Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవాణా రంగం దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానిస్తూ దేశ ఏకీకరణకు తోడ్పడుతోంది. ఆహార, ఇతర వస్తు ఉత్పత్తులను ఉత్పత్తి ప్రదేశం నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ ఆర్థిక వ్యవస్థ మనుగడలో రవాణా రంగం తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. రోడ్, రైల్, వాయు (ఎయిర్ వేస్), జల (షిప్పింగ్) మార్గాల ద్వారా సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా చేస్తూ దేశానికి తన సేవల్ని అందిస్తుంది. ప్రపంచంలోనే రెండవ స్థానం పొందింది ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్. 85% ప్రయాణికుల రవాణా, 70% సరుకు రవాణా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. అంతేగాక రైల్వే మరియు ఇతర రవాణా విధానాలకు అనుసంధానంగా, అనుబంధంగా పనిచేస్తూ దేశంలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు మౌళిక సదుపాయాలు అందించేందుకు దోహదపడుతుంది. దేశ అవసరాలకు సరిపడే రోడ్స్ నిర్మాణం చేపట్టినపుడు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ప్రయాణీకుల, సరుకు రవాణా నిర్వహించే క్రమంలో డ్రైవర్స్, కండక్టర్స్గా, క్లీనర్స్‌గా, మెకానిక్‌లుగా, స్పేర్ పార్ట్ షాప్ఎంప్లాయిస్ గా, ఇతర వివిధ రకాల సేవల నందిస్తూ రవాణా కార్మికులుగా దేశంలో సుమారు 8 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. దేశ జిడిపిలో రవాణా రంగ వాటా 4.85%. ప్రభుత్వ విధానాల ఫలితంగా చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక అసంఘటితరంగ కార్మికులుగా మారుతున్నారు.ఈ క్రమంలో రవాణా రంగంలో కూడా కార్మికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరికి తగిన పనిభద్రత కల్పించడంలో, అవసరాలు తీర్చడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది.
ఈ విషయంలోనే కాదు, మొత్తంగా రోడ్ రవాణా వ్యవస్థను ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ముందుచూపుతో తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా అవసరాలకు అనుగుణంగా రోడ్ మెయిన్టెనెన్స్ అభివృద్ధి, విస్తరణ తగిన విధంగా జరగలేదు. దేశంలో అనేక రోడ్లు పూర్ క్వాలిటీ, మరియు టూ లైన్స్ కెపాసిటి మాత్రమే కలిగి ట్రాఫిక్ రద్దితో వుంటున్నాయి. ఈ పరిస్థితిలో ట్రాఫిక్ జామ్‌లు, రోడ్ యాక్సిడెంట్స్ పెరిగాయి. ఈ సమస్యల పరిష్కారం మరియు భవిష్యత్ అవసరాలు తీరేలా రవాణా వ్యవస్థని ఆధునీకరించేందుకు పాలసీల రూపకల్పనలకు తగిన సూచనల కోసం ప్రభుత్వం సుందర్ కమిటీ, రాకేష్ మోహన్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అనేక సూచనలతో పాటు, మోటర్ వెహికల్ యాక్ట్‌ను, ట్రాఫిక్లను సవరించాలని అవసరమైన ఫండింగ్‌కు యూజర్ ఛార్జర్స్ వసూలు చేయాలని, లాండ్ మెనిటైజేషన్ చేయాలని, రవాణా రంగంలో పి.పి.పి.ని ప్రవేశపెట్టాలని రికమండ్ చేశాయి.
