Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజు మన దేశంలో మత విశ్వాసాల ప్రాతిపదికన జరుగుతున్న వ్యాపారం లక్షల కోట్లలో ఉంది. ఇదంతా
ప్రజాధనమే. ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలు ఉంటున్నందువలన ఎక్కడ తేడా వచ్చినా భక్తులు, ప్రజా
ప్రతినిధులు అడగడానికి, జోక్యం చేసుకోడానికి వీలు ఉంది. బీజేపీ చెపుతున్న విధంగా గనుక చట్టాలను మార్చితే
అంత అపారమైన ధనం, రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులు అన్నీ కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే అవుతుంది.
ప్రస్తుత నయా ఉదారవాద సమాజంలో ప్రతీదీ
సరుకుగా దిగజారిపోయింది. ప్రజల విశ్వాసాలూ
సరుకుగా మారిపోతున్నాయి. గాడ్ మార్కెట్ అన్న
పుస్తకంలో రచయిత్రి మీరా నందా అన్ని మతాల
ప్రజల్లోనూ పెరిగిన మతపరమైన కార్యక్రమాల జోరు
గురించి, ఆ ప్రజల విశ్వాసాలే లక్షల కోట్ల
వ్యాపారంగా ఏవిధంగా మారిపోతున్నాయన్న
వివరం గురించి లోతుగా పేర్కొన్నారు. ఇప్పుడు మన
దేశంలో ఆ వ్యాపారం ఎంత విస్తరిస్తున్నా, దానికి
కేంద్రాలుగా ఉన్న దేవాలయాల మీదనైనా ప్రభుత్వం
అదుపు కలిగి ఉంది. దానిని కూడా లేకుండా చేసేస్తే
అప్పుడిక ఆ లక్షల కోట్లను తమకు నచ్చినట్లు
వాడుకోవచ్చు. ఎవరికీ జవాబు చెప్పనవసరం
ఉండదు. ఇదే బీజేపీ వ్యూహం.
ఈమధ్య కాలంలో బీజేపీ ఒక వివాదాన్ని రాజేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పెత్తనం నుండి హిందూ దేవాలయాలకు ''విముక్తి'' కల్పించాలన్నది వాళ్ళ డిమాండ్. స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇందుకోసం తమ ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకురానున్నదంటూ ఓ ప్రకటన కూడా చేశారు. ఇక బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడి ఆరెస్సెస్ విభాగాలు ఈ విషయం మీద కోర్టుల్లో వివాదాలు లేపుతున్నాయి. తమిళనాడులో 1959లో చేసిన 'తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్స్ యాక్ట్‌ను రద్దు చేయాలంటూ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు.
ఆరెస్సెస్, బీజేపీ వాదనలు
హిందూ దేవాలయాలను నిర్వహించుకోడానికి ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేస్తామని 2021లో బీజేపీ హామీ ఇచ్చింది. ఆ బోర్డులో హిందూ పండితులు, సాధువులు సభ్యులుగా ఉంటారని సూచించింది. ఇంతవరకూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను ప్రయివేటు గ్రూపులకు ఏవిధంగా అప్పజెప్తారన్న ప్రశ్నకు వారినుండి వివరణ లేదు. అసలు పూర్తి వైవిధ్యంతో ఉన్న, భిన్న స్రవంతుల విశ్వాసాలతో ఉన్న హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించగలిగేది ఎవరన్నది పెద్ద వివాదంగా మారడానికి మాత్రమే బీజేపీ ప్రతిపాదన తోడ్పడుతుంది. ఆ మధ్య తిరుమలలో వెయ్యి కాళ్ళ మంటపాన్ని కూలగొట్టారు. ఆ విధంగా కూలగొట్టడాన్ని ఆగమశాస్త్రం బలపరు స్తున్నదంటూ ఒక వైష్ణవ సాంప్రదాయానికి ప్రతినిధిగా చెప్పుకునే ఒక జియ్యరు స్వామిగారు ప్రకటిస్తే, అలా కూలగొట్టడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధం అంటూ మరో జియ్యరుస్వామి ప్రకటించారు. వైష్ణవం, శైవం, శాక్తేయం, ఇలా రకరకాల మతాలు హిందూమతంగా పరిగణించబడుతున్నాయి. కొంతమంది పండితులో, సాధువులో దేవాలయాల మీద పెత్తనాన్ని తీసుకోవడం అంటే ఆ పండితులకు, సాధువులకు తక్కిన భక్తులకు లేని అధికారాలు ఎవరిచ్చారు? ఎక్కడ నిర్ణయిస్తారు?
ఈ రోజు మన దేశంలో మత విశ్వాసాల ప్రాతిపదికన జరుగుతున్న వ్యాపారం లక్షల కోట్లలో ఉంది. ఇదంతా ప్రజాధనమే. ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలు ఉంటున్నందువలన ఎక్కడ తేడా వచ్చినా భక్తులు, ప్రజా ప్రతినిధులు అడగడానికి, జోక్యం చేసుకోడానికి వీలు ఉంది. బీజేపీ చెపుతున్న విధంగా గనుక చట్టాలను మార్చితే అంత అపారమైన ధనం, రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులు అన్నీ కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే అవుతుంది.
రాజ్యాంగం ఏం చెప్తోంది?
మన రాజ్యాంగం 25వ అధికరణలో పౌరులు తమకు నచ్చిన మతాన్ని ప్రబోధించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోడానికి పూర్తి హక్కు కలిగివున్నారని ఉంది. దానినే మనం మతస్వేచ్ఛ అంటాం. ఆ హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. అయితే అదే అధికరణ లోని ఒక ఉప అధికరణ 25(2)లో మతానికి సంబంధించిన లౌకిక పార్శ్వం (సెక్యులర్ యాస్పెక్ట్ ఆఫ్ రెలిజియన్) విషయంలో చట్టాలు రూపొందించే పరిమితమైన హక్కు ప్రభుత్వానికి ఉందని కూడా రాజ్యాంగం పేర్కొంది. అంటే మతానికి సంబంధించిన విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచారాలు వంటివి ఒక పార్శ్వం అయితే ఆ మతానికి సంబంధించిన దేవాలయాల నిర్వహణ, వాటి ఆస్తులు, ఆదాయాలు, ఉద్యోగుల జీతాలు, వారి సంక్షేమం, భక్తుల నుండి వసూలు చేసే రకరకాల రుసుములు, ప్రచురణలు, అమ్మకాలు, భక్తులు విరాళాలుగా ఇచ్చే స్థిర, చరాస్తుల సక్రమ నిర్వహణ-ఇటువంటివన్నీ లౌకిక పార్శ్వం కిందకు వస్తాయి. ''ఈ లౌకిక విషయాలన్నింటికీ అతీతం మా విశ్వాసం'' అని సంఘపరివారం రెచ్చగొట్టవచ్చు కాని వాళ్ళ కన్ను పడింది మాత్రం ఈ లౌకిక పార్శ్వం మీదనే. మన సామాజిక వ్యవస్థ చాలా అసమానతలతో, వివక్షతలతో నిండి వుంది. సమాజం వదిలించుకోవలసిన దురాచారాలెన్నో ఉన్నాయి. కుల వివక్షత, లింగవివక్షత నేటికీ కొనసాగుతున్నాయి. వాటిని మతం పేరుతో, ధర్మశాస్త్రాల పేరుతో సమర్థిస్తున్నారు. విశ్వాసం పేరుతో నేడు ''అంటరానితనాన్ని సమర్థిస్తాం, పాటిస్తాం, అది మా హక్కు, మా విశ్వాసం'' అని ఎవరైనా అనగలరా? బాల్య వివాహాలను, సతి దురాచారాన్ని, వరకట్నాన్ని, జోగినీ వ్యవస్థను విశ్వాసం పేరుతో సమర్థించగలరా? పలు సందర్భాలలో దేవాలయాల్లో సాగిన అవినీతి బాగోతాలు బైటపడ్డాయి. దేవుడి మాన్యాలను అక్రమంగా వ్యక్తులు అనుభవిస్తున్న ఉదంతాలకు లెక్క లేదు. అటువంటప్పుడు ''ఇదంతా మత స్వేచ్ఛతో ముడిపడి ఉంది. కనుక ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు'' అని చెప్పి చేతులు ముడుచుకుని కూచోవచ్చా?
సుప్రీంకోర్టు వైఖరి ఏమిటి?
గడిచిన కాలంలో తన ముందుకు వచ్చిన అనేక వివాదాలపై తీర్పులనిచ్చే క్రమంలో సుప్రీంకోర్టు ఒక నికరమైన వైఖరినే తీసుకుంటూ వచ్చింది. రాజ్యాంగం మతపరమైన విశ్వాసాలను కలిగివుండే హక్కును కాపాడుతుంది. దానర్థం మతానికి సంబంధించిన లౌకిక, ఆర్థిక, రాజకీయ అంశాల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని ఏమాత్రమూ కాదు. ఆ అంశాలపై చట్టాలను రూపొందించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇదే సుప్రీంకోర్టు వైఖరి. ఆ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం 1959లో చేసిన చట్టం చెల్లుతుందని, ఆ విధమైన చట్టాలను చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తీర్పు 1959 లోనే ఇచ్చింది.
ప్రభుత్వం జోక్యం ఉండితీరాలి - కమిషన్ నివేదిక
1960లో కేంద్ర ప్రభుత్వం డా. సి.పి.రామస్వామి అయ్యర్ నేతృత్వంలో ''హిందూ రెలిజియస్ ఎండోమెంట్స్ కమిషన్'' ను ఏర్పాటు చేసింది. హిందూ మత ధార్మిక సంస్థల పరిస్థితులను అధ్యయనం చేయడం ఆ కమిషన్ పని. అధ్యయనం చేసిన తర్వాత రామస్వామి కమిషన్ చాలా స్పష్టంగా ''దేవాలయాల, ధార్మిక సంస్థల నిర్వహణలో అవకతవకలు, అవినీతి జరగకుండా ఉండాలంటే అందుకు ప్రభుత్వం కంట్రోలు వాటిపై ఉండడం తప్పనిసరి'' అని నివేదికలో పేర్కొంది. కొన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే అక్కడి దేవాలయాల్లో పలు అక్రమాలు జరిగాయని దృష్టాంతాలతో నివేదికను సమర్పించింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం జరిగిన తర్వాతనే పలు దేవాలయాల అభివృద్ధి జరిగింది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక పెద్ద ఉదాహరణ. దేవాలయం నిర్వహణతోబాటు పలు సేవా, విద్యా, వైద్య, సహాయ కార్యక్రమాలు టీటీడీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఇటువంటి దేవాలయాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటికి ప్రతీరోజూ కోట్లలో ఆదాయం వస్తోంది. హుండీలో పడే ప్రతీ పైసాకూ లెక్క ఉండే విధానం అమలులో ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ వల్లనే ఇది జరుగుతోంది. అదే జవాబుదారీతనంలేని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో దేవాలయాల నిర్వహణ పడితే పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలలో దేవాలయాల్లో అర్చకుల నియామకం, శిక్షణ విషయంలో దళిత, బి.సి కులాల వారికి అవకాశాలు కల్పించడం, స్త్రీలను అర్చకులుగా నియమించడం వంటి సంస్కరణలు వచ్చాయి. ఛాందసవాదులు, సాధువులు దేవాలయాలపై పెత్తనం మొదలుపెడితే ఇటువంటివి జరుగుతాయా? అపారమైన ప్రజాసంపద దేవాలయాల వద్ద పోగుబడి ఉంది. దానిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేదా?
ప్రస్తుత నయా ఉదారవాద సమాజంలో ప్రతీదీ సరుకుగా దిగజారిపోయింది. ప్రజల విశ్వాసాలూ సరుకుగా మారిపోతున్నాయి. గాడ్ మార్కెట్ అన్న పుస్తకంలో రచయిత్రి మీరా నందా అన్ని మతాల ప్రజల్లోనూ పెరిగిన మతపరమైన కార్యక్రమాల జోరు గురించి, ఆ ప్రజల విశ్వాసాలే లక్షల కోట్ల వ్యాపారంగా ఏవిధంగా మారిపోతున్నాయన్న వివరం గురించి లోతుగా పేర్కొన్నారు. ఇప్పుడు మన దేశంలో ఆ వ్యాపారం ఎంత విస్తరిస్తున్నా, దానికి కేంద్రాలుగా ఉన్న దేవాలయాల మీదనైనా ప్రభుత్వం అదుపు కలిగి ఉంది. దానిని కూడా లేకుండా చేసేస్తే అప్పుడిక ఆ లక్షల కోట్లను తమకు నచ్చినట్లు వాడుకోవచ్చు. ఎవరికీ జవాబు చెప్పనవసరం ఉండదు. ఇదే బీజేపీ వ్యూహం. కాసుల మీద ప్రేమకు మత విశ్వాసం అన్న ముసుగు వేసి ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలన్నదే వారి వ్యూహం.
మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనం ఉండేలా దేవాలయాల లౌకిక వ్యవహారాలను ప్రభుత్వం నిర్వహించడమే సరైన మార్గం. అయినా, మోక్షసాధనే జీవిత లక్ష్యంగా ప్రకటించుకుని, ఉపనిషత్తుల్లోని పరమాత్మ సారాన్ని వెతికి పట్టుకుని, సర్వం త్యజించి విరాగులైనవారికి, అంతా మిధ్య అని ప్రబోధించేవారికి, దేవాలయాల నిర్వహణ బాధ్యత అప్పజెప్తే పాపం, వాళ్ళంతా శ్లేష్మంలో పడ్డ ఈగల్లా అయిపోరూ! యోగులకు, సర్వసంగ పరి త్యాగులకు ఇంతటి శిక్షలు వేయడం బిజెపికి తగునా?
ఎం.వి.ఎస్. శర్మ