Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాకిళ్ళు చిమ్మి, కళ్లాపి చల్లి,
ఒంటిని వింటిగా చేసి,
తెల్లని పిండిని
వేళ్ళ సందుల్లోంచి
చుక్కలుగా జాలువార్చి,
నిండుగ చుక్కలతో
పుడమి ఎదపై
మెలికలు తిరిగే రేఖలతో
సప్తవర్ణాలనద్ది
పసుపు కుంకుమలను
వాయనంగా వసుధకిచ్చే
ముదితల కరపల్లవాల్లో
పురుడోసుకొనే రసరమ్యరూపాలై
ముంగిళ్ళలో కొలువుదీరుతూ,
హరివిల్లు నేలపై ఒదిగిందా
అన్నట్లుగా మనోభావాలకు
పట్టం కడుతూ,
ఇంతుల సృజనాత్మకతకు ప్రతీకలై
సంస్కృతి సంప్రదాయాల కిరవై
నయనానందకరమై
మనసులకు మరులు గొల్పుతూ
హృదయాలను అలరించే
రంగవల్లులు
స్వాగతం పలుకుతున్నాయి
ఈ సంక్రాంతికి...
- వేమూరి శ్రీనివాస్
9912128967