Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ సాధారణంగా అనుకునే ముచ్చట ఏమిటీ అంటే యుద్ధం ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌కు మధ్య అని. కానీ, అసలు యుద్ధం జరిగేది రష్యా, అమెరికా పెత్తనం చేసే నాటో దేశాలకు మధ్య అని చాలా తక్కువ మందికి తెలుసు. చిన్న దేశమైన ఉక్రెయిన్‌తో రష్యా సంవత్సరం మొత్తం యుద్ధం చేయడం ఏంటా? అని వ్యంగ్యోక్తులు విసురుతున్న వారు సైతం లేకపోలేదు. అమెరికా జీడీపీలో దాదాపు 40శాతం ఆదాయం ఆయుధాల వ్యాపారం మీదే నడుస్తున్నది. ఆయుధాలు అమ్మకుండా బతికే పరిస్థితి ఆ దేశానికి లేదనేది అందరికి తెలిసిన సంగతేనాయే. ఆసంస్కృతే ఆదేశంలోనూ ఒపెన్ ఫైరింగ్ ఘటనలకూ కారణం. విచ్చలవిడిగా ఆయుధాలు కూరగాయల్లా అమ్మే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అమెరికా స్కూళ్లో చిన్న పిల్లలు, ఉపాధ్యాయులపై గత రెండు, మూడేండ్లుగా మూకుమ్మడి కాల్పులు జరిపిన సంఘటనలు కొకొల్లలు. కాకపోతే, దొంగచాటు వ్యాపారాలు చేయడం, ప్రపంచ దేశాలను ఏమార్చడం అమెరికాకు వెన్నతోపెట్టిన విద్యేనాయే. ఇప్పుడు అదే ఆయుధాలను యుద్ధం పేర ఉక్రెయిన్‌కు అమ్ముకుంటున్నది అమెరికా. గతంలో గల్ఫ్‌పై పెత్తనం చేసింది కూడా ఎందుకో తెలుసా ? చమురు కోసమే సుమా !!
- బి.బసవపున్నయ్య