ఈ కమిటీల రికమండేషన్స్‌తో సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వాహనాల చట్టం - 1988 ని సవరించి మోటార్ వాహనాల చట్టం - 2019ని తెచ్చింది. మోటార్ వాహన చట్టం - 1988 లోని 14 చాప్టర్స్ 217 సెక్షన్స్‌లో 92 సెక్షన్లను సవరించడమో, కొత్త సెక్షన్లను, సబ్ సెక్షన్లను యాడ్ చేయడమో, డిలిట్ చేయడమో చేశారు. రోడ్ వినియోగదారులపై రవాణా రంగ కార్మికులపై ఆర్థిక భారాల్ని విధించడం ట్రాఫిక్ జామ్స్ని, రోడ్ యాక్సిడెంట్స్‌ను నిరోధించే రోడ్ సేఫ్ కలిగించే పరిష్కార మార్గంగా భావించడం ఈ చట్టంలో కనబడుతున్న ప్రమాదకర ధోరణి. ఈ ఫెనాల్టీలను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న 10% పెంచుతామని సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో పేర్కొంది. ఈ పెనాల్టీల పెంపు పై ఎవరైనా ప్రశ్నిస్తే పెనాల్టీలు పడకుండా చూసుకుంటే సరిపోతుందిగా అని సింపుల్‌గా ఒక ప్రశ్న ఎదురౌతుంది. కాని క్షేత్ర స్థాయిలో ఆ రకమైన పరిస్థితులు లేకుండా, చట్టం గురించి అవగాహన కల్పించకుండా అది సాధ్యం కాదనే విషయం చెప్పడానికి ఎవరికైనా పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అమలుచేస్తున్న ''ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్'' (×ువీూ) ట్రాఫిక్ కంట్రోలు కంటే చలాన్స్ వేయడంలో మెరుగ్గా పనిచేస్తున్నాయన్నదొక విమర్శ. ఈ సిస్టమ్ అమలువుతున్న 13 రాష్ట్రాలలో ఒక సం||లోనే 3.5 కోట్ల చలాన్స్ నోటీసులు అందాయంటే ఈ విమర్శ నిజమేనేమో. ఈ పెనాల్టీలతో పాటు లైఫ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్, క్వార్టర్స్ ట్యాక్స్‌లను కూడా పెంచారు. లైఫ్ ట్యాక్స్ గతంలో 7 సీటర్ వెహికల్లో సీటుకు రూ.652/- తీసుకుంటే ప్రస్తుతం 771 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 20% నుండి 25% వరకు పెంచారు. గ్రీన్ ట్యాక్స్ పాత శ్లాబు పద్ధతిలో రూ 200/- నుండి రూ 300/- వరకు కడితే ప్రస్తుతం రూ 4500/5000 వసూలు చేస్తున్నారు. క్వార్టర్స్ ట్యాక్స్ 8 సీట్లు కెపాసిటీ వెహికల్‌కి 4500/- రూ. నుండి 5580/-రూ.లకు (రూ.1020/-)పెంచారు.
ఇటీవల ఈ ట్యాక్స్లతోపాటు ఫిట్నెస్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా భారీగా సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. త్రీవీలర్‌కు ఫిట్నెస్ ఫీజు రూ.600/- నుండి రూ.3,500/-లకు, ఎల్.ఎం.వి. కు రూ.3,000/- ల నుండి రూ.7,000/-లకు, మీడియం గూడ్స్ వెహికల్‌కు రూ.4,500/-ల నుండి రూ.10,000/- లకు, హెవీ వెహికల్స్‌కు రూ.6,000/- ల నుండి రూ.12,500/-లు భారీగా పెంచారు. పైగా ఫిట్నెస్ రెన్యువల్ లేట్ ఫీజు రోజుకు రూ.50/-లు పెనాల్టీ కూడా పెంచారు. (దీనిపై తెలంగాణలో ట్రేడ్ యూనియన్స్ ఐక్యంగా పోరాడి రూ.50/- పెనాల్టీ అమలు కాకుండా అడ్డుకున్నాయి) రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెనాల్టీలను, ట్యాక్స్‌లను, ఫీజులను, టెన్టైమ్ పెంచుకోవచ్చని కూడా చట్టంలో పేర్కొన్నారు. ఈ పెనాల్టీలు, ట్యాక్స్‌లు, ఫీజుల పెంపుదలే కాకుండా మరికొన్ని ప్రమాదకర విధానాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. అందులో
1. వాలంటరీ వెహికల్ - ప్లేట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ (వి.వి.ఎం.పి.). ఇది వెహికల్ స్క్రాపింగ్ పాలసీని రూపొందించింది. వెహికల్ ఫిట్నెస్ ఆధారంగా, కాలుష్య కారక వాహ నాలను, 15 సం||లు దాటినవి, మెయిన్టెనెన్స్ దెబ్బతిన్న వెహికిల్స్‌ను స్వచ్ఛంద స్క్రాపింగ్‌కు ప్రోత్సహించడం, వాటి స్థానంలో మోడ్రన్ టెక్నాలజీతో, కాలుష్య రహిత వాహన ఉత్పత్తికి దోహదపడేలా చేయడం లక్ష్యం. ఈ పేరుతో రానున్న కాలంలో ఫిట్నెస్ లేదని, వెహికల్ మెయిన్టెనెన్స్ సరిగా లేదని వెహికల్స్ స్క్రాపింగ్కై వత్తిడి పెరుగుతుంది. ఆగస్ట్ 13, 2021 న ఈ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించేందుకు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ Ê హైవేస్ (ఎం.ఓ.ఆర్.టి.హెచ్) ఇన్వెస్టర్స్‌ను ఆర్గనైజ్ చేసింది. 400 కు పైగా ఇన్వెస్టర్స్ ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. గౌరవ ప్రధాని గారిచే పాలసీ లాంచ్ చేయబడింది. ఈ పాలసీ ఇంప్లిమెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 23, 2021 న ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్స్ ప్రారంభించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రానున్న కాలంలో లక్షలాది వాహనాలు ఈ పాలసీ బారిన పడనున్నాయి.
2. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలకు ప్రోత్సాహం : కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెడుతూ రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇచ్చింది. ఇంధన ఖర్చు తగ్గించడం, కాలుష్య రహిత పర్యా వరణానికి దోహదపడటం పేరుతో ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్స హించడం వలన భవిష్యత్‌లో డీజిల్ వాహననదారులు ఇక్కట్లు పడే పరిస్థితి దాపురిస్తుంది.
3. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ పాలసీ కమిటీ (రాకేష్మోహన్ కమిటీ) సూచనలు : 2032 నాటికి 8.1శాతం జి.డి.పి. సాధించేలా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికై పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమని, లాండ్ మోనిటైజేషన్, యూజర్ చార్జెస్ వసూలు విధానం పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పెట్టుబడులు సాధించాలని, మోడ్రన్ టెక్నాలజీ యొక్క నిరంతర అప్‌గ్రేడేషన్ చేసేందుకు తగిన యంత్రాంగం ఏర్పరచాలని, హైలెవల్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ స్ట్రాటజీ (ఓటిఎస్) రూపొందించాలని, సమీకృత రవాణ వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ సమీకరించాలని, పి.పి.పి. ప్రాజెక్ట్స్‌ని రెగ్యులర్‌గా ఎక్స్పర్ట్స్ అధారిటీతో మానిటరింగ్ చేయించాలని సూచించారు. వీటి ఆధారంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో సంస్కరణలు మొదలయ్యాయి.
''ఎం.వి.యాక్ట్ 2019, పెనాల్టీలు మరియు విధానాలు అంగీకరించి ఆమోదించే అవకాశం, లేదా ఏదశలోనైనా కంట్రోల్‌చేసే, నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఇస్తున్నామని'' కేంద్ర రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి 'మోటారు వాహనాల చట్టం-2019' అమలుకు వ్యతిరేకంగాట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాలు చేస్తున్న క్రమంలో పేర్కొన్నారు. తెలంగాణలో ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని 2019 లో రాష్ట్ర అసెంబ్లీలో కె.సి.ఆర్ ప్రకటించారు. కాని ప్రస్తుతం ఇవన్నీ అమలుకి రావడం రవాణ కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వెహికల్ పార్కింగ్ ప్లేసుల కొరత, ఫైనాన్సియర్ల వేధింపులు, సంక్షేమబోర్డు ఏర్పడక పోవడం, సంక్షేమ పథకాలు లేకపోవడం, ఒత్తిడితో కూడిన వృత్తికారణంగా చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలతో సతమతమవడం వంటి సమస్యల వలయంలో రవాణా కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సంఘటిత ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది.
- కలవాల అజరుబాబు
8333818711