Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి పండుగ సంబురాలు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులపాటు చేసుకుంటారు. ఇప్పటికే పాఠశాలలకు, కళాశాలలకు సెలవులొచ్చాయి. కానీ మరో పండుగ సంబురాలు కూడా వచ్చాయి. కొత్త సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. పెద్ద హీరోల సినిమాలు హోరెత్తించనున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద హీరోల డబ్బింగ్ చిత్రాలు విడుదల కానున్నాయి. చిన్న హీరోలు, చిన్న సినిమాలు కూడా రాబోతున్నామయి. పెద్ద హీరోలైన చిరంజీవి, బాలయ్య చిత్రాలు సంక్రాంతికి విడుదల కానుండడంతో అభిమానులకు సంక్రాంతి పండుగతోపాటు సినిమా సందడి మొదలైంది. తమ సినిమా విడుదలవుతుందంటే చాలు హీరో, హీరోయిన్లకు టెన్షన్‌కు మొదలైంది. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు భారీ ఎత్తున చేస్తున్నారు. అందుకు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీరసింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఛాపర్నే ఉపయోగించారంటే, వారు ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో చెప్పవచ్చు. ఎన్నడూ లేనిది మోగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లు గ్రాండ్‌గానే చేశారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సభలు పెట్టినట్టుగానే... పోటీలు పడి హీరోలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. అసలే పెద్ద హీరోలు, థియేటర్ యాజమానాలు ముందుగా వారికే ఇవ్వాలి. అయినప్పటికీ పెద్ద హీరోలు కూడా టెన్షన్ పడుతున్నట్టు కనపడుతున్నది. పెద్ద హీరోల దాటికి చిన్న సినిమాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఆ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయో లేదో అనే ఆందోళన వెంటాడుతున్నది. ప్రేక్షకులు అదరణ ఎలా ఉంటుందో, అభిమానులు సంతృప్తి చెందుతారో లేదో, కలెక్షన్లు ఎలా ఉంటాయోననే ఆందోళన వెంటాడుతున్నది. అయితే సంక్రాంతి సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి.
- గుడిగ రఘు