Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత కొత్త, కొత్త సిద్ధాంతాలను బోధిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు విని చాలా మంది దాన్ని 'ఈటల జ్ఞాన సిద్ధాంతం' అని అంటున్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం పెడితే ఒక రకమైన జ్ఞాన సిద్ధాంతాన్ని, బయట మాట్లాడితే మరో రకమైన సిద్ధాంతాన్ని వల్లెవేస్తున్నారు. అందులో భాగంగా మేథోమధనం చేసి సీఎం కేసీఆర్కు ఒక ప్రశ్న సంధించారు. ఎంతో లోతైన ప్రశ్న వేస్తారని అందరూ భావించారు. ఆ ప్రశ్న విన్న తర్వాత తుస్సు మనిపించింది. అదేందంటే ఇతర పార్టీల్లో గెలిచిన వారికి సీఎం కేసీఆర్ మంత్రి పదవులెలా ఇస్తారని అడిగారు. ఈ ప్రశ్న టీఆర్ఎస్ను అడగడం కంటే బీజేపీ పెద్దలను అడిగితే మంచిదేమో అనిపించడం లేదూ...!ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న పని అదే కదా... ఇతర పార్టీల్లో గెలిచిన వారికి మంత్రిపదవులు ఇవ్వడం, సీఎం పదవులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చి చేర్చుకోవడంలో బీజేపీని మించిన వారెవరున్నారూ...!? అరుణాచల్ ప్రదేశ్లో ఒక సీటు కూడా గెలకుండానే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసిందో మంత్రి పదవులు ఇచ్చిందో చెప్పాలి. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మేఘాలయతో పాటు ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన వారికి పదవులు ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేసి కన్నంలో దొరికిన సంగతి తెలియనిద ఎవరికీ? అయినా ఈటల రాజేందర్ తానేదో నీతివంతబైన పార్టీలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఓటు పొందిన వారే పరిపాలించాలనే ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ పక్కన పెట్టిన సంగతి ఈటలకు కనిపించడం లేదా?
- గుడిగ రఘు