Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్వతాల పరిరక్షణ అత్యంత ప్రధాన అంశమని భావించిన ఐక్యరాజ్యసమితి 2002 ఏడాదిని 'అంతర్జాతీయ పర్వత సంవత్సరం'గా ప్రకటించడంతో పాటు, ఐరాస సర్వసభ్య సమావేశ తీర్మానం ప్రకారం 2003 నుండి ప్రతి ఏట డిసెంబర్ 11న 'అంతర్జాతీయ పర్వత దినం (ఇంటర్నేషనల్ మౌంట్న్ డే)' పాటించుట ఆనవాయితీగా మారింది. 'వూమెన్ మూవ్ మౌంటేయిన్స్' అనబడే నినాదంతో నిర్వహిస్తున్న ప్రపంచ పర్వత దినం-2022 వేదికగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు, మానవాళి హితానికి పర్వతాల చేస్తున్న మేలును అవగాహన చేయడం జరుగుతుంది. జీవనోపాధి, జీవవైవిధ్య పరిరక్షణ, సహజ ప్రకృతి అందాల వడ్డింపు, విలువైన ఉత్పత్తుల నెలవు, స్థానిక కళల ప్రోత్సాహం, గిరిజనుల ఉనికి లాంటి అంశాల్లో పర్వతాలు ప్రధాన భూమిక నిర్వహిస్తున్నాయి. ప్రపంచ పర్యాటకంలో 15-20శాతం గ్లోబల్ టూరిజంను పర్వతాలు ఆకర్షిస్తున్నాయి. మానవాళి సంక్షేమం, పర్యావరణ హరిత పరిరక్షణ, ఆదాయ వనరుల వినియోగానికి పర్వతాలు ఉపకరిస్తాయనే సంపూర్ణ అవగాహన కలిగించడం అవసరంగా భావించి పర్వత దినం నిర్వహిస్తున్నారు. ప్రపంచ జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు, జీవ వైవిధ్య ఆరోగ్యకర మనుగడ, దాదాపు 80శాతం ముఖ్య ఆహార ఉత్పత్తుల (మ్నెక్క జొన్న, పొటాటో, బార్లీ, టమాట, ఆపిల్, సొర్గమ్ లాంటివి) కేంద్రాలు, శుద్ధ జలం ఊటలుగా అనేక ఉపయోగాలను పర్వాతాలు మానవాళికి కల్పిస్తున్నాయని తెలుసుకోవాలి.
(నేడు ''అంతర్జాతీయ పర్వత దినం'')
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037