Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..' అనే తరహాలో ఉంది ప్రధాని మోడీ తీరు. ఇటీవల ఆయన మాతృమూర్తి హిరాబెన్ మరణించిన సంగతి తెలిసిందే కదా! అందరూ నివాళ్లు అర్పించాల్సిన విషయం కూడానాయే. ప్రధాని కాబట్టి అంత్యక్రియలు ఘనంగానే చేశారు. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండక్కర్లేదు. చనిపోయిన వ్యక్తిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేయడం సర్వసాధారణమే. అయితే ఆ భాగ్యం మోడీ భార్య యవోధాబెన్కు దక్కలేదంటే నమ్మండి. అహ్మదాబాద్లో అంత్యక్రియలకు హాజరుకాకుండా మోడీ ఆదేశాల మేరకు ఆయన భార్య యశోదాబెన్ను అడ్డుకున్నారు సుమా! అదేంటి? అంత్యక్రియలకు రాకుండా ఎవరైనా అడ్డుకుంటారా! అని ఆశ్యర్యపోకండి. వాస్తవంలో జరిగిందిదే. సాక్షాత్తు మోడీజీ, తన భార్యను తన తల్లీ అంత్యక్రియల్లో పాల్గొనివ్వకుండా పోలీసులను పెట్టి మరీ హౌస్అరెస్ట్ చేయించారు సుమా!!. అలా ఎందుకంటారా? ఒకవేళ యశోదాబెన్ మోడీ తల్లీ హిరాబెన్ అంత్యక్రియలకు వస్తే, ఆమెను తన భార్యగా అంగీకరించినట్టే అవుందనే ఆలోచనతోనే పోలీసు కాపలాపెట్టినట్టు బీజేపోళ్లే చెవులు కొరుక్కుబట్టే... హతవిధి!
- బి.బసవపున్నయ్య