Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యా!
మన హైదరాబాద్ సిటిలో బస్ స్టాండ్లు అన్నీ బాగా నిర్మించినారు. ప్రయాణీకులకు సౌలభ్యంగా కూర్చోవటానికి కూడా సౌకర్యంగా ఉన్నది. కానీ ప్రతి బస్‌స్టాండ్ దగ్గర అక్కడ ఏ ఏ నంబర్ బస్సులు ఆగుతాయో కూడా ఒక బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేనిచో ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఉదా: బాగ్ లింగంపల్లి నుండి కూకట్పల్లి రావాలి అంటే ఫలానా బస్ స్టాండ్ దగ్గర 113 కూకట్ పల్లి వెళ్లే బస్సు వస్తుందని తెలిసినవారు అక్కడ మనలను దింపివెళతారు. వరుసగా 113ఎం మెహిదీపట్నం వెళ్లే బస్సులే 4, 5 వచ్చాయి. అప్పుడు కూకట్పల్లి బస్సులు ఇక్కడికి వస్తాయో లేదో అనే సందేహం వచ్చి తోటి ప్రయాణికులను అడిగితే ఒకరిద్దరు తెలియదు అని, ఇంకొకరు ఇక్కడకు కూకట్ పల్లి బస్సులు రావు మీరు వేరే దగ్గరకు వెళ్ళాళి అని చెబితే అక్కడికి వెళ్ళి అడిగిన వారు, అందులో 60ఏండ్లుపై బడిన వారు కంగారు పడి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కూకట్ పల్లి బస్సులు రాక మరల ముందు ఆగిన దగ్గరకే వచ్చి నిలబడి చాలా సేపు వేచివుండి చివరికి లింగంపల్లి బస్సు వస్తే అది ఎక్కి ప్రయాణం చేయటం జరిగింది. ఈ మధ్య గ్యాప్‌లో ఆందోళన చెంది మన సిటీలో రాత్రి 7గంటల సమయంలో హెవీ ట్రాఫిక్‌లో అటు ఇటు తిరిగి ఆందోళన చెందిన ప్రయాణీకురాలుగా నా ఇబ్బందిని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కావున దయచేసి బస్ స్టాండ్‌లో అక్కడ ఏ ఏ నంబర్ బస్సులు వచ్చి ఆగుతాయో తెలియ చేసే బోర్డులు అన్ని బస్టాండ్లలో ఏర్పాటు చేస్తే ఇంబ్బంది లేకుండా ప్రయాణికులు ప్రయాణం చేయగలరు. వీలైనంత తొందరలో అన్ని బస్సు స్టాండ్లలో బోర్డులు ఏర్పాటు చేయగలరు.
- పసుపులేటి రమాదేవి. 9951483440