Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కులవ్యవస్థ ఆధారంగా, 'సామాజికంగా, విద్యా పరంగా' వెనుకబడిన కులాలకు రిజర్వేషన్‌ను సమర్థిస్తూనే అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన నిరుపేదలను, కార్మికులను సమైక్యం చేయడానికి సీపీఐ(ఎం) కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న దోపిడీతో కూడిన సామాజిక, ఆర్థిక వ్యవస్థతో పోరాడేందుకు ఇదొక మార్గం. విభేదాలను అధిగమించేందుకు, అన్ని కులాలకు చెందిన నిరుపేద వర్గాల ఐక్యత కోసం జనరల్ కేటగిరీలోనే నిరుపేద వర్గాలకు కొంత మొత్తంలో రిజర్వేషన్ కల్పించాలని సీపీఐ(ఎం) వాదించింది.
జనరల్ కేటగిరీ పరిధిలోనే ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఇడబ్ల్యుఎస్) రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకు వచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును ఇటీవల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3-2 ఓట్ల తేడాతో సమర్థిం చింది. 2019 జనవరిలో పార్లమెంట్లో తీసుకు వచ్చిన ఈ రాజ్యాంగ సవరణకు సీపీఐ(ఎం) మద్దతిచ్చింది.
జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యుఎస్‌కు గరిష్టంగా 10శాతం వరకు రిజర్వేషన్‌కు ఈ సవరణ వీలు కల్పించింది. అంటే, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోకి రానివారికి ఇది వర్తిస్తుంది. ఒబిసి రిజర్వేషన్ల కోసం 1990లో మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల అమలు సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన పేదలకు కూడా కొంత మొత్తంలో రిజర్వేషన్ ఉండాలన్న నిబంధనను సీపీఐ(ఎం) లేవనెత్తింది.
ఒబిసిలకు 27శాతం రిజర్వేషన్‌కు సీపీఐ(ఎం) పూర్తిగా మద్దతిస్తూనే, జనరల్ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు ఆర్థిక ప్రామాణికతపై కొంత కోటా ఉండాలని డిమాండ్ చేసింది. ఇటువంటి నిబంధన తీసుకురావడం వల్ల, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలతో చోటు చేసుకునే తీవ్రమైన అభిప్రాయ బేధాలు, చీలికలనేవి కొంతవరకు తగ్గుతాయని పార్టీ అభిప్రాయపడింది. వర్గ దృక్పథాన్ని కలిగిన పార్టీ, ఒబిసి కోటాలోనే ఆర్థిక ప్రామాణికాలు ఉండాలని కూడా భావిస్తోంది. తద్వారా ఈ వర్గాలకు చెందినవారిలో నిజంగా అర్హులైనవారు ఆ కోటాను ఉపయోగించుకుంటారని అభిప్రాయపడింది. అనంతర కాలంలో 'క్రీమీ లేయర్' రూపంలో సుప్రీంకోర్టు దీన్ని ఆమోదించింది.
శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కులవ్యవస్థ ఆధారంగా, 'సామాజికంగా, విద్యా పరంగా' వెనుకబడిన కులాలకు రిజర్వేషన్‌ను సమర్థిస్తూనే అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన నిరుపేదలను, కార్మికులను సమైక్యం చేయడానికి సీపీఐ(ఎం) కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న దోపిడీతో కూడిన సామాజిక, ఆర్థిక వ్యవస్థతో పోరాడేందుకు ఇదొక మార్గం. విభేదాలను అధిగమిం చేందుకు, అన్ని కులాలకు చెందిన నిరుపేద వర్గాల ఐక్యత కోసం జనరల్ కేటగిరీలోనే నిరుపేద వర్గాలకు కొంత మొత్తంలో రిజర్వేషన్ కల్పించాలని సీపీఐ(ఎం) వాదించింది. సహజంగానే ఒబిసిల, ఎస్సీ, ఎస్టీల ప్రస్తుత కోటా శాతాన్ని ఇది దెబ్బతీయలేదు. ప్రస్తుతం ఉన్న రిజర్వ్డ్ కోటాలను ఉపయోగించుకోలేని అన్ని మతపరమైన గ్రూపులు, కమ్యూనిటీలను కలుపుకుని ఉండే జనరల్ కేటగిరీ నుండే ఈడబ్ల్యుఎస్ కోటా రూపొందింది.
అయితే, ఈడబ్ల్యుఎస్ కిందకు ఎవరు వస్తారనేది నిర్వచించేందుకు మోడీ ప్రభుత్వం... ఆఫీసు మెమోరాండం ద్వారా నిర్దేశించిన ప్రమాణాలను పార్టీ విమర్శించింది. విద్య, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వ కోటాకు ఈడబ్ల్యుఎస్ వర్తించాలంటే సదరు కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయ భూమి 5 ఎకరాలకు మించి ఉండరాదు. లేదా నోటిఫైడ్ మున్సిపాలిటీలో వెయ్యి చదరపు అడుగుల నివాస ప్రాంతం లేదా వంద చదరపు గజాల స్థలం ఉండరాదు. అంటే దీనర్థం నిరుపేదలు కానివారు ఈడబ్ల్యుఎస్ కోటాను ఉపయోగించుకోలేరు. ఆదాయ పన్ను మినహాయింపునకు పరిమితి ఏడాదికి రూ.2.5 లక్షలుగా ఉంది. అది దాటితే ఎవరైనా ఆదాయపన్ను చెల్లించాల్సిందే. అలాగే ఐదెకరాల స్వంత వ్యవసాయ భూమి ఉంటే వారు పేదలు కాదు.
ఆ రకంగా, ఈ పరిమితి హద్దులు చాలా ఎక్కువగా, విస్తృతంగా ఉంచడం వల్ల ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ప్రయోజనం నెరవేరదు. ఈ ఆఫీసు మెమోరాండాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలవడంతో సుప్రీం కోర్టు ఇంకా ఈ విషయంపై పరిశీలన జరపాల్సి ఉంది.
రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, చదువు కోసం ఈడబ్ల్యుఎస్ కోటా వర్తింపును రాష్ట్రాలకు విడిచిపెట్ట బడింది. ఈడబ్ల్యుఎస్ ప్రామాణికాలు, ఎంతవరకు కోటా ఇవ్వవచ్చనే అంశాన్ని నిర్ణయించేందుకు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.4 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగినవారు, రెండున్నర ఎకరాలను మించి వ్యవసాయ భూమిలేని కుటుంబాలు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌కు అర్హులని జస్టిస్ శశిధరన్ నాయర్ కమిషన్ సిఫార్సు చేసింది.
2020లో కేరళ మంత్రివర్గం ఈ సిఫార్సులను ఆమోదించింది. ప్రస్తుతం కేరళలో విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ అమలవుతోంది. జనరల్ కోటాలోని నిరుపేద వర్గాలను ఉద్దేశిస్తూ ఈడబ్ల్యుఎస్ను నిర్వచిం చేందుకు ప్రామాణికాలను ఆమోదించారు. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ కోటా ప్రయోజనాలు అందాలనుకుంటే... ఈడబ్ల్యుఎస్ను నిర్వచించే ప్రమాణా లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలి.
(-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)