Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాననుకున్నారా? రాలేననుకున్నారా? అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చారు. ఏదో రకంగా వార్తల్లో ఉండే ఆయన... శుక్రవారం గాంధీభవన్‌కు రావడంతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలవడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, ఆ వీడియోలను విడుదల చేయడం, దాన్ని మీడియా ఆకాశానికెత్తడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆకాశం, భూమి కలిసిపోయినట్టుగా సామాజిక మాద్యమాలు ప్రచారం చేశాయి. కానీ అంతలోనే వెంకన్న తుస్ మనిపించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ఆయన రాలే. దీంతో కథ సుఖాంతమైందనుకుంటున్న కాంగ్రెస్‌కు కథ మళ్లీ మొదటికొచ్చింది. గాంధీభవన్‌లో ఎంతో ఉషారుగా కనిపించిన వెంకన్న... ఈ రోజు ముఖం చాటేశారు. దీంతో వెంకన్న ఏం చేసినా వార్తల్లో వ్యక్తిగా ఉంటాడు. సొంత పార్టీపైన్నే ఆయన బాణం ఎక్కుపెడతాడు. నేతలపైనే ఆయన మండిపడుతాడు. గతంలో ఉత్తమ్కుమార్రెడ్డినీ వదల్లేదు, ఇప్పుడు రేవంత్‌ను వదలట్లేదు. ఆయనేం మనిషయ్యా బాబూ అని గాంధీభవన్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.
- గుడిగ రఘు