Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందులో నిజమెంతో తెలియదు! ఆ సమాచారం మాత్రం అదే పనిగా వాట్సప్ గ్రూపుల్లోకి పంపించడం, దాంతో జనాల్లో ఏదో జరుగుతుందనే ఆందోళన. ప్రపంచంలో ఏదో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని హడావుడి. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి దాంట్లో కొత్త, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని వేరియంట్లు ప్రమాదకరంగా మారగా, మరికొన్ని నామమాత్రంగా మిగిలిపోయాయి. కరోనా కన్నా భయాందోళనతో ఎక్కువగా ప్రజలు మరణాల పాలు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, దేశంలో, రాష్ట్రంలో అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పదే పదే ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అక్కడ అలా ఉందట... ఇక్కడ ఇలా ఉందట.. అంటూ భయపెట్టే మెసేజ్లు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు కేవలం ముగ్గురికి మాత్రమే కోవిడ్-19 ప్రబలినిట్లు నిర్థారణయింది. మరో వైపు కొత్త వేరియంట్లు వస్తే గుర్తించేందుకు వీలుగా కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19కు సంబంధించిన సమాచారంతో ఆందోళన చెందాల్సిన పని లేదనీ, జాగ్రత్తలు పాటిస్తే సరి అని అధికారుల చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయ్యే అవాస్తవ సమాచారాన్ని పక్కన పెడితే ఆరోగ్యంగా ఉండొచ్చు...
-కె.ప్రియకుమార్