Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఇప్పుడు కేసుల లొల్లి నడుస్తోంది. ఒకవైపు క్యాసినో వ్యవహారం, మరోవైపు ఎమ్మెల్యేల బేరసారాల దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు గులాబీ పార్టీ నేతలను, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వీలుగా కమలం పార్టీ లిక్కర్ కుంభకోణమంటూ చేస్తున్న తంతు ఊపందుకుంది. ఈ క్రమంలో సై అంటే సై అంటూ రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. వారి ప్రతి సవాళ్లతో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్న బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్పై విరుచుకుపడుతుందగా, కారు పార్టీపై ఈగ కూడా వాలనీయబోమంటూ గులాబీ దళం కదనరంగానికి కాలు దువ్వుతున్నది. ఈ రకంగా తెలంగాణలో లిక్కర్ (టీఆర్ఎస్) వర్సెస్ నిక్కర్ (బీజేపీ, ఆరెస్సెస్) అనే రీతిలో రాజకీయం రంజుగా మారింది. ఇదే విషయం తాజాగా చర్చకొచ్చినప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, అక్కడి అధికార పార్టీ నేతలను ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో ఇబ్బంది పెడుతున్న కేంద్రం... వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడలేకపోతోందంటూ ఓ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే సైద్ధాంతికంగా బీజేపీకి ప్రథమ శత్రువు కమ్యూనిస్టులే. అయినా ఆయా పార్టీల జోలికి 'కమలం' వెళ్లలేపోతున్నదంటే దానికి కారణం 'లెఫ్ట్' నిజాయితీ, పాదర్శకత, అవినీతి రహిత పాలనే కారణమంటూ ఆ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. దటీజ్ రెడ్.
-బి.వి.యన్.పద్మరాజు