ని ముఖ్యంగా మంత్రివర్గం శాసనసభకు, శాసనసభ ద్వారా ప్రజలకు జవాబుదారీతనంతో వదిలించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మన రాజకీయ నిర్మాణ ముఖ్య భావనలకు విరుద్ధంగా మన ప్రజాస్వామ్యాన్ని ఒక శిఖరాగ్ర వ్యక్తికి కట్టబెట్టడానికి బదులుగా విజయవంతంగా సమర్థించుకోవాల్సి ఉంటుంది...'' కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ ట్వీట్,లేఖపై విజయం సాధించాల్సి ఉంటుంది.
(వ్యాసకర్త సుప్రీంకోర్టు న్యాయవాది) (''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్ 9848412451
- కాళీశ్వరం రాజ